చావు మార్మికం

చావు మార్మికం  (ప్రక్రియ: పంచాక్షరి పంచపదులు)

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

చింతయే చితి, వింతయే మతి, చావుయే గతి చేయకు అతి, మరణం వరం విఠల!
ఈ సంసారము, సుఖసౌఖ్యము, భోగభాగ్యము, స్వర్గలోకము, నీకు స్వంతమా విఠల!
నాది నాదని, నా పిల్లలని, నా సంపదని,
ఇల్లు భార్యని, మురువకుమా విఠల!
బాల్యముండునా, యవ్వనమైనా, సదా వుండునా! వృద్ధాప్యమైనా? భ్రమ వదులు విఠల!
పూర్వ జన్మలు, కర్మ బంధాలు, జన్మ చావులు, దైవాధీనాలు, ఆగనివేగా విఠల!
ఒంటిపై ధ్యాస, అమిత ఆశ, నీలో పేరాశ,
నీ కంఠశోస, వినరెవ్వరు విఠల!
ముందే తెలిస్తే, తెలిసి వస్తే, తుదకు చస్తే,
ఇక నమస్తే! చెప్పవలెను విఠల!
తాపసులకు, ముని ఋషులకు, దైవజ్ఞులకు, తాత్వికులకు, చావు నిమిత్తం! విఠల!
మృత్యువాగదు, జన్మమాగదు, రాత మారదు,
పోక తప్పదు, ఈ గోల ఏల! విఠల!
రుగ్మతలుంటే, శక్తి లేకుంటే, అసక్తతుంటే,
దిక్కు లేకుంటే, తెలిస్తే వరం విఠల!
సృష్టికార్యము, జన్మించడము!
యమ ధర్మము, పాటించడము,
అనివార్యమే విఠల!
అసాధ్యమైంది, తప్పనిదిది, బ్రహ్మ రాతిది,
మార్చ లేనిది, రెండూకాదిది విఠల!
బొరుసు ఇదే, బొమ్మయూ ఇదే,
వరము ఇదే,శాపమూ ఇదే,
చావు తప్పదు విఠల!
ఆశ చావదు, కోర్కె తీరదు, కాలం మారదు,
ధైర్యం చాలదు, చావంటే భయం విఠల!
అతిథై వచ్చి, ఆహ్వానం తెచ్చి, పిలుపు నిచ్చి,
లోపల జొచ్చి, తీసుకెళ్ళును విఠల!
నిబ్బరం వుంటే, నిమ్మలంగుంటే, స్థైర్యమే వుంటే, ధైర్యమే వుంటే, చావే ఓ వరం విఠల!
జగమేచిత్రం, అంతావిచిత్రం, మాయలుమంత్రం తేలని తంత్రం, పుట్టుక చావు విఠల!
చావు తప్పదు, అది ఆగదు, తప్పుకో లేదు,
చింత వలదు, నిజం గ్రహించు విఠల!
ఈ జీవితము, అశాశ్వతము, భవ బంధము,
కొంత కాలము, ఇదే సత్యము విఠల!
పేగుబంధము, ప్రేమమయము, ఆపురూపము, నిర్వచనము, చావు మార్మికం విఠల!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!