బ్రతుకు వ్యథలు

బ్రతుకు వ్యథలు

రచన :: తిరుపతి కృష్ణవేణి

హైదరాబాద్ మహా నగరంలో వనస్తలిపురం ఉద్యోగుల కాలనీలో అందమైన ఇల్లు ప్రహరీ లోపల ఇంటిచుట్టూ అందమైన పూలమొక్కలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఎప్పుడు పిల్లలు బంధువులు, ఆత్మీయులతో కళ కళ లాడే ఇల్లు నిశ్శబ్దంగా, నిర్మానుస్యంగా, కళా విహీనంగా దర్శనమిస్తోంది. ఆ ఇంటి యజమానులు రిటైర్డ్ అధికారి గోపీ లత దంపతులు.
ప్రస్తుతం విషన్నవదనంతో లత ఒంటరిగా గదిలో ఒకమూల కూర్చొని దీర్ఘాలోచనలతో కన్నీరు కారుస్తూమౌనంగా రోదిస్తూ ఉంది.ఎంత ఆపుకుందామన్న దుఃఖం ఆగటం లేదు. మనసునిండా ఆలోచనా తరంగాలు సుడులు తిరుగుతున్నాయి. వారికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం. గత సంవత్సరంమే మంచి సంబంధం చూచి వివాహం జరిపించారు. అల్లుడు బెంగుళూరులోమంచి పేరున్న కంపెనీలో సాఫ్టవేర్. మంచికుటుంబం బాగా స్థితిమంతులే! చాలా ఇష్టపడి అమ్మయిని వివాహం చేసుకున్నాడు.. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ప్రేమించిన అమ్మయితోనే పెళ్లి కూడా చేశారు. చిన్న అబ్బాయి మాత్రం అస్ట్రేలియాలో ఉన్నత చదువు(P. G) ల కోసం ఈ మధ్యనే వెళ్ళాడు.
లత ఆలోచనలతో తల తిరిగి పోతోంది. ఎంత ఆపుకుందామన్నపదే పదే గుర్తుకు వస్తున్నాయి.
గోపీ, లత ఇద్దరూ అట్టడుగు వర్గాలనుండే వచ్చినవారు కావటం వలన ఆ కాలనీ లో ఆదర్శ దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
గోపీ ఏజన్సీ ప్రాంతం నుండి కష్టపడి చదువుకొని ఇంటర్ మీడియట్ బోర్డు, hyd లో మంచి ఉన్నతోద్యోగంలో చేరాడు. లత స్వస్థలం కాకినాడ, తల్లిదండ్రులు లత చిన్ననాడే కాలం చేశారు. గత్యంతరం లేని పరిస్థుతుల్లో హైదరాబాద్ లో ఉన్న అక్క, బావ గారి ఇంట్లో పెరిగింది. ప్రక్క ఇంట్లో అద్దెకు ఉండే గోపితో పరిచయం పెళ్లి వరకు దారితీసింది. ఇద్దరూ అభ్యుదయ కుటుంబాలనుండి వచ్చినవారవటం మూలంగా కులాంతర వివాహం స్నేహితులు, అభ్యుదయ వాదుల సమక్షంలో చేసుకున్నారు.ఎంత వద్దనుకున్నా
జరిగిన విషయాలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి.
కూతురు అంటే చాలా ప్రేమ. తరచూ బెంగుళూరు వెళ్లి వస్తుంటారు. కరోనా మూలంగా ఈ మధ్య వెళ్లలేక పోయారు.

