పంజరంలోని పదాలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

పంజరంలోని పదాలు

రచన: వడ్డాది రవికాంత్ శర్మ

అవ్యక్తమైన ఆలోచనలు ….
నుదిటిపై ద్యోతకమవుతున్నాయి …

నవ్వులో ఉన్న మెత్తదనం …
భావంతో పాటు మారుతున్నది …

కళ్ళలోని మెరుపు ….
కాలంలోని మార్పుని పరావర్తనం చెందిస్తున్నది …

గుసగుసలాడే ఊహలు …..
సముద్రంలా రేగే అలల్ని ఆపివుంచాయి ..

భావోద్వేగాల సరిగమల్ని..
నిశ్శబ్దంగా పలికిస్తున్నాయి …

ఊహలు తమలో తాము గుసగుసలాడుతున్నాయి …
తనువేమో తనకే తెలియని నవ్యనగ్నత్వపు సిగ్గుల్ని పూయిస్తున్నది ….

తప్పుకి ఒప్పుకి మధ్య …
నైతిక అనైతిక వాదాల బిడి పంజరంలో ..
ఖైదుగా ఊహలు గుసగుస లాడుతున్నాయి ..

***

You May Also Like

2 thoughts on “పంజరంలోని పదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!