(అంశం:”బానిససంకెళ్లు”)
బానిస బతుకులు
రచన: సంజన కృతజ్ఞ
బానిస సంకెళ్లనీ
చితికిన బతుకులనీ
ఆవేశించిచావంటే అవిటితనం
ఆక్రోశించావంటే ఆయుర్థాయం
అవిటితనం నిన్ను ఆపజాలదు
ఆయుర్థాయం నిన్ను గెలవ జాలదు
నీకు నువ్వ బానిస అవ్వు
నీ చుట్టూ ఉన్న సమాజానికి కాదు.
నీకు నువ్వు రాజువు అవ్వు
నీ చుట్టూ ఉన్న బానిసలకు కాదు.
బానిసత్వానికి అలవాటు పడ్డవాడు.
తన బలాన్ని ఎప్పటికీ గుర్తించలేడు.
మనిషెప్పుడు బానిసే..
కాసుల కొరడాలకి ,
ధనరాశుల బేడీలకి.
మనిషెప్పుడు బానిసే..
విశ్రమ జీవితానికి,
నాలుగంకెల కాగితానికి.
మనిషే మనిషికి బానిస
అవసరార్థం
మనిషి కదా…