చరమగీతం

చరమగీతం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వనపర్తి గంగాధర్

నింగిని,నేలను జయించాడు మానవుడు
ఆకాశాన్ని,అంతరిక్షాన్ని ఔపోసన పట్టాడు
ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు
ఎంతో ఆధునిక సాంకేతికాభివృద్ధిని సాధించాడు
అయినా…,
ఈ కులమతాల భేద భావాలెందుకో
ఈ అసమానతల అవాంతరాలెందుకో
ఇంకెంతకాలం….
ఈ అరాచక జాఢ్యాలకు పాతరవేసి ‘వీడ్కోలు’పలుకుదాం

ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న
అన్యాయాలు,అక్రమాలు,దోపిడీలు
లంచాలు,అవినీతులకు
కొమ్ముకాస్తున్న దుష్ట రాజకీయాలకు
రాజకీయ నాయకులకు ఘనంగా ‘వీడ్కోలు’ పలుకుదాం

లక్మి,సరస్వతి,పార్వతిగా
ఆడవాళ్లను దేవతలుగా కొలిచే
అపురూప సంప్రదాయం మనది
అమ్మగా,ఆలిగా,చెల్లిగా
గౌరవించే ఘన సంస్కృతి మనది
కానీ నేదేది…
ఆడవాళ్లను అబలలను చేసి జరుపుతున్న
అత్యాచారాలు,హింసలు,హత్యలు
మానవతకు మచ్చ తెస్తున్న
మానవ రూపంలో సంచరిస్తున్న
కామాంధులను అంతంచేసి ‘వీడ్కోలు’పలుకుదాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!