రేపటి చరిత్రకు వర్తమానం

రేపటి చరిత్రకు వర్తమానం 

సమీక్ష :- సిద్దాబత్తిని రమాదేవి

       

(కవిత:స్వాతిబొలిశెట్టి )

నేను రాసే సమీక్ష లోపాలు, ఎదైనా తప్పుగా ఉంటే అన్యధా భావించకండి.

కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు   *రేపటి చరిత్రకు వర్తమానం* అనే అంశం పై.. తనమేధస్సును మెరుపులా మేళవించుకుని..

నా దేశపు చరిత్రకు వర్తమానాన్ని  రాస్తున్న అంటూ, కవిత్వం ఎత్తుగడలోనే పాఠకులకు పాలకులకు, తలెత్తే సవాల్ విసిరారు, కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు.

దేశంలో జరుగుతున్నవి అవినీతి ఆరాచకాలను దృష్టిలో పెట్టుకుని, హైకోర్టు న్యాయవాదిగా  జడ్జిమెంట్ ఇస్తూ, నా దేశపు వర్తమానాన్ని రాస్తున్నా అంటూ, హెచ్చరిస్తున్నారు.

విమర్శించే వారికి విలక్షణంగా వివరిస్తూ,  వినమ్రత కలిగిన విశదీకరించి, వర్తమానం జారీచేస్తూ.. ఆర్డర్ ఆర్డర్ అంటూ బల్ల గుద్దినట్లు..

తీర్పు ఇచ్చే న్యాయవాదిలా,

వర్తమానం  రాస్తున్న.  కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారి కవితను చదివి, ఏమి తెలియని సోమరిపోతుల్లా  చూస్తూ ఉండకూడదు..

సమ సమాజం కోసం నాదేశం అంటూ  ప్రతి ఒక్కరూ, వకీల్ సాబ్ లా ప్రశ్నిస్తూ,  తప్పును ఖండిస్తూ.. రేపటి చరిత్రకు వర్తమానాన్ని రాయాలి ప్రతి భవితా, నేటి యువతా.

కుక్కపిల్ల… సబ్బుబిళ్ల.. అగ్గిపుల్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. మనచుట్టూ ఉండే ఏ వస్తువూ వ్యర్థమైంది కాదు. దాన్ని అర్థవంతంగా ఉపయోగించుకుంటే ప్రతిదీ ఉపయోగపడేదే. అలాంటిదే మన స్వాతిబొలిశెట్టి గారు రాసిన కవితలో కనిపిస్తున్నది.

కవి ఆవేదన ప్రసవ వేదనా,  పసివాడని  పదాలు,  పక్వానికి వచ్చి ఆ పరిమళం పదంగా పట్టు జారిపోతుంటే….

పాదరసంగా కరిగిపోతుంటే..

పద ప్రయెగాలు, పద నిర్మాణానికి తిరిగి తెచ్చుకునే,

ఆలోచన కి పదును పెట్టుకుంటూ..

కవికి అక్షరాలే ఆయువు, తన లక్షణాలే పాజిటివ్  గా, వర్తమానాన్ని సూచిస్తూ, తనను తాను శాసించుకునే దిశలో, ప్రయాణం కొనసాగిస్తూ..

పాలకులనైనా ప్రజాద్రోహులనైనా, నిలదీసే నిర్మొహమాటం లేని, నిత్య కృషి శీలుడు, అతడే, కవి, రవి, భువి, సృష్టికి ముందు వెనుక సూర్య చంద్రులు ఎలాగో,సూర్య చంద్రులే నేత్రాలుగా,

కవి సృష్టిలో భాగస్వామి..

కవి అంతర్నేత్రికుడే భృకుటిన వెలుగులు విరాజిల్లుతూ..

తన దేశానికి వర్తమానం రాసేదిశలోనే  నిమగ్నమై నర్మగర్భమైన కవి…

ఒక్కసారి మన కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు రాసిన

కవితను పరిశీలిద్దాం.

