నా అంతిమ విజయం

(అంశం:: “సాధించిన విజయం”)

నా అంతిమ విజయం

రచన :: డి. స్రవంతి

ఉదయం నుండి ఉరుకుల పరుగులతో నగరవాసుల జీవితం .హడావుడిగా అందరూ ఎవరికి వారే యమునా తీరే అని తమ గమ్యాన్ని చేరాలని ఆతృతతో పరుగులు పెడుతున్నారు.

“గుడ్ మార్నింగ్ మేడం”అంటూ పలకరించాడు వాచ్మెన్. అందుకు గుడ్ మార్నింగ్ బాబాయ్ అంటూ చిరునవ్వు నవ్వింది . “ఏంటే మేడం అని పలకరిస్తూ ఉంటే నువ్వు బాబాయ్ అని అంటున్నావు అంది తన స్నేహితురాలు లలిత. మన అనుకొని మాట్లాడితే తప్పేముందే దానికి ఏమైనా కర్చు అవుతుందా…నువ్వు మారవే అంటూ..
ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. కొలీగ్ సౌమ్య తన పెళ్లి కుదిరిందని అందరూ కుటుంబ సమేతంగా రావాలని ఇన్వైట్ చేసింది.
ఆ కార్డును అలానే చూస్తూ ఆలోచనలో పడింది సుప్రియ ” తోరణాలతో అలంకరించిన గుమ్మాలు స్వాగతం పలుకుతున్నాయి, బంధుమిత్రుల తోటి, చిన్న పిల్లల కేరింతలతోటి, పసిపిల్లల నవ్వుల ఇల్లంతా వెలుగుతుంది. తన పెదవులపై చిరునవ్వు చూసి …
హాలో మేడం… ఊహల్లో తేలిపోయింది చాలు..అన్న లలిత మాటలకు ఒక్కసారిగా ఈ లోకం లోకి వచ్చింది. నా ఊహలు నిజం కావాలని ప్రతిరోజు దేవున్ని ప్రార్థిస్తున్నాను.

సుప్రియ అందం, తెలివి, మంచి ఉద్యోగం ఉన్నా తను అనాధ.తనకంటూ ఎవరూ లేరు. అమ్మ అనాధ శరణాలయంలో పెరిగింది.
దాతల సహకారంతో చదువుకొని సాఫ్టువేర్ ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబం అనే కలల ప్రపంచంలో బ్రతుకుతుంది.

ఆఫీసుకు దగ్గరలో ఫంక్షన్ హాల్ ఉండడంతో సౌమ్య పెళ్ళికి అందరూ ఆఫీస్ నుండి బయలుదేరాలి అనుకుకొని బయలుదేరారు . సుప్రియను తదేకంగా అందరూ చూస్తూ ఉండిపోయారు. “ఏంటే లల్లి …అందరూ అలా చూస్తున్నారు …చూడరా మరి ఎంత అందంగా ఉన్నావో తెలుసా! కుందనపు బొమ్మలా ఉన్నావు అంది లలిత.

అందరూ పెళ్లిలో సందడి చేస్తూ ఉంటే కొంచెం బెరుకుగా చూస్తూ ఇబ్బంది పడుతున్న సుప్రియను నువ్వు పెళ్లిళ్లకు పండుగలకు వెళ్ళిందే లేదని నాకు తెలుసు.
ఫ్రీ గా ఉండనీ అందరికీ పరిచయం చేసింది
లలిత.

