మూఢనమ్మకాలు

మూఢనమ్మకాలు

రచయిత :: హసీనాఇల్లూరి

హెలో మధు..
ఏంటి హెలో..ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి చావవే ఆ ఫోన్ తీసుకెళ్లి మురికి కాలువలో వెయ్యి ఇంకెందుకు అది.
అబ్బా..ఇప్పుడేమయ్యిందే అంత కోపంగా ఉన్నావు.
సరేలే.. బాగున్నవా.!?అన్నయ్య బాగున్నారా!?
హ అందరం బాగున్నాం.నువ్వెలా ఉన్నావ్!?అమ్మమ్మ, తాతయ్య అందరూ బాగున్నారా!?
హ అందరూ బాగున్నారు.చెప్పు అత్తారింటి విశేషాలు ఏంటి? పెళ్లి అయ్యి 6 నెలలు అయ్యిందో లేదో మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావ్.
మిమ్మల్ని మర్చిపోవటం ఏంటే తిక్కల్ ఇక్కడ వాతావరణం కి,ఇక్కడి వీళ్ల మెంటాలిటీ కి కొంచెం అలవాటు పడాలి కదా టైమ్ పడుతోంది.
నువ్వు వెళ్ళింది మీ అత్తారింటికి ఎదో వేరే గ్రహానికి కాదు.
హ హ హ…
ఏంటే నవ్వుతున్నావు
నువ్వు వీళ్ళని చూస్తే నిజ్జంగా అంటావ్”ఏ గ్రహం నుంచి పారిపోయి వచ్చారే బాబు”అని.
ఏంటే ఎం మాట్లాడుతున్నావ్ నిన్ను ఏమైనా సరిగా చూసుకోవటం లేదా?
బాగా చూసుకుంటారు,కానీ వాళ్ళ మూఢనమ్మకాలు వల్లే ఇబ్బంది.
అలాంటివి ఎవరికైనా ఉంటాయి కదా మనమే చూసి చూడనట్టు ఉండాలి.
నమ్మకాలు మంచివే కానీ మూఢనమ్మకాలు వద్దంటాను చిన్న చిన్నవి అయితే నేను కూడా చూడనట్టు వదిలేసేదాన్ని.ఇల్లు కట్టేటపుడు వాస్తు చూడటం మంచిది ఈ ఇల్లు అలాగే కట్టించారు,కానీ ఏ సమస్య వచ్చినా వాస్తు చూపించడం వాడేవడో కానీ వీళ్ళు దొరికారు అని ప్రతిసారి ఆది బాలేదు ఇది బాలేదు అని మార్పించడం. నేను వచ్చినప్పుడు నుంచి ఇప్పటికే రెండు సార్లు మార్చారు..మొన్న అతనెవరో మీ ఇంటి ఉత్తర దిక్కున 60 అడుగుల లోపల పూర్వికులు దాచిన నిధులు ఉన్నాయి అని చెప్తే వచ్చి ఇల్లంతా గుల్ల చేశారు.
నిజంగా ఉన్నాయేమో మనకేం తెలుసే.
నీ బొందె ఈ ఇల్లు కట్టిందే 2ఏండ్ల కిందట,పూర్వీకులు ఎలా దాస్తారే..కొంచెం అయిన ఇంగిత జ్ఞానం ఉండాలి కదే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని.
హ్మ్మ్..మీ వారు ఏమి చెప్పరా ఇలాంటివి నమ్మకండి అని.
చెప్తారు కానీ వీళ్ళు వినాలి కదా..
మా అత్తగారు తోటి కోడలు అయితే ఇంకా దారుణం ఏ బాబు వాళ్ళ కోడలికి కొడుకే పుట్టాలి అని ఎదో పసరు మందు మింగించారు..ఆ మందు ప్రెగ్నెంట్ అయిన 3 నెలల లోపు తీసుకుంటే మగబిడ్డ పుడతాడాని ఇప్పించారు ఆఖరికి అమ్మాయి పుట్టుంది.అయిన బిడ్డ అండ దశ లొనే అబ్బాయా ,అమ్మాయ అని అప్పుడే క్రోమో జోమ్స్ వల్ల ఎవరనేది అప్పుడే నిర్ణయింపబడుతుంది.వీళ్ళు 3 నెలలో మందు తీసుకుంటే అదెలా మారుతుంది చెప్తే ఆ..మా ఫలానా వాళ్ళకి పుట్టారు అంటారు,వాళ్ళకి ఆల్రెడీ అబ్బాయి అయి ఉంటాడు వీళ్ళు ఎం చేసిన అబ్బాయే పుడతాడు కదా..
ఆ అమ్మాయి కి ఇక ఇప్పుడు నుంచే ఒత్తిడి ఈ సారి అయిన సరిగ్గా మందు తిని అబ్బాయి ని ఇవ్వాలని అయిన అది ఆడదాని చేతిలో ఉండదు మగవాళ్ల నుంచి వచ్చే క్రోమో జోమ్స్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎంత చెప్పినా వినరే బాబు..
ముందు సారి ఆ పసరు మందు తీసుకొని తర్వాత చెకప్ కి వెళ్లినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులు వాడి రెండు కలిపి తేడా చేసి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో తెలుసా పాపం..హార్మోన్స్ imbalanace అయి, థైరోయిడ్ ఎటాక్ అయి హెల్త్ చెడిపోయి పాపా పుట్టే వరకు ఎలాగో manage చేసింది. డెలివరీ తర్వాత నరకం అంటే ఎంతో చూసిందె.డెలివేరీ అప్పుడు కూడా పెద్ద హుంగమా చేశారు ఆ పిల్లకి నొప్పులు వస్తే హాస్పటల్ లో జాయిన్ చేశారు వల్ల పేరెంట్స్.వాళ్ళ అత్తగారేమో ఈ టైమ్ లో పుడితే మంచిది కాదు ఇప్పుడు డేలివేరీ వొద్దని అంటుంది.అదెలాగే పుట్టుకకి,చావుని మనం ఆపగలమా నేను మా ఆయన సర్దిచెప్పి డెలివరీ చేయించేసరికి తలప్రాణం తోకకు వచ్చిందే తల్లి..
మరి ఇంత దారుణంగా ఉన్నరే మీ అత్తారింటి వాళ్ళు.అయిన ఆ అమ్మాయి హెల్త్య్ ఫుడ్ తీసుకుంటే బెటర్ గా ఉండేదేమో కదా..
ఆ క్షవరం అయ్యింది. ఆ పసరు మందు తీసుకుంటే డెలివేరీ వరకు నొంవెజ్ తినకూడదు..ఆకులు అలములు తిని ఉండమంటే ఎలానే అసలే ఆ పిల్లకి ముక్క లేనిదే ముద్ద దిగదు,అలా ఆ పిల్ల ఇంకా వీక్ అయ్యింది.
ఈ సారి అయిన అబ్బాయే పుడతాడాని గారెంటీ లేదు కదే అది అర్థం చేసుకోకుండా అబ్బాయే కావాలంటే ఎలా ?ఇలా అందరూ ఆలోచిస్తే ముందు తరాలలో అమ్మాయిలంటూ మిగులుతారా!?
నమ్మకాలు మంచివే కానీ మూఢనమ్మకాలు ఒక్కోసారి ప్రాణాలే తీస్తాయి అవి వద్దంటాను.
నల్లపిల్లి ఎదురొస్తే బయటకు వెళ్లకూడదు అంటారు ఎందుకంటే నలుపు శనికి ప్రతీక పని మీద వెళ్ళేటప్పుడు ఆ రంగు చూస్తే వెళ్లే పని అవ్వదని చెప్తారు.
గడప మీద తుమ్మితే పసుపు నీళ్లు చల్లాలి అంటారు..ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది తుమ్మితే అది పసుపుతో ఉండే గుణాల వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుంది అలా చల్లితే..
ఇక దిష్టి తీయడం అంటావా మనిషి చుట్టూ ఉండే ఆరా అనే లేయర్ ఎవరైనా మనల్ని తదేకంగా చూసినపుడు లేద మనకి నెగెటివ్ ఎనర్జీ తగిలినపుడు ఆ ఆరా అనే లేయర్ వీక్ అవుతుంది. మనం దిష్టి తీసే వస్తువులకు ఉండే పోసిటివ్ ఎనర్జీ వల్ల ఆ లేయర్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి మనం మళ్ళీ హెల్త్య్ గా ఫీల్ అవుతామ్.
ఇలా సైంటిఫిక్ రిసోన్స్ ఉన్నాయి కాబట్టే వీటిని మన వాళ్ళు ఆచరించారు.పూర్వపు రోజుల్లో ఈ సైన్స్ గురించి ప్రజలకు అవగాహన ఉండేది కాదు చెప్పిన అర్థం కాదు కాబట్టే వీటికి నమ్మకం అనే ముద్ర వేశారు.నమ్మకం ఉంటే కాగితం ముక్క కూడా మందులగా పని చేస్తుంది.పైగా ముందు తరం వారికి కూడా అందుతుంది అని నమ్మకం అనే పేరు పెట్టారు. నమ్మకానికి,మూఢనమ్మకానికి చిన్న తేడా ఉంటుంది అది తెలుసుకొని మసులుకుంటే అంతా శుభమే.
ఇన్ఫర్మేషన్ బానే సంపాదించావు..
ఇవి మన పూర్వికులు మనకి అందించిన జ్ఞానమే ఇలాంటి వాటి వల్ల మనం ప్రతి దానికీ హాస్పటల్స్ అంటూ పరిగెత్తనవసరం లేదు.అంటారుగా “వంటిల్లే వైద్యశాల” అని.
చాలా మంది ఎన్నో దేశాలు ఎటువంటి నమ్మకాలు,మూఢనమ్మకాలు లేకుండా జీవిస్తున్నాయి అని అంటుంటారు కానీ వాళ్ళకి తెలుసా చైనా,జపాన్,రష్యా,ఈజిప్టు వాళ్ళు కూడా మనలాగే ఎన్నో నమ్మకాలు కలిగి ఉన్నారు.
వారు వాటిని నమ్ముతారు కనుకే అవి నమ్మకాలు మనం నమ్మకుండా సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తున్నాం కనుకే అవి మూఢనమ్మకాలు గా మిగిలిపోయాయి.
నేను ఒప్పుకుంటా కొన్ని నిజ్జంగా మూఢనమ్మకాలు ఉన్నాయి కానీ ఏవో కొన్నింటిని చూసి అన్ని అలాగే అనుకోని వదిలేస్తే మన మూలలను మనమే చేరిపేసినట్టు అవుతుంది. తిరిగి ఇవే నమ్మకాలను విదేశీయులు వాళ్లే కనిపేట్టినట్టు మనల్ని నమ్మించే స్థితికి భారతదేశాన్ని తీసుకురాకుండా ఉంటే చాలు.ఇంతకుముందు చద్దన్నం అని వెక్కిరించిన విదేశీయులే ఇప్పుడు అదే చద్దన్నం చాలా మంచిది అని పరిశోధనలు చేసి కనుకున్నారు,మరి అదే విషయాన్ని మన పూర్వీకులు ముందే చెప్పారు కదా “పెద్దల మాట చద్దన్నం మూట”అని అందుకే ఈ జ్ఞానాన్ని కాపాడి ముందు తరాలకు ఇవ్వడమే మనం మన హిందూ ధర్మం కి ఇచ్చే విలువ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!