అడుగు

అడుగు

రచన: చెరుకు శైలజ

అమెరికా నుండి వచ్చిన కవితకు ఏమి తోచడం లేదు. ఎప్పుడు తాను ఖాళీ గా లేదు .
పిల్లల చిన్నప్పుడు మధ్య లో కొన్ని రోజులు జాబ్ చేసింది . ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జాబ్ తనకు చేయవలసి వచ్చింది.ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి, అత్తగారి సహాయం కూడా వుండేది. దానితో ఏ సమస్యా లేకుండా ఉద్యోగం చేసింది. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యాక ,కొడుకు అమెరికా లో వుంటున్నాడు. కూతురు తనతోనే వుంది. పెళ్లి కాలేదు .కోడలు కడుపుతో వుంది. నీవు రావాలి కష్టంగావుంది అని కొడుకు ఫోను చేసి చెప్పాడు. అప్పటికి ఉద్యోగం చేస్తూనే వుంది.కదనలేక ఉద్యోగం వదిలి అమెరికా ప్రయాణం అయింది .4నెలలకోసం డెలీవరీ ముందు తను డెలివరీ తర్వాత కోడలు తల్లి వెళ్లుతుంది. అమెరికా చేరి మూడు నెలలు అయ్యాక
ఇండియా నుండి ఫోన్స్ స్కూల్ మొదలు కాగానే వస్తున్నారా, లేట్ అవుతుందా, అని అడగడం, నేను ఇంకా వాళ్ళ బాధను అర్థం చేసుకొని, వేరే టీచర్ని తీసుకోమని చెప్పాను . మధ్య మధ్య ఇలా ప్రయాణాలు వుంటే స్కూల్లో పిల్లలు నష్టపోతారు అనే దృష్టితో చెప్పేశాను .
ఇండియాకు వచ్చాను. వారు రోజులు వెదర్ మారడం వలన కొంచెం ఆరోగ్యం సహకరించలేదు. నేను పని చేసిన స్కూల్ కి వెళ్ళాను .నేను చదువు చెప్పిన తరగతి లోకీ వెళ్ళాను .పిల్లలు టీచర్ ,టీచర్ అంటు ఆనందం గా వచ్చి నన్ను చుట్టేశారు. మాకు చెప్పకుండ వదిలి ఎటు వెళ్ళారు. టీచర్ అంటు అమాయకంగా అడుగుతు వుండే, నిజంగా, నా పిల్లలు ,నేను వదిలి ఎలా వెళ్ళాను .కరెక్ట్ గా వాళ్ళ సంవత్సరం పరీక్షల ముందే వెళ్లాను.నాకు వాళ్ళను పరీక్షలు మంచిగా రాయించి, వాళ్ళ కి చెప్పి వెళ్ళాలి అని వుండే, కాని మా బాబు ఫ్లైట్ నన్ను అడగకుండానే టీకట్ బుక్ చేశాక నాకు చెప్పాడు. ఒకవేళ టికేట్ పోస్ట్పోను చేస్తే డబ్బులు వెస్ట్ అవుతాయి అన్నాడు. అందుకే ప్రయాణం అయ్యాను. నా పిల్లలకు అమెరికా వెళ్ళెది చెప్పాకుండ, పరీక్ష లు బాగా రాయాలి.అని దైర్యం చెప్పి బయలుదెరాను. ఇప్పుడు వచ్చి వాళ్ళను చూడం బాధేసింది .మాట తప్పాను .నా ప్లేస్ లో వున్న టీచర్ నన్నె చూస్తుంది .ఆమెకు డిస్టర్బ్ అవుతుందని, వాళ్ళకు తెచ్చిన చాక్లెట్లు ఇచ్చి, బాగా చదువుకొండి అని చెప్పి ఇంటికి వచ్చాను. తొందరపడి జాబ్ వదిలి పెట్టానా? ఆలోచించాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.నేనే ఒక లైబ్రరీ పెడితే, నేను లైబ్రేరియన్ గా కూడా జాబ్ చేశాను. అందుకే ఆ ఆలోచన వచ్చింది. కమ్యూనీటిలో ఒక లైబ్రరీ రూం వుంటుంది.అందులోనే టీచర్స్ డే రోజు మొదలు పెట్టాను .మా కమ్యూనిటీలో వున్న అందరికి చెప్పాను. మీ దగ్గర అటక మీద వున్న పుస్తకాలు,ఇక్కడ లైబ్రరీకి డొనేట్ట్ చేయమని, అలాగే చాలా మంది మంచి పుస్తకాలు ఇచ్చారు. మార్నింగ్ వన్ అవర్, ఈవినింగ్ వన్ అవర్, వెళ్లి కూర్చోనే దానిని . మెల్లగా మంది రావడం మొదలు పెట్టారు. ఒక డొనేషన్ బాక్స్ పెట్టాను. ఎవరైనా లైబ్రరీకి డబ్బులు డొనేట్ చేస్తే ఆ బాక్సులో వేయడానికి ,ఆ డబ్బు లతో నెలకి ఒకటి, రెండు కొత్త బుక్స్ కొనేదానిని. నా స్వంతం మూడు వందల పుస్తకాలు పెట్టాను. లైబ్రరీకి వచ్చిన ప్రతి వారు,ఇలా ఉరికే పెట్టడం వలన మీకు ఏం లాభం,అని అడిగేవారు.ఇన్ని రోజులు నా కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు నాలుగురికి ఉపయేగపడే ఒక పని చేయాలనుకున్నాను.అందుకే ఒక అడుగు వేశాను. ప్రతి ఒక అపార్ట్మెంట్ లో ఒక లైబ్రరీ వారితోనే ఏర్పాటు చేయించలని ,అలాగే నేను పుట్టి పెరిగిన మా ఊరిలో వీలైతే, ఆ చుట్టుపక్కల గ్రామాల లో కూడా లైబ్రరీల ఏర్పాటు చేయలని అనుకుంటున్నాను.తను చేయాలనుకున్నా, పని విని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. వాళ్లు తమ వంతు కృషి గా తనతో పాటు అడుగు వేయలనుకుంటున్నాము అని చెప్పారు. కవితకు వాళ్ళ మాటల వలన తన సంకల్పం ఇంకా బలపడినట్టుగా అనిపించింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!