కరోనా ఉదృతి కాస్త తగ్గిన తర్వాత బెంగుళూర్ వెల్దామని అనుకున్నారు.
ఒకరోజు అల్లుడు దగ్గరనుండి ఫోన్ వచ్చింది.
క్రొత్త ఇంటి నిర్మాణం మొదలు పెడుతున్నాము మీరు దగ్గరుండాలి. వీలుచూచుకొని తప్పనిసరిగా బయలుదేరి రాగలరు అని.
ఫోన్ సమాచారము అందిన వెంటనే ప్రయాణం ఖరారు చేచు కున్నారు.కూతురుకు దగ్గరవుండి చాలా అందంగా జాగ్రత్తగా ఇల్లు కట్టించాలి అని ఆయన కోరిక. ఒక ప్రక్క ప్రపంచమంతా కరోనా రక్కసి విలయంతాండవం చేస్తుంది. హైదరాబాద్, బెంగుళూరు మొదలైన పెద్ద పెద్ద నగరాలలో చాలా తీవ్రంగా కరోనా విజ్రుబిస్తోందని రోజు వార్త పత్రికల్లో, టి. వి ల్లో వార్త లు వినటానికి, చూడటానికి భయం గొలిపే విధంగా ఉంటున్నాయి. గోపీ, లత లు కరోనా టేస్ట్ లు చేయుంచు కున్నారు. ఇద్దరికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. బెంగుళూర్ వెళ్లిన తర్వాత వాక్సిన్ వేయించు కుందాము అని కూతురు మీద ప్రేమతో బెంగుళూరు బయలుదేరారు.
మామ, అత్త గారు వచ్చినందుకు కుమార్తె, అల్లుడు చాలా సంతోషించారు. మంచి రోజు చూసి ముహూర్తం చూసి బిల్డింగ్ పని ప్రారంభించారు.
గోపీ చాలా ఉత్సహంగా రోజు ఇంటి నిర్మాణ పనులు చూచు కోవటం. సాయంత్రానికి ఇల్లు చేరుకోవటం దినచర్య గా మారింది. ఒకరోజు కూతురుకు జ్వరం వచ్చింది. టేస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు. అందరూ చాలా కంగారుపడి వెంటనే దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్చారు. లత, గోపీలు చాలా కంగారు పడ్డారు. ఇంటిపని ప్రక్కనపెట్టి హాస్పిటల్ కు తిరగటం మొదలు పెట్టారు. ఈ హడావిడిలో పనివత్తిడికి గురైనా అల్లుడు గారు నీరసించి పోయారు. ఎందుకయినా మంచిదని ఆయనకు కరోనా టేస్ట్ చేయించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఆయనను వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేయమన్నారు. అత్త మామలు, గోపీ, లత లకు ఏమి అర్ధం కావటంలేదు? ఒకప్రక్క కూతురు, మరొక ప్రక్క అల్లుడు కరోనా బారిన పడతారని కలలో కూడా ఊహించలేదు. లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి.
రెండు రోజుల్లో అల్లుడు కాస్త తేరుకున్నారు. అమ్మాయికి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అని అంటున్నారు. పరిస్థితి గందరగోళంగా తయారైంది. అప్పుడప్పుడు గోపీ ఇంటిపని చూడటానికి వెళ్లి వస్తున్నాడు.
లత అటు కూతురు అల్లుడి బాగోగులు చూచు కుంటూ భర్తకు సమయానికి భోజనం ఇతర పనులు చూస్తూంది.
ఉన్నట్టుంది గోపీకి ఒక రోజు కాళ్ళు వాపులు వచ్చాయి. లత కంగారు పడి హాస్పిటల్ కు వెల్దామంది. భార్యకు ధైర్యం చెప్పి ఏవో మందులు వేసుకున్నాడు.
రెండు రోజుల్లో అల్లున్ని హాస్పిటల్ నుండి డిచార్జి చేశారు.
మామగారివిషయం తెలుసుకొని తప్పనిసరిగా
టేస్ట్ చేయించు కోవాలి అని చెప్పి బలవంతంగా హాస్పిటలకు తీసుకు వెళ్లాడు ఆయన అసలే షుగర్ పేషంట్. షుగర్ చాలా ఎక్కువగా ఉంది పైగా కరోనా కూడా అధికంగా ఉంది. ఆయన వయస్సు రీత్యాచాలా పెద్దవాడు వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలి అన్నారు. లత కు గుండె ఆగినంత పనైంది. ఏమిటి ఈ దురదృష్టం. కూతురుకు సీరియస్ గా ఉంది అంటున్నారు. అనుకోని రీతిలో గోపీ హాస్పిటల్ పాలైనాడు . ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలావుంటుందో, లత వణికి పోతోంది.
గోపీ లతకు ధైర్యం చెప్పి,. నాకేం కాదు. ఇది మామూలే! ఈ ఒక్కరోజే హాస్పిటల్ లో ఉంటాను. రేపు ఇంటికి వెళదాము. అని భార్యకు నచ్చజెప్పి పంపించాడు. కూతురుకు తండ్రి హాస్పిటల్లో ఉన్నట్లే తెలియదు.? ఆమె icu లోనే ఉంది. ఆమెకు వైద్యం జరుగుతునే ఉంది.
మార్నింగ్ హాస్పిటల్ నుండి గోపీ గారి ఆరోగ్యం విషమంగా ఉందని ఫోన్ వచ్చింది. అత్త గారిని తీసుకొని అల్లుడు హడావిడిగా హాస్పిటల్ కు చేరుకున్నాడు. గోపీ గారికి పరిస్థితి విషమించి కొద్దిసేపటిక్రితమే మరణించి నారని తెలిపారు. ఒక్కసారి లత గుండె బద్ధలైంది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అసలే కోవిడ్ పేషేంట్ మరణిస్తే బయట అంత్యక్రియలు జరిపే పరిస్థితే లేదు. దిక్కుతోచని పరిస్థితి. హాస్పిటల్ వర్గాలవారికే డబ్బు చెల్లించి వారి ద్వారానే అంత్య క్రియలు జరిపించారు. మౌనంగా రోదిస్తూనే కార్యక్రమాలు పూర్తిసేసుకొని, భర్త చితాభస్వము మూట గట్టుకొని కూతురు ఆరోగ్యం జాగ్రత్తగా చూచు కొమ్మని చెప్పి, తండ్రి మరణవార్త వెంటనే చెప్పొద్దని, నిదానంగా ఆమె కోలుకున్నతర్వాత చెప్పమని భారమైన హృదయంతో ఇంటికి హైదరాబాద్ కుచేరుకుంది లత.
తన ఆశలన్నీ కూలిపోయినాయి. అన్నీ తానై ఎంతో ప్రేమతో చూచు కున్న భర్తను కోల్పోయాను. ఎక్కడో పారిన్ లో ఉన్న పిల్లలు కరోనా లాక్ డౌన్ మూలంగా చివరి క్షణంలో తండ్రి అంత్య క్రియలకు హాజరు కాలేకపోయారు. కన్నకూతురుకు తండ్రి మరణవార్త చెప్పలేని పరిస్థితి. లతకు భవిష్యత్ అంతా అగమ్య గోచరంగాఉంది జీవితమంతా శూన్యంగా అయోమయంగా కనిపించింది. మా జీవితాలతో మాయదారి కరోనా
ఎంత నాటకమాడింది.? నెలరోజుల కాలంలోనే మా బ్రతుకులను అయోమయంలోకి నెట్టి వేసిoది. విధి ఎంత చిత్రమైనది.?
సాయంత్రంఅయింది.ఇంట్లోకి చిమ్మ చీకట్లు ముసురుకుంటున్నాయి.
ఎవరో పిలుస్తున్నారు.భారమైన హృదయoతో నిమ్మదిగా స్ప్రహ లోకి వచ్చింది లత.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!