నైతికవిలువలు

నైతికవిలువలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

హర్ష 8వ తరగతి చదువుతున్నాడు అల్లరి చిల్లరగా తిరుగుతాడు. ఇంటి దగ్గర కూడా భయం లేదు.ఒక్కడే కొడుకు కాబట్టి సతీష్ గారాభం చేసాడు.సతీష్ కూడా ఒక మధ్యతరగతి ఉద్యోగి. సతీష్ అమ్మా నాన్నా కూడా వృద్ధాప్యం అవ్వడం వలన సతీష్ దగ్గరే వున్నారు.వాళ్లు కూడా మనవడు కాబట్టి హర్ష ను అల్లరి ముద్దుగా పెంచారు.
ఒకరోజు స్కూల్ లో మార్కులు చేప్పారు అన్నింటి లోను తక్కువ మార్కులు వచ్చాయి.అందరూ హేళన చేశారు.ఇంటి దగ్గర కూడా ఆ రోజు మౌనం గానే వున్నాడు.అందరూ అడిగారు.విషయం చెప్పాడు. వాళ్ళ తాతయ్య వెంటనే దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టి నాలుగు మంచి మాటలు చెప్పాడు.

సతీష్ కూడా చాలా బాధపడ్డాడు. ఎలాగైనా మార్పు తీసుకొనివద్దమనుకున్నాడు.చెబితే కాస్తా వినెరకమే కాబట్టి నయానో భయానో దారిలో పెడదాం అనుకున్నాడు.ఎందుకంటే వాడికి చదువులో తక్కువ మార్కులు వచ్చాయని హేళన చేస్తున్నారని భాదపదుతున్నాడు.కాబట్టి మారవచ్చు అనుకున్నాడు.
ఇదే సమయం అనుకోని తాతయ్య చదువు విలువ తెలియచెప్పాడు. అంబేద్కర్ అబ్రహం లింకన్ అబ్దుల్ కలాం మొదలగు కదలెన్నో చెప్పాడు. ఇలా రోజు చెప్పడం వలన కొన్నాళ్ళకి హర్షా లో బాగా మార్పు వచ్చింది.ఒక మంచి విద్యార్థిగా తయారయ్యాడు
హర్షా తన జీవిత విధానం లో మార్పులు తెచ్చుకున్నాడు.పెద్దలకు గౌరవం ఇవ్వడం స్నేహితులతో కలిసి మెలిసి ఉండడం అలవాటు చేరుకున్నాడు.మంచి నీతి కథలు పుస్తకాలు దేశభక్తుల కథలు చదివి లోక జ్ఞానం పెంచుకున్నాడు.అందరికి సాయం చేయడం చేదోడు వాదోడుగా ఉండడం అలవాటు చేసుకున్నాడు.ఇంట్లో కూడా అందరూ ఈ మార్పు చూసి ఆనంద పడ్డారు.ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాడు.
తరువాత పరీక్షలలో హర్షా తరగతి కి ఫస్ట్ వచ్చాడు.అందరూ మెచ్చుకున్నారు.ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు.స్నేహితులు పొగిడారు.ఆనందానికి అవదులు లేవు.ఇంటికి వెళ్లి తాతయ్యా ను గట్టి గా పట్టుకొని ముద్దులాడి విషయం చెప్పాడు.ఇంటి అందరూ సంతోషించారు.తాతయ్యతో ఈ రోజు నాకు క్లాస్ ఫస్ట్ రావడానికి నువ్వే కారణం అని తాతయ్యకు చెప్పగానే నువ్వు ఎంత ఎదిగి పోయావురా అంటూ ఆనంద భాష్పాలు కార్చాడు తాతయ్య.
ఇంకా ఆ రోజు నుండి హర్షా చదువు లోని క్రమశిక్షణ లోని వెనుదిరిగి చూడలేదు. ఇపుడు ఇలా మంచి చెప్పే పెద్దలు కరువయ్యారు.పిల్లలు మట్టి ముద్దలు వారిని మనమే తయారు చేసుకోవాలి. నైతికవిలువలు తో కూడిన విద్యను అందిస్తే పిల్లలు రేపటి పౌరులుగా తప్పక తయారవుతారు.పిల్లలకు సెల్స్ కాకుండా పుస్తకం చదివే అలవాట్లు నేర్పాలి.పుస్తకం హస్తభూషణమే కాదు.విజ్ఞాన మణిహారం అని గ్రహించాలి.ముఖ్యం గా పెద్దలు ఈ విషయం లో తగు శ్రద్ధ చూపితే పిల్లలు బంగారు భవితను చూస్తారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!