ప్రేమ సాగరం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ప్రేమ సాగరం

రచన: సావిత్రి కోవూరు 

క్షణక్షణం నీ తలపులతో నా మదియే నిండుగా నిండగా,
పరిపరి విధముల నా డెందమే పరవశమై పోయెను,
మరి మరి నీ నామస్మరణ తో మైమరపే కలుగగా,
తడబడు అడుగుల తత్తరపాటుతో కలవరమై నా మేనే కంపించగా,
కనివిని ఎరుగని తన్మయత్వంతో తరితరి నిన్నే తలువగా,

నీ తలపుల జలపాతములో తేలి తేలి పోవాలని,
నీ ఊపిరి సవ్వడిలో నిండి సందడిలా నిలవాలని,
నీ అడుగుల జాడలలో నా అడుగులు వేయాలని,
నీ పదముల దారులలో నా పథమే  వెతకాలని,
నీ నవ్వుల జల్లులలో తడిసి తడిసి పోవాలని,
నీ మాటల వెన్నెలలో మెరుపులాగా మెరవాలంటే,

నీ మమకారపుదారులలో నేనాడు కోవాలని
నీ ప్రేమ సాగరాన అలగా నేనే మిగలాలని
నీ చూపుల ధారలలో తహతహలాడాలని
నీ అనురాగపు వరదలలో తేలి తేలి పోవాలని
నీ కరములు లాలన చేయగా, ఉత్తేజంతో ఎగిసిపడే
నా మది గుమ్మములో, అర విరిసిన విరి తావులతో,
పరి పరి విధముల, ఊహలు గుసగుసలాడేను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!