కవిత :- రేపటి చరిత్రకు వర్తమానం

నా దేశపు వర్తమానాన్ని రాస్తున్న..
పాతరాతి గుహల నుంచి పాలరాతి గృహాల వరకు…
సంకెళ్ల విముక్తి నుంచి సాంకేతిక సమరం వరకు…
నా దేశ వర్తమానాన్ని రాస్తున్న..
రవి అస్తమించని భారత సామ్రాజ్యాన్ని రాస్తున్న…
నేల నాలుగు చెరుగులా విస్తరించిన తెలుగు వెలుగును రాస్తున్న…
బానిసత్వం నుంచి ఎదిగిన బాసిజాన్ని రాస్తున్న…
దేశ విదేశాల్లో విస్తరించిన
తెలుగు జెండాని రాస్తున్న…
చంద్రమండలం పై ఎగసిన
విజయ కేతనాన్ని రాస్తున్న…
నేటి యువతకు గడిచిన
చరిత్రను రాస్తున్న..
విరిగిన పాళీతో.. తెగి పడ్డ ఆయుధాల చరిత్ర రాస్తున్న…
మూగబోయిన మర ఫిరంగులు
మౌన ఘోష రాస్తున్న…
కన్నీళ్లు ఇంకిన కనుల
కొలనులో విరిసిన పద్మాలు రాస్తున్న…
రేపటి భవిష్యత్తుకు…
రాగల వర్తమానాన్ని రాస్తున్న…
నింగికెగసిన నా దేశ చరిత్రను
రాస్తున్న…
ముందుతరాలు మురిసి తరించే తరతరాల తల రాత రాస్తున్న…
రేపటి చరిత్రకు వర్తమానం రాస్తున్న…..
అవును…
రేపటి చరిత్రకు వర్తమానం రాస్తున్న…
                 ✍️స్వాతిబొలిశెట్టి

కవయిత్రి స్వాతిగారు నా దేశపు వర్తమానాన్ని రాస్తున్నా అంటూ.. ధీటైన సమాధానంగా

ప్రతి అంతరంగాన్ని తట్టిలేపే విధంగా,” మనిషి సాధించలేనిది, కవి మాత్రమే నిలదీసే విధంగా పదాల రూపంలో ప్రతి గుండెపై ఓ సంతకంలా సమాదానం చెబుతున్నారు.

“పాతరాతి గుహల నుంచి పాలరాతి గుహాల దాక ” ఆ నాటి నాగరీకులను, ఈ నాటి ఆధునికులను, అద్దంపట్టి చూపించింది మన కవయిత్రి  స్వాతిబొలిశెట్టి గారు అంతర్లీనంగా పరిశీలించగా ఆ రోజుల్లో( పాతరాతి ) నల్లరాతి ఇళ్లు గుహల్లా ఉండేవి , ఆనాటి మనుషులు

అతి సామాన్యమైన జీవితాలు గడుపుతూ ,

సాదా సీదా మనుషులు,  మాయలూ తెలియవు,  మంత్రాలూ తెలియవు,

మహిమగల్ల మనుషులు..

ఇంటినిండా పాడి పంటలు,

కంటినిండా నిద్ర, ఇక సంతానం

ఇంటెడు పిల్లలు,

వారి జీవితానికి సరిపడ ఆదాయం, అందమైనరోజులు..

కవయిత్రి స్వాతిగారి పుణ్యమా అని, ఆ నాటి తరాలను, తట్టిలేపి వచ్చాము,  ఎంతైనా నిజజీవితాలు.. ఆనాటి జీవితాలు…

” పాలరాతి గృహాలు ”

రంగుల జీవితాలు , హంగులూ  ఆర్భాటాలలో….

తన స్వార్ధపు బ్రతుకోసం, మమతలను దూరం చేసుకుని కొత్త బంధాల కోసం పరుగులు కళ్ళముందు కదులుతున్న కారణంగా.

మన కవయిత్రి స్వాతిగారు, పాతరాతి గుహలకు, పాలరాతి గృహాలకు,  ఉన్న వ్యత్యాసాన్ని జల్లెడపట్టి, చూపారు..

సంకెళ్ళ విముక్తి నుంచి సాంకేతిక సమరం వరకు”అని

ప్రతి పంక్తిలో… ప్రశ్నర్ధకంగా మిగిలిపోయిన, వైనాన్ని..

మనకు స్వతంత్రం రాకముందు, తెల్లవాళ్లునుంచి మనవాళ్ళు ఎదుర్కొన్న,  ఉక్కుసంకెళ్ళ విముక్తి..

తిరిగి మనస్వరాజ్యం మనకు

తెచ్చిపెట్టిన, ఎందరో దేశ అమరవీరుల త్యాగాలు

సాంకేతికమైన వెలుగుల సమరం,  ఎందరో మహానుభావులను.. దృష్టిలో పెట్టుకుని.. మన కవయిత్రి స్వాతిగారు.. నా దేశపు వర్తమానాన్ని రాస్తున్నా.. అని.. ఎలుగెత్తిన స్వరంతో పిక్కటిల్లి అరిచినట్లు వాపోతుంటే,

అక్షరవెలుగులు తనను ఆవరించి,  అబిషేకించాయి.. మన దేశానికి సందేశాత్మకమైన

విలువలకు రూపుదాల్చారు.

