శేఖర్ బాబాయ్

శేఖర్ బాబాయ్

రచయిత :: జయకుమారి

పిల్లని స్కూల్ నుంచి తీసుకురావాలి టైం అవుతుంది మళ్ళీ కీర్తి ఏడుస్తుంది రాజేష్ త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేయండి.
ఇద్దరం వెళ్లి కీర్తి ని తీసుకొని ,కీర్తి పుట్టినరోజు కి షాపింగ్ కూడా చెయ్యాలి కదా !
ఆ పని  కూడా అయ్యిపోతుంది.
సరేనా  ! ఇక ఉంటాను అని కాల్ కట్ చేసి.
ఇంటి పనులు త్వరగా పూర్తి చేసి ,రెడి అయ్యి రాజేష్ కోసం ఎదురుచూస్తుంది జాను.

రాజేష్ అనుకున్న టైం కి ఇంటికి వచ్చి స్కూల్ దగ్గరకు బయలు దేరారు.

పుట్టినరోజు వేడుకలు గురించి మాట్లాడుకుంటూ వేగంగా వెళ్తున్నా కార్ హఠాత్తుగా బ్రేక్ వేసేసి ఇద్దరు అలా ఉండి పోయారు ఇద్దరు.
ఓహ్ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అని కార్ దిగి ఎదురుగా పడి ఉన్న తాతను, అతని సైకిల్ ని లెవ తీసి, దెబ్బలు ఎక్కడైనా తగిలయా తాత.
అయిన ఈ వయసులో ఒంటరిగా ఎక్కడికి ఇన్ని సంచులు ఏంటి.

తాత:- ఏముంది బాబు పొట్టనింపుకోవడం కోసం ఆరాటం. తప్పదు కదా బాబు జీవన పోరాటం. మీరు  బ్రేక్ వెయ్యకపోతే ఏమి జరిగేదో, మా ముసలిది ఏమైయ్యేదో తలుచుకుంటేనే, గుండెల్లో గుబేలు మంటుంది బాబు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు.
మీరు ఎప్పుడు బాగుండాలి బాబు.
రాజేష్:- సరే తాత మీరు ఈ వయస్సు లో కష్ట పడటం ఏంటి ?
మీ పిల్లలు ఏమి చేస్తున్నారు.
తాత:- మాకు పిల్లలు లేరు బాబు
నాకు తను,తనకి నేను .మేము ఇద్దరమే.
ఉన్నా ఒక కొడుకు ని కూడా తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు ఆ భగవంతుడు,
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ,మా కళ్ల ఎదురుగా,రోడ్డు ప్రమాదంలో 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు.
అప్పటి నుండి బడిపిల్లలకి చిరు తిల్లు అమ్ముతూ బ్రతుకుతున్నాo బాబు,
అంటూ ఏడుస్తున్న తాత ను ,ఓదార్చి, తన అడ్రెస్, ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చి .నేను రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తాను తాత. ఈ లోపు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యండి.
అప్పటివరకు  ఈ డబ్బులు ఉంచుకో అని ఇస్తూన్న రాజేష్ మాటకి అడ్డు తగులుతూ.
తాత:-అదేమి వద్దు బాబు.
మీరు నా ప్రాణం కాపాడారు అది చాలు.
ఎవరి దగ్గర ఏమీ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు.
ఏమి అనుకోవద్దు బాబు.

రాజేష్:- మరి ప్రతిరోజు ఇలా బరువుతో స్కూల్ దగ్గరకు ఎలా వెళ్తావ్ తాత.

