పుస్తక ఆవిష్కరణ

అభినందనలు

డా.అడిగొప్పుల సదయ్య గారి
“తిరుప్పావై ఇష్టపదులు”
పుస్తక ఆవిష్కరణ

తేది:08-01-2022న జి.ప.ఉ.పా. వావిలాల గణితోపాధ్యాయుడు, ప్రముఖ కవి అయిన డా.అడిగొప్పుల సదయ్య గారు ప్రచురించిన “తిరుప్పావై ఇష్టపదులు” పుస్తకం శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం, జమ్మికుంట అర్చకులు శ్రీమాన్ కె వేణుగోపాలాచార్యులు గారు.. శ్రీ వేంకటేశ్వరస్వామి సమక్షంలో ఆండాళ్ సన్నిధిలో ఆవిష్కరించారు.

ధనుర్మాసంలో అన్ని వైష్ణవాలయాలలో (తిరుపతిలో కూడా) సూర్యోదయమునకు పూర్వమే పారాయణము చేసే “తిరుప్పావై” చాలా పవిత్రమైన, సంగీత పరమైన మరియు సాహిత్య విలువలు కలిగిన ముప్పై ద్రావిడ పాశురాల మాల.
దీనిని భూదేవి అవతారమైన “ఆండాళ్” (గోదాదేవి) ధనుర్మాసంలో రోజుకొక్క పాశురం చొప్పున రచించి శ్రీరంగనికి సమర్పించినది. అడిగొప్పుల సదయ్యగారు గత సంవత్సరం ధనుర్మాసంలో రోజుకొక్క పాశురాన్ని ద్రావిడ భాష నుండి తెలుగులోకి తమ “ఇష్టపది ప్రక్రియలో” అనువదించి శ్రీరంగనాథునికి అర్పించారు. వాటిని ఈ సంవత్సరం “తిరుప్పావై ఇష్టపదులు” పేరుతో పుస్తకంగా ముద్రించి జమ్మికుంట వేంకటేశ్వరస్వామికి సమర్పించారు.
పుస్తక రచయిత సదయ్య దంపతులను అర్చకులు శ్రీ వేణుగోపాలాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వావిలాల సర్పంచ్ శ్రీమతి జక్కెన శ్రీలతాసత్యం, MPTC శ్రీ మర్రి మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఖండేరావు పరీక్షన్ నరేందర్ రావు, ఇతర ఉపాధ్యాయులు, SMC చైర్పర్సన్ శ్రీమతి శ్రీ లతా రవి గార్లు సదయ్య గారిని అభినందించారు.

 

తపస్వి మనోహరం పబ్లికేషన్స్ నుండి వచ్చిన “తిరుప్పావై ఇష్టపదులు” పుస్తక ఆవిష్కరణ సందర్భంగా శ్రీమతి & శ్రీ డా.అడిగొప్పుల సదయ్య గారికి శుభాభినందనలు💐.

From
తపస్వి మనోహరం టీమ్ ✍️

You May Also Like

2 thoughts on “పుస్తక ఆవిష్కరణ

  1. Congratulations sir💐💐💐💐👏👏👏👏
    Congratulations తపస్విమనోహరం టీమ్ అండ్ సర్💐💐💐👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!