రవి అస్తమించని భారత సాంబ్రాజ్యాన్ని రాస్తున్న

ఎవరికి తెలియదు, రవి కాంచని చోటే కవియని..

సూర్య స్థానమైన నుదుటిన, అక్షరకిరణం ప్రకాశిస్తూనే ఉంటుంది.. అందుకే రవి కవి ఒక్కడే.. కవిలో రవి ఆవాహనమై, కవిని ఆవరించి ఉంటాడు.. నాదేశం భారతదేశం గర్వాంగా చెప్పుకుంటూ.. కవయిత్రి స్వాతిగారు, రవి అస్తమించని భారత సామ్రాజ్యాన్ని రాస్తున్న.. అని.. వక్కాణించి చెంపలు వాయించి చెప్పారు..

మన సూర్యవంశం జడ్జిమెంట్..

నేల నాలుగు చెరుగులా విస్తరించిన తెలుగు వెలుగును రాస్తున్నా ”  అన్నారు మన కవయిత్రి… దిక్కులు సూచించే

దిశలోనే ఉన్నాము..

అమ్మా.. అవని.. ఆకుపచ్చని చీర నాలుగు చెరగులా విస్తరించిన.. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, సూర్య రధం భూమిచుట్టిన  ఆ గమనాన్ని  వెలుగులను రాసున్నా… ఎంత బాగా చెప్పారు, కవయిత్రి గారు అరటి పండు వలిచి,  మన నోటికందించినట్టు..

బానిసత్వం నుంచి ఎదిగిన బాసిజాన్ని రాస్తున్న “

పూర్వం మన దేశం బ్రిటిష్ పరిపాలనలకు లొంగిపోయి బ్రతికే వాళ్ళం, ఆ బానిసత్వపు సంకెళ్లను తెంచుకుని, అంచలంచలుగా ఎదుగుతున్న నా దేశం మరో కొత్త వెలుగులు మంచి మార్పులు అని అనుకుంటున్నాను.

“దేశ విదేశాల్లో విస్తరించిన తెలుగు జండాని రాస్తున్న “

దేశ విదేశాల్లో  మన తెలుగు సంస్కృతి సంప్రదాయం, విస్తరించిన విజ్ఞానం విద్వత్, మన కట్టు బొట్టు, ఆచార కాండ మన తెలుగు నేలే జెండాని, రాస్తున్నా అంటూ.. తెలుగు గడ్డపైపుట్టి తెలుగు-వెలుగుల విస్తరించిన జండాగా భావించి,

ఒకే పంక్తిలో… తెలుగు వారి వైభవాన్ని జెండాగా ఎగరవేశారు..

“చంద్రమండలం పై  ఎగసిన విజయ కేతనాన్ని రాస్తున్న”

అంటూ.. మన కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు మానవ ఆలోచనలు శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో అంతరిక్షంలో ఆకాశంలోకి దూసుకుపోతూ ఎన్నో పరిశోధన లో ఎన్నో విజయా పథకాలు ఎగురవేశారు మన తెలుగు వారు.

మనకవయిత్రి స్వాతిగారు..  విశ్వకవి..  ఇట్టే గమనిస్తూ… విజయకేతనాన్ని

రాస్తున్నా అన్నారు.. కలమనే అంతరిక్షంతో అనుకుంటాను..

“నేటి యువతకు  గడిచిన చరిత్రను రాస్తున్న” అంటూ..

అత్యాచారాలు మానభంగాలు

నేటి యువతపై గడిచిపోయిన చీకటి చరిత్ర నల్లని మేఘాలు కూడా ఇప్పటికి విలపిస్తున్నాయి గడిచిన గాయల రక్తపు మడుగులు చరిత్రను తలచుకుని.. కన్నీళ్లు పెట్టుకుంటుంది అలా జ్ఞాపకాలను గుర్తు చేస్తు నేటి యువతలో మార్పు రావాలని తెలియజేశారు మన కవయిత్రి స్వాతిగారు.

“విరిగిన పాళీ తో తెగి పడ్డ ఆయుధాల చరిత్ర రాస్తున్న..”

మనదేశ అవినీతి అకృత్యాలు రాసిరాసి.. మన కవయిత్రి కలము పాళీ విరిగినా.. పట్టువదలలేదు.. మనభద్రతకోసం, ఎందరో వీరులు మన సరిహద్దులో, మన రక్షణకోసం..