తాత:- నిలకడగా ఒక చోట పని దొరుకుతుంది ఏమో అని చూస్తున్నా బాబు.
రాజేష్ :- సరే తాత నేను ఏదైనా చూసి పెడతాలే .
అని రాజేష్, జాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు.
జాను:-పాపం కదా రాజేష్ ఆ తాత .
కానీ, ఆ తాత మటికి చాలా ఆత్మాభిమానం కల మనిషి  లా వున్నాడు.
రాజేష్:- అవును జాను  తాత ఈ వయసులో కూడా అలా కష్ట పడుతున్నాడు  అంటే చాలా గ్రేట్.
తాత ను  చూస్తే  అచ్చం మా శేఖర్ బాబాయ్ లా అనిపించాడు.
జాను:- శేఖర్ బాబాయ్ ఎవరు రాజేష్.
నేను ఎప్పుడు చూడలేదు మన బంధువుల్లో.
రాజేష్:-జాను అతను మన బంధువు కాదు.
కానీ నా జీవితంలో మర్చిపోలేని ఆత్మబంధువు.
జాను:- ఆత్మబంధువా !
రాజేష్:- హా జాను.
నా చిన్నప్పుడు అంటే స్కూల్ కి వెళ్ళే రోజుల్లో
మే బీ నేను 4 వ తరగతి అనుకుంటా..

మా ఊరి చివర ఒక మిల్లు ఉండేది.
అక్కడే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది.
నేను ఎప్పుడూ ఆ రైస్ మిల్లు వైపు వెళ్ళేవాడిని కాదు.
ఒక రోజు మా ఫ్రెండ్ కి,నాకు ఒక గొడవ జరిగింది.
వాడు నన్ను,
నీవు పిరికి వాడివి,
నీకు ధైర్యం ఉంటే ఊరి చివర రైస్ మిల్లు దగ్గర ఉన్న మామిడిచెట్టు దగ్గరికి వెళ్లి మామిడికాయ్ కోసి తెచ్చి నాకు ఇవ్వు .
అప్పుడు ఒప్పుకుంటారా నీకు ధైర్యం ఉంది అని అన్నాడు.

వాడి మాటకి కోపం వచ్చి అమ్మ తో చెప్పకుండా
మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాను.
కానీ ఒక్కడినే.
అందులోనూ ఆ రైస్ మిల్లు పాడైపోయిన బూత్ బంగ్లా లా ఉండే ది.
అందులోనే చాలా కోతులు.
కానీ అక్కడకు వెళ్లే వరకు తెలియదు.
అందులో కోతులు ఉంటాయి అని .
అక్కడకి వెళ్లే సరికి ఎవరు లేరు కోతులు తప్ప,
ఆ కోతులు ఏమో మీదకు వస్తుంటే , భయం వేసి ఏడుస్తూ మిల్లు చుట్టూ పరేగేడుతున్న ,ఎక్కడ చూసిన కోతులే ,
వచ్చిన దారిలోను కోతులు వచ్చేసాయి.
చాలా భయం వేసి ఒక గోడ ఉంటే దాని చాటున దాకోని ఏడుస్తున్న నన్ను చూసి ఒక ఓపెద్దయాన వచ్చారు.
ఆయనను అక్కడ చూసి ప్రాణం లేచివచ్చినట్టు అయ్యింది.
పరిగేట్టు కుంటూ వెళ్లి శేఖర్ బాబాయ్ అనుకుంటూ వెళ్లి అతని గట్టిగా పట్టుకున్న.
శేఖర్ బాబాయి:- ఏడవకు నేను ఉన్నా కదా నీవు బయపడకు అని ఆ కోతులు ను పక్కకు కొట్టి నన్ను బయటకు తీసుకుని వచ్చాడు.
శేఖర్ బాబాయ్ నిన్ను చూసి కోతులు ఎందుకు పక్కకు తప్పుకున్నాయి.
నన్ను చూసి అరిచి మీదకు వచ్చాయి ఏంటి?.

శేఖర్ బాబాయ్ నవ్వుతూ
ఎరా రాజేష్ నీకు బాబాయ్ నే ,మీ నాన్నకీ బాబాయ్ నేనా !
ఉదయం స్కూలుకు రాలేదా నీ కోసం వేతకాను.
ఈ రోజు నీకోసం  పిప్పర్మెంట్ బిల్లలు,బోలెడు కడ్డీలు,  ఇంకా చాలా కొత్త ,కొత్త తినుబండారాలు తెచ్చాను.
నా ఏడుపు ,భయం పొగట్టడానికి కబురులు చెబుతూ ఇంటి దగ్గర దించేశారు.
ఆయన అక్కడ ఎందుకు ఉంటున్నారు అని అమ్మని అడిగితే ఆయనకు ఎవరు లేరు అని చెప్పింది.ఎందుకు అమ్మ?

