మొక్కలు కలిపిన జంట

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
మొక్కలు కలిపిన జంట
రచన::Rj రాల్స్ చిరునవ్వు

అమాంతం వెళ్లి వంగి కడవని పైకి తీస్తున్న రాధ మెడలో తాళి కట్టేసాడు కౌటిల్య…..ఆ చోధ్యం చూస్తున్న చుట్టుపక్కల వారు నోర్లు వెల్లబెట్టుకున్నారు….

సంవత్సరం క్రితం

రత్నం చూసావా నీ కొడుకు ఒట్టి వెంగలప్ప ఏమి తెలీని వెర్రిబావులోడు అంటూ వెనకేసుకొస్తావుగా నా పరువు తీసేస్తున్నాడు.
నడి రోడ్డులో ఆ సూరయ్య నన్ను ఆపి గోవిందు మీవాడు మరీ మితిమీరిపోయాడు. ఇంటి బయటి చెత్తడబ్బాలను సైతం దొంగిలించుకెళ్తున్నాడు హద్ధుల్లో పెట్టుకుంటావా సరేసరి లేదంటే పంచాయితీ పెట్టాలిసి వస్తుంది అని బెదిరించెల్లాడు..
కౌటి ఆలా చేయడం తప్పుకదానాన్న.
నీకిప్పటికే ఇరవైఐదు సంవత్సరాలోచ్చాయ్ నువ్ పెద్దవాడివి చిన్నపిల్లాడిలా ఏంటి ఈ పనులు.  ఇంకెప్పుడు ఇలా చేయను అని అమ్మకి మట్టివ్వు…సరే అమ్మ.
ఏం చేయమంటావ్ మరీ మనకి డబ్బా లేదని పట్టుకొచ్చా…..
ఆలా కాదు నాన్న మీ నాన్నలా పనికెళ్తే డబ్బులోస్తాయ్ అప్పుడు మనం అన్నీ కొనుక్కోవచ్చు…

ఆ..కొన్ని రోజుల్లో ఇలా

అమ్మ రాధ…. పాపం ఆ… కౌటిల్యకి ఎవ్వరు పనిలో పెట్టుకోట్లేదంట మన తోటకి నీళ్లు పట్టడానికి పనికొస్తాడేమో చూడమ్మా..
ఓస్ ఓస్ కౌటి నా పేరు రాధ తెలుసుగా నీకన్న వయసులో రెండు సంవత్సరాలు చిన్నదాన్నే అయినా గులాబీ తోటను నే.. ఒక్కదాన్నే సాగు చేస్తున్న.అమాయకంగా ఉంటే ఎవ్వరు పట్టించుకోరు పని నేర్చుకో ఆ చేతి పంపు నుండి నీళ్ళేట్టుకొచ్చి రోజు మొక్కలకి పోయాలి,మొక్కల మధ్యనున్న వినాయకుడి ముందు దీపమెట్టాలి ….

అదే పనిగా గులాబీ తోటలో బతుకు పాఠాలు నేర్చుకుంటున్న కౌటిల్యకి వింత అనుభవం ఎదురైంది…
తోటలో మనుషులు లేకుండానే ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు కౌటి చెవిలో మ్రోగుతున్నాయి.. ఎవరివా..మాటలు అని తిక్షణంగా గమనించిన కౌటిల్యకి గులాబీ ముళ్ళు గట్టిగా గుచ్చి ఎంట్రోయ్ మా మాటలు చాటుగా వింటున్నవ్ అని మొక్కలు కసురుకోగా పరిగెత్తుకు  రాధ దగ్గరికొచ్చాడు…..

కౌటి ఆయాసపు మాటలు విన్న రాధ ఒక చిన్న నవ్వు నవ్వి ఓస్ ఓస్ వాటి మాటలు విన్నావా…..
హ.. విన్నగా నువ్వు బాగా అందగత్తెవని నీ జడకి హత్తుకోవాలని ఆరాటపడుతు ఒకటే గోల…
హేయ్ కౌటి ఆ… గోల పక్కనెట్టి గణేషుడికి దీపమెట్టి ఇంటికెళ్ళు…….
కౌటిల్య ఇంటికెళ్తూ ఒక గులాబీ మొక్కను రాధాకి అడక్కుండా దొంగిలించుకు తీసుకెళ్లాడు….
మొదట కౌటితో రాడానికి బాగా మోరాయించిన మొక్క తీరా ఇంటికొచ్చాక రత్నంగారి మాటలు ( ఏంటయ్యా కౌటికి పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి వల్ల వాడు మారిపోతాడేమోగా బాగా తెలివైన అందమైన అమ్మాయిని వెతకండి ) విని ఒక పన్నాగం పన్నింది….