ట్రింగ్.. ట్రింగ్.. ఫోన్ మోగింది
హాయ్.. హాయ్.. సౌమ్య
“సడన్ సప్రైజ్ ” ,”హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్” ….
ఓకే హ్యాపీ.. అంటూ సౌమ్య.. సడన్ సప్రైజ్ నీకు. నీతో ఒక విషయం మాట్లాడాలి..నువ్వు ఏమంటావో అని….
ఇటు నుండి ఎవరే .. ఫోన్ లో… సౌమ్య నా తో ఏమో చెప్పాలి అంటుంది . ఇంకేముంది మ్యాచ్ ఫిక్స్ చేయాలనుకుంటుంది ,పెళ్లి ప్రపోజల్ కావచ్చు ,స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అన్నది లల్లీ. మా బంధువులలో పెద్దాయనకు నువ్వు నచ్చావు తన తమ్ముడి కొడుకుకి నిన్ను ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి….. ఓకే ఇష్టమని చెప్పింది లల్లి.
ఏంటి లల్లి … అలా చెప్పావు.నీకు తెలుసుగా నాకంటూ ఒక కుటుంబం ఉంది అని నమ్ముతున్నాను,నేను నా వాళ్ళను చేరుకోవాలి…..
చాలు చాలు…నిజం వేరు నమ్మకం వేరు. ఇప్పటికైనా వాస్తవంలో జీవించు నీకంటు ఒక కుటుంబాన్ని వివాహబంధం తో ఏర్పాటు చేసుకో…..
అలాగే … కానీ..చివరిసారిగా ఒక ప్రయత్నం చేస్తాను.
ఇన్ని సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కదా!
“కష్టేఫలి” అన్నారుగా చివరిసారిగా ప్రయత్నం చేసి,నువ్వు చెప్పినట్లు గానే పెళ్లి చేసుకుంటా అంటూ…… తను
అమ్మశరణాలయం కు చేరుకుంది. చివరి ప్రయత్నంగా అక్కడ కొన్ని వివరాలు సేకరించింది. ఇంతలో సౌమ్య నుండి ఫోన్ . హలో ! సుప్రియ నిన్ను ఒకసారి కలవాలి అని అంటున్నారు . నా విషయాలు అన్ని చెప్పావా సౌమ్య …
ఆ…..నువ్వు వచ్చిన తర్వాత అంతా అర్థమవుతుంది వెంటనే కాఫీ షాప్ కి రా చెప్పింది సౌమ్య ..
రా… ప్రియా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఈయనే రామచంద్ర రావు గారు వారి తమ్ముడి కొడుకు పెళ్లి గురించి అడిగింది. ఆ పేరు వినగానే సుప్రియ మదిలో ఎక్కడో విన్న భావన కలిగింది. మీరు అనాధ శరణాలయంలో ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్ళడం కానీ చేశారా? తటపటాయిస్తూ అడిగింది సుప్రియ నేను వెళ్లడం కాదమ్మా కొన్ని సంవత్సరాలుగా అమ్మఅనాధ శరణాలయంలో పిల్లల సంరక్షకునిగా ఉన్నాను. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయినా ..ఇవన్నీ అడుగుతున్నావ్ ఎందుకమ్మా ! నేను ఆ శరణాలయంలో పెరిగాను నా తల్లిదండ్రులను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను అని తన పూర్తి వివరాలు చెప్పింది. రామచంద్ర రావు గారు పూర్తి వివరాలను తీసుకొని తన తల్లిదండ్రులు ఎవరన్నది చెప్తా అన్నాడు.

అలా..కొన్ని రోజుల తరువాత
రామచంద్ర రావు గారి నుండి ఫోన్ .
అమ్మ సుప్రియ ఒకసారి కాఫీ షాప్ కి వస్తావా నీతోటి మాట్లాడాలి అన్నారు. అక్కడికి చేరుకున్న సుప్రియకు ఆశ్చర్యం అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు .అందులో ఒకరు రామచంద్ర రావు గారు మరొకరు ఎవరు అని తనలో తాను అనుకుంటూ వెళ్ళింది నీ కోసమే ఎదురు చూస్తున్నాను ,ఇతనే నీ తండ్రి అని చెప్పడంతో…… సుప్రియ కన్నీటి దార ఆగలేదు.. తనలో ఊబికి వస్తున భావాలను కన్నీటి ద్వారా వ్యక్త పరిచింది .మనసు వేదనతో నిండి ఆ భారాన్ని ఒక్కసారిగా గట్టిగా నవ్వి ఏడ్చింది..
నన్ను క్షమించు తల్లి నేను ఏ తండ్రి చెయ్యకూడని తప్పు చేశాను. కొడుకులు కావాలని దురాశతో…. ఆడపిల్లలు వద్దని, తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో శరణాలయంలో నిన్ను వదిలి వెళ్ళాను …తల్లి నన్ను క్షమించు ,ఇన్ని సంవత్సరాలు బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని తిరుగుతూ చివరికి ఇక్కడికి చేరాము. నిన్ను చూడాలని రామచంద్ర రావు గారిని కలవాలని వెళ్లాను అక్కడ వారు లేకుంటే నా పూర్తి వివరాలు ఇచ్చి ఇలా…. ఈవిధంగా నిన్ను కలవడం జరిగింది. ఏ తండ్రి కూతుర్ని ఈ పరిస్థితిలో చూడకూడదు ,కూతుర్ని పరిచయం చేసుకునే ఇటువంటి దీనస్థితి ఏ తండ్రికి రాకూడదు నన్ను క్షమించు తల్లీ….

సుప్రియ తన తల్లిదండ్రులను చేరుకుంది. హలో.. హలో.. లల్లి” నేను సాధించిన విజయం నా తల్లిదండ్రులను కలవడం” నేను కన్న కలలు నిజమయ్యాయి ఇప్పటికైనా నమ్ముతావా నా ఊహలు ఊహలు కావని నిజాలని…….
ఇంకేంటి కుందనపు బొమ్మ పెళ్లికి రెడీ అవ్వు…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!