వీరమరణాలు పొంది రక్షపు గాయాలతో తెగి పడ్డ ఆయుధాల్లా, ఆ జవాన్లు శరీరంలో,  మందుగుళ్ళు తూటాలు తూటాలుగా వారి దేహాలను చీల్చుకుని.. ఆయుధాల్లా పడిపోతుంటే.. మన కవయిత్రి స్వాతిగారి..

విరిగిన పాళీతో.. తెగి పడ్డ ఆయుధాల చరిత్రను రాస్తున్న.. అంటూ.. ఆ కలానికి ఎన్ని  గాయాలు అయ్యాయో..

“మూగపోయిన మర ఫిరంగులు మౌన ఘోష రాస్తున్నా” అంటూ మూగపోయిన ఫిరంగులు మూడురంగుల మువ్వన్నెలు, నా జాతీయ జెండా మూగ పోయినవి అంటూ..

తెలుపు రంగు స్వచ్ఛతకు మారు పేరు..

కాషాయం ధర్మానికి శాంతికి మారుపేరు..

ఆకుపచ్చ పాడి పంటలకు రైతన్నకు సాక్షిగా మూడురంగులు మౌన ఘోషతో రాస్తున్న.. అని.. కవయిత్రి మన దేశ చరిత్రను తన భుజాల మీదకు ఎత్తుకుంది..

“కన్నీళ్లు ఇంకిన కనుల కొలనులో విరిసిన పద్మాలు రాస్తున్న” అంటూ

కన్నీళ్లు ఇంకిన కనుల కలువలు ఊబిలోన కూరుకుపోయి.. కాస్తంత తడి తాకిన రేయి మంచుకు, బిందువులతో,

కొలనులోని కలువకన్నియలు తన పవిత్రతను సూచించే దిశలో.. విరిసిన పద్మాలను రాస్తున్నా అంటూ.. కమలముల ప్రకాశాన్ని

రాస్తున్న..అని కవికలువ కన్నులు సరళరేఖల ప్రకాశం.

“రేపటి భవిష్యత్తుకు రాగాల వర్తమానాన్ని రాస్తున్న” అంటూ.. రేపటి భవిష్యత్తు ప్రతి భవితకు మనోవికాసానికి ప్రగతి బాటలో నడవాలి, భవిత మమతానురాగాలు వర్తమానం లేఖ ప్రతి యువతకు సందేసాత్మకమై వెలుగులు నింపాలి అని, మన కవయిత్రి ఆకాంక్ష..

“నింగికెగసిన నా దేశ చరిత్రను రాస్తున్నా “

ఆకాశమంత ఎత్తులో నాదేశ చరిత్రను రాస్తున్న..అంటూ ఆకాశమే హద్దుగా, ఆకాశమే నిత్యచైతన్యం తనలో ఆకాశతత్త్వం, నిర్మలచైతన్యం నింగిలోని తారలు, నేలపై నడిచే నక్షత్రాలు ఒప్పుకోవాలి, నింగికెగిసిన నా దేశ చరిత్రను రాస్తున్న.. అంటే వేవేల వెలుగులని..

” ముందుతరాలు మురిసి తరించే తరతరాలు తల రాత రాస్తున్న “

వచ్చే కొత్త తరాలు సంతోష పడేలా, జరిగేదేమిటో జరగబోయేదేమిటో ఒక కవి ముందు ఊహించి వర్తమానం సందేశాన్ని రాస్తున్న.. కవయిత్రి స్వాతిగారు..

తరతరాలు చెరిగిపోని ముద్రలా నొసటి గీతల పైన మరిచిపోలేని రాతను చెదిరిపోలేని చరిత్రను తిరగరాస్తున్న. మన కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు.

“రేపటి చరిత్రకు వర్తమానం రాస్తున్న ”

” అవును ”

“రేపటి చరిత్రకు వర్తమానం రాస్తున్న ”

నువ్వు గుర్తు పెట్టుకున్న నన్ను గుర్తించలేకున్న, మరో చరిత్రను తిరగరాస్తున్నా. శిల శాసనంగా శాసిస్తున్న, రేపటి చరిత్రను ఏ అక్షరదోషాలు లేకుండా, లక్షణంగా రాస్తున్నా అంటూ..   నేటి కవయిత్రి స్వాతిబొలిశెట్టి గారు.

ఇంతస్ఫూర్తినిచ్చిన  చక్కని కవితకు, ఈ అవకాశాన్ని కల్పించిన స్వాతిబొలిశెట్టి గారికి. నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు స్వాతమ్మా, మరెన్నో మెరుగైన విలువైన కవితలు పాఠకులకు అందిస్తూ, అభిమానులనుంచి మరెన్నో ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను..

మీ సిద్దాబత్తిని రమాదేవి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!