నాలుగు పాదాల ధర్మం

నాలుగు పదాలు ధర్మం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కనకరాజు గనిశెట్టి

నాలుగు పాదాలూ
నలుగెట్టుకున్నాయ్!
కదలలేక మెదలలేక
జిడ్డు పట్టిన నూనెతో
ఆరబెట్టుకుంటున్నాయ్ !
అదిగో ఆవేశం
ధర్మం తప్పిన కలి వేషం
ప్రకృతికి పక్షవాతం
వచ్చిందనుకుందేమో ?
జాలి లేని ఆకలి రాజ్యాన్ని సృష్టిస్తే
గెలిచాననుకుందేమో ?
కర్మ శాసనం తెలియని కలికి
ధర్మ బోధతో బుద్దొచ్చేనా?
ధర్మో రక్షిత రక్షితః
తేడా వస్తే శిక్షితః !
ధర్మం తప్పిన ప్రతి ఎద కలికి
కర్మం తప్పదు చివరికి !
అదిగో అదిగో కదిలింది
నలుగు నూనే ఆరింది
నాలుగు పాదాల ధర్మం
కలిని కలిపి
నలుగు నలిపి
తలంటు పోసుకుంటుంది
ఇక మిగిలింది కలిబలే.!

You May Also Like

One thought on “నాలుగు పాదాల ధర్మం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!