సంధ్య వేళలో
రచన: క్రాంతి కుమార్
మలి సంధ్య వేళలో
మరులు గొలిపే చిరు ఆశలు రేపి
మదిని తాకేనే నా ప్రేమదేశపు యువరాణి
జీవితంలోని నవ వసంతాలను
కనులకు చూపించాలని
నిశీధిలో ఉదయించేనే నా వెన్నెల తార
మనసుకు హాయినిచ్చే మాటలతో
మత్తైన వ్యక్తిత్వ పరిమళంతో
మదిని దోచేనే నా వన్నెల దొరసాని
నిదుర రానివ్వకుండా ఊహల
సామ్రాజ్యాన్ని ఆక్రమించేసి
ఊసులకు ఊపిరి పోసేనే నా ప్రేమ దేవత