కౌటిల్య ఆత్రుతగా మొక్క దగ్గర కూర్చుని మీకు మాటలెలా వచ్చాయి అని పదే పదే అరతీసాడు….తోటలో రాధ మాచుట్టూ తిరుగుతున్నంతసేపు మా తలలు ఆమెవైపే తిరిగి చూడటం గమనించిన వినాయకుడే మాకీ వరాన్నిచ్చాడు… ఆ రోజు నుండి పోటా పోటీగా నా పువ్వుని తల్లో పెట్టుకో అని మాకు రాధాకి వాదన.
రాధ నీలా మొదట్లో అశ్చర్యపోయిన మా అల్లరి మాటలకి అలవాటైపోయింది…..

కౌటిల్య తోటలో తిరుగుతున్నంతసేపు పచ్చిగా రాధ అందాన్ని వర్ణిస్తున్న మొక్కల మాటల భావాన్ని గ్రహించని కౌటికి జ్ఞానాన్ని ప్రసాధించాడు గణేషుడు.

ఆ మరుసటి రోజు నుండి తోటలోని మొక్కలు ,ఇంట్లోని మొక్క తన ప్రతీ ఆలోచన రాధే అనేలా కౌటిల్య బుర్రని మార్చేసాయి…..రాధ రూపాన్ని నరనరాల్లో జిర్నించేసుకున్న కౌటికి తనని పొందాలనే తపన రోజు రోజుకి పెరిగిపోయింది.
ఇంట్లోని మొక్క దగ్గర కూర్చొని రాధ రాధ అంటూ పరితపిస్తున్న మాటలు విన్న గోవిందు రాధావాళ్ళ తండ్రి సంద్రయ్యను కలిసి రాధ ముందే కౌటికి తెలియకుండా వారి వివాహం నిశ్చయించుకున్నాడు….
ఆ విషయం తెలియని కౌటి తోటకెళ్లి నీళ్లు పడుతుంటే రాధ దగ్గరకొచ్చి నాకు పెళ్లి కుదిరింది కచ్చితంగా నా పెళ్ళికి రావాలి అని ఆటపట్టిస్తుంటే భరించలేని కౌటి
నీళ్లకడవని గణేషుడి దగ్గరే పెట్టి హడావిడిగా లోపలికెళ్లి పసుపుకొమ్ముకి తాడు కట్టుకొచ్చి రాధ వంగి ఆ కడవని పైకి తీస్తుంటే అమాంతం వెళ్లి రాధ మెడలో తాళి కట్టేసాడు.
చుట్టుపక్కల వాళ్ళు నోర్లు వెల్లబెట్టుకున్నారు…..
వేలాడుతున్న తాళిని అరచేతుల్లోకి తీస్కొని కళ్ళకి అద్దుకుని ఓస్ ఓస్ నీ ఇల్లు బంగారంగాను అంటూ కౌటిల్యని కౌగిట్లో బంధించేసి……
ఇలా అంది : మొక్కలు మాట్లాడుతున్నాయి నీ అందాన్ని పోగుడుతున్నాయి అంటూ  పరుగు పరుగున నా దగ్గరికి వచ్చినపుడే నిన్నే నా భర్తగా అనుకున్నాను… ఎందుకంటే   నా యవ్వనాన్ని నాకు గుర్తుచేసిన మొక్కల మాటలకి తోడుని వెతుక్కుంటున్న వేళ నిన్ను తోటకి రప్పించాడా గణేషుడు అధిగాక ఓ కన్నెపిల్ల అందాన్ని పచ్చిగా వర్ణించిన మొక్కల మాటలు ఏ మాత్రం లెక్కచేయని పసి పిల్లోడిలాంటి భర్త నాకు దొరకగలడా…… తోటలోని మొక్క మీ ఇంట్లో చూసిన వెంటనే మా మధ్య ఒక ఒప్పందం కూడ చేసుకున్నాం. నాతో వివాహానికి సంబంధాన్ని మాట్లాడేలా ఆ మొక్క చేస్తే దానికి పూసే పూలని రోజు నా జడలో పెట్టుకుంటా అని. అనుకున్నట్టుగానే గోవిందు మావయ్య నాన్నతో వచ్చి మాట్లాడారు అనగానే రాధ మాటలకి అక్కడి మొక్కలు, చుట్టుపక్కల వాళ్ళు, కౌటిల్య ఓస్ నీ ఇల్లు బంగారం గాను అంటూ మళ్ళీ నోర్లు వెల్లబెట్టారు. వాళ్ళ పక్కనే ఉన్న గణేషుడు తధాస్తూ శుభం పలికాడు.

మీ చిరునవ్వు rj.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!