మహిళల ప్రత్యేక కథ/కవితల పోటీ

తపస్వి మనోహరం
అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక

మహిళల ప్రత్యేక కథ/కవితల పోటీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామణుల కొరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ పోటీకి రచయిత్రులు/ కవయిత్రులను ఆహ్వానిస్తున్నాము. పోటీకి వచ్చిన కథలు మరియు కవితలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి పుస్తక రూపంలో సంకలనం రూపొందించడం జరుగుతుంది. తపస్వి మనోహరం మొదటి వార్షికోత్సవ వేదిక పై (ఏప్రిల్) పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది.

కథ/ కవిత అంశం: ఐచ్ఛికం
కథ నిడివి: 300 – 1500 పదాలు
కవిత నిడివి: 10 – 20 వరుసలు
పోటీ ఆఖరి తేదీ: 22-02-2022
పోటీ ఫలితాలు: 05-03-2022
(తపస్వి మనోహరం మాస పత్రికలో చూడగలరు.)

కథలకు బహుమతులు:
ప్రథమ బహుమతి – 1000/-
ద్వితీయ బహుమతి – 600/-
తృతీయ బహుమతి – 400/-

కవితలకు బహుమతులు:
ప్రథమ బహుమతి – 300/-
ద్వితీయ బహుమతి – 200/-
తృతీయ బహుమతి – 100/-
మరియు
కథ/కవితలకు కలిపి నాలుగు ప్రోత్సాహక బహుమతులు, ఒక్కొక్కరికి రూ.100/- ఇవ్వడం జరుగుతుంది.

నిబంధనలు:
* ఒకరు ఒక్క కథ/కవిత మాత్రమే పంపవలెను.

* మీరు పంపే రచన ప్రింట్, వెబ్ పత్రికలలో గానీ, పర్సనల్ బ్లాగ్స్, సోషల్ మీడియా, సెల్ఫ్ పబ్లికేషన్ వంటి ఇతర ఏ ప్లాట్ ఫామ్ లలో ప్రచురితం కాలేదని, రచన అనుకరణ, అనుసరణ, అనువాదం కాదని, ఏ పోటీ పరిశీలనలో లేదని, సొంత రచన అని.. హామీ పత్రంతో పాటుగా మీ పేరు, రచన శీర్షిక(టైటిల్), ఫోన్ నెంబర్/మెయిల్ ఐడి పంపవలెను.

* రాత ప్రతులు, స్కాన్ కాపీలు, pdf లు తీసుకోబడవు. మీ రచన వర్డ్ డాక్యుమెంట్ గా లేదా మెసేజ్ రూపంలో మీ “ఫోటో జత చేసి” వాట్సప్ లేదా మెయిల్ పంపవచ్చు.

* ప్రచురణకు ఎంపిక కానీ రచనలను తపస్వి మనోహరం వార, మాస పత్రికలలో లేదా వెబ్సైట్ లో ప్రచురించడం జరుగుతుంది. మీరు పంపిన రచనలను తిరిగి పంపుట కుదరదు.

* పోటీ ఫలితాలలో తుది నిర్ణయం నిర్వాహకులదే. ఇందులో ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు. పై నిబంధనలకు అంగీకారం అయిన యెడల మాత్రమే మీ రచనలను మాకు పంపించండి.

పోటీకి కథ/కవిత పంపవలసిన చిరునామా:
వాట్సప్ నంబర్:
+91 7893467516

మెయిల్ ఐడి:
manoharam.editor@gmail.com

తపస్విమనోహరం వెబ్సైట్:
https://thapasvimanoharam.com/

You May Also Like

One thought on “మహిళల ప్రత్యేక కథ/కవితల పోటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!