ఇది వరకు ఆయనకు అందరూ వుండేవారు,
అన్నీవుండేవి, నీవు ఇందాక వెళ్లిన రైస్మిల్లు కూడా అతనిదే.

మరి ఎందుకు అమ్మ శేఖర్ బాబాయ్ అలా ఉన్నారు.

ఆయన ఇప్పుడు వున్నట్లుగా గతంలో ఉండి ఉంటే అంతా చాలా బాగుండేది రాజేష్.

కానీ విధి ఎవరిని ఎప్పుడు ఎలా నిలబెడుతుందో తెలియదు కదా

ఆయనకి పెద్ద ఇల్లు ,భార్య, ఒక బాబు అమ్మ,తమ్ముడు అందరూ ఉండేవారు.

ఇయన వ్యాపారం, డబ్బు కానీ భార్యను,పిల్లాడిని పట్టించుకునే వారు కాదు.
వాళ్ళ అమ్మ ఏమో కొంచెం గయ్యాలి . అతని భార్య ను నిత్యం సూటిపోటి మాటలతో వేదించే ది.
అయిన అన్ని భరిస్తూ భర్త ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉండేది.

ఒక రోజు ఏమైంది అంటే వాళ్ళ బాబు చిరుతిళ్ళు అమ్మే బండి వస్తే , నేను తెస్తాను నీవు వెళ్ళకు అని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు.
కానీ  రోడ్డు  దాటుతుంటే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో దెబ్బలు బా తగిలాయి హాస్పటల్లో చేర్చడానికి డబ్బులు  అడిగితే వాళ్ళ అత్తగారు పెద్ద గొడవ చేసింది.
ఇతనికి కబురు చేస్తే,
ఇతను వచ్చేలోపు ఆ బాబు చనిపోయాడు పాపం.
ఆ బాధ ఒక పక్క,అత్తగారు నీ వల్లే మా మనవడు చనిపోయాడు అని మాటలతో వేదించే సరికి తట్టుకోలేక ఆ రైస్ మిల్లు పై నుంచి దూకి చనిపోయింది పాపం.
వాళ్లు ఇద్దరు పోయిన తరువాత ,వాళ్ళ అమ్మ చేసిన  పని తెలిసి ,భార్య, కొడుకు తన ప్రేమ కోసం ఎంతలా ఎదురుచూసే వారు తెలుసుకొని. చాలా బాధ పడ్డారు పాపం కానీ ప్రయోజనం ఏముంది భార్య ను, బిడ్డను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు.
ఉన్నా ఆస్తిని, తమ్ముడు కి కొంత ,అనాధాశ్రమానికి  కొంత రాసేసి ,భార్య ప్రాణాలు విడిచిన చోటనే ఉంటూ.
బడిపిల్లలో తన కొడుకును చూసుకుంటూ,వారికి చిరుతిళ్ళు అమ్ముతూ, డబ్బు లేని వాళ్ళకి ఊరికినే ఇస్తూ అలా
ఆ మిల్లులో  ఆ కోతుల మధ్యనే వుంటున్నారు అని అమ్మచెప్పింది.
అప్పుడు శేఖర్ బాబాయ్ అంటే జాలి వేసింది.
అతను తన ఆస్తిని పేదలకు రాసిఇచ్చారు అని తెలిసి ఆయన మీద గౌరవం పెరిగింది.
బడి పిల్లలపై ఆయన చూపే ప్రేమ, ముఖ్యంగా నా మీద చూపే  ప్రేమ, నాకు ఐతే ఏది కావాలి అంటే అది తెచ్చిఇచ్చేవారు.
నాకు ఇష్టమైన రేగువడియాలు,మామిడిముక్కలు,గొట్టాలు అయితే ఐదు వెళ్ళకు తగిలించుకుని తింటూవుంటే భలే ఉండేది.
అది చూసి శేఖర్ బబాయ్ ఫేస్ లో ఆనందం తో వెలిగిపోయేది.
నాకు అతను చూపించే ప్రేమ చూసి బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది .

అయిన చిన్నప్పటి రోజులు చాలా బాగుండెవి జాను.
జాను:- అవును రాజేష్.

ఇప్పుడు ఎలా ఉన్నారు ఆబాబాయ్ ని నాకు చూడాలని ఉంది రాజేష్.

రాజేష్:- లేరు జాను ఆయన నేను డిగ్రీ చదివేటప్పుడు చనిపోయారు. అప్పుడు నేనే ఊరిలో లేను.
అమ్మ చెబుతుంటే  నేను నమ్మలేకపోయాను.

జాను:- ఏమైంది రాజేష్.
రాజేష్:- నేను చెప్పాను కదా ,ఆయన ఉండేచోట కోతులు కూడా ఉండేవి అని,ఆయన వాటితో చాలా ప్రేమ గా ఉండేవారు అని.

అవి ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి ఎవ్వరిని రానివ్వలేదు అంటా చాలా సేపటి వరకు, వింతగా శబ్దాలు చేస్తూ ఊరు అంతా కల తిరిగేశాయి అంట.

ఆఖరికి స్మశానం దగ్గర కూడా  చాలా గొడవ చేసాయి అంట ఆయనను దహనం చెయ్యడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యింది అంట.

చూసావా జాను , ఆ కోతులకి ఉన్నపాటి  విశ్వాసం కూడా మానవులు కు ఉండదు. వాళ్ళ తరపువారు ఎవరు రాలేదు.
చివరకు నాన్న, మరికొంతమంది ఊరివాళ్లు  కలసి ఆ కార్యక్రమం జరిపించారు అంట.

అలా ఆయన జీవితం ముగిసింది. కొంత కాలానికి ఆ కోతులు కూడా అక్కడ నుండి వెళ్లిపోయాయి.

ఆయన ఇప్పటికీ నా మనస్సులో అలా ఉండి పోయారు.

ఇప్పుడు ఆ తాత ను చూస్తే శేఖర్ బాబాయ్ గుర్తుకు వచ్చారు.

ఆ తాత కోసం ఏదైనా చెయ్యాలి జాను.
జాను:- అవును  మన కీర్తి వాళ్ళ స్కూల్ దగ్గర  ఒక చిల్లర కొట్టు పెట్టించి వాళ్లని అక్కడ ఉండమంటే సరిపోతుంది.

వాళ్ళు కూడా కాదు అని అనరు,  డబ్బులు కూడా ఊరుకునే తీసుకోరు కదా వాళ్ళు.
వాళ్ళు పని కోసం చూస్తున్నారు కదా  ,
ఇలా అయితే వారికి పని ఇచ్చిన వాళ్ళం అవుతాము.
కొట్టు పెట్టడానికి  అయిన డబ్బులు నెమ్మదిగా ఇస్తారు.ఆ డబ్బులు  వాళ్ళ పేరిట సేవింగ్ చేద్దాం వాళ్లకి తెలియకుండా.

వారికి మందుల కు పనికి వస్తాయి.

రాజేష్:- సూపర్ జాను మంచి సలహా ఇచ్చావ్.

తర్వాత రెండు రోజులకు కీర్తి పుట్టినరోజు కు తాత వాళ్ళ ను కూడా తీసుకుని వస్తాడు రాజేష్.

అప్పుడు తాత ని స్కూల్ దగ్గర కొట్టు చూపించి ఇది ఇక నుంచి మీదే అని జాను చేప్పిన విధంగా చేస్తాడు రాజేష్.

అలా శేఖర్ బాబాయ్ కి గుర్తు గా తాత కు  సహాయం చేస్తాడు  రాజేష్.
రాజేష్ చేసిన సహాయానికి తాత చాలా సంతోష పడి కృతజ్ఞతలు తెలియజేశాడు.
అప్పుడు రాజేష్ కి కలిగిన ఆనందం మాటల్లో చీపలేకపోయాడు.
ఇలా మనకు తోచినంతలో ఇతరులకు సహాయం చెయ్యడం లో కలిగే సంతోషం చాలా మానసిక ప్రశాంతత ను ఇస్తుంది.

మనకు ఉన్నదానిలో కొంత అవసరం ఉన్న వారికి సహాయం చేద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!