శ్రీమంతపు బొమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అలేఖ్య రవికాంతి
సిరులొలికే సీతమ్మ సొగసుగా రావమ్మ
వెన్నెల కాంతుల కలువల పుత్తడి బొమ్మ
కమ్మని కానుక నీ వంశానికి ఇవ్వమ్మ
చక్కని చుక్కకి జరిగేను శ్రీమంతమే
త్వరలో మా నట్టింట్లో బుజ్జాయి తారంగమే
అన్నