పల్లె అందాలు

పల్లె అందాలు

రచన:: డి.స్రవంతి

పల్లెలు పచ్చని ప్రకృతి వనాలు
సిరి సంపదల నిలయాలు

చుట్టరికం లేని ఆత్మీయ అనుబంధాలకు ఆనవాల్లు

తెలవారుజామున నిదూరలేపే కోడికూతలు

పచ్చని పంట పైర్లు.. సెలయేటి గలగలలు

రంగవల్లులతో నిండి హరివిల్లులా
కనిపించే ఇండ్లు

చిరునవ్వుతో పలకరించే స్వచ్ఛమైన మనసున్న మనుషులు

సేదతీరమని స్వాగతం పలికే మనసున్న మట్టి అరుగులు

అందానికి ఆనవాలుగా నిలిచే
పల్లె పడుచులు

కష్టాల కడలిలో చేయూతనిచ్చే పాతకాలపు అభిమానులు

ఆదరించి అక్కున చేర్చుకొని
న్యాయం చెప్పే రచ్చబండలు.

గ్రామ దేవతలు, జాతరలు, పండుగలు ఊరేగింపులు, సంబరాలు పల్లెల సొంతం..
పల్లెసీమల ముందు చిన్న బోవు
స్వర్గసీమలు
మన దేశానికి పట్టుకొమ్మలు…. పల్లెలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!