పిసినారి రాజు

అంశం : హాస్య కథలు

పిసినారి రాజు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : మాధవి కాళ్ల

    కాంతం అన్నం పెట్టు అని అడిగాడు రాజు.. సరే అని పళ్ళెం నిండ అన్నం పెట్టి కూరలు మూడు రకాలు చేసింది కాంతం.. ఎన్ని సార్లు చెప్పి విన్నావా అని కోపంతో తిట్టాతాడు ఒక రోజు చేసిన కూరనే మనకి వారం రోజులు వస్తుంది అని చెప్పాడు రాజు.. అంటి అయ్య నీ పిసిరితనం నాకు నచ్చిన కూర నీకు నచ్చదు అని చెప్పింది కాంతం.. నేను పెరుగుతో తింటాను అని చెప్పాడు రాజు.. మనకి పిల్లలు లేరు హాస్పిటల్ కి వెళ్లివద్దము అని చెప్పింది కాంతం.. ఎందుకే పిల్లలు పుట్టితే  ఎంతో ఖర్చులు పెరుగుతాయి అని చెప్పాడు రాజు.. కోపంతో  నీ పిసిరితనం వల్ల  ఊరుల్లో వాళ్ళందరూ తలో మాట అంటున్నారు అని ఏడుస్తూ చెప్పింది కాంతం.. మరోసటి రోజు ఉదయం కాంతం బట్టలు ఉతుకుతుంది. అప్పుడే రాజు వచ్చి ఏంటే కాంతం బట్టలు ఇక్కడ ఉతుకుతున్నావు చెరువుకి వెళ్లి ఉతుక్కో అని చెప్పాడు రాజు. కాంతానికి కోపం వచ్చి పక్కనే ఉన్న కర్రని తీసుకొని కోపం పోయేవరకు రాజుని కొట్టింది..సాయంత్రం రాజు మార్కెట్ కి వెళ్లి కూరగాయలను తీసుకొని  ఇంటికి వచ్చాడు..  కాంతం ఆ సంచిని తీసుకొని చూసి ఒకసారికి వాంతులు చేసుకుంటుంది  ఆ వాంతులను చూసి రాజు ఏమైనా విశేషమా అని అడిగాడు..  విశేషమా నా పిండాకూడా  నువ్వు తెచ్చిన  కూరగాయల వాసన  పడ్డాక వాంతులు చేసుకున్నా అని చెప్పింది కాంతం. రాజుకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంది మనసులో కాంతం ఆ కూరగాయలను చెత్తకుండీలో పడేవేసింది తరువాత తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి కావాల్సిన వస్తువులను కొన్ని టాబ్లెట్స్ తీసుకొని రమ్మంది కాంతం. మూడు గంటలు తరువాత రాము (కాంతం తమ్ముడు) కాంతం చెప్పినవన్నీ తీసుకొని వచ్చాడు. రాత్రికి  రాజుకి ఇష్టమైన అన్ని రకాల వంటలు చేసి రాజు కోసం ఎదురు చూస్తుంది కాంతం.. ఒక గంట సేపు తరువాత రాజు వచ్చి రాముని చూసి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు.. దానికి రాము సాయంత్రమే వచ్చాను అని చెప్పాడు. కాంతం అన్నం పెట్టు అని చెప్పాడు. కూరలో, చారులో టాబ్లెట్స్ కలిపింది. నవ్వుతూ కడుపు నిండా తిన్నాడు ఫైవ్ మినిట్స్ తరువాత రాజు బాత్ రూమ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అది చూసి కాంతం, రాము ఒక్కటే నవ్వు.. రాజుకి బుద్ధి రావాలని అలా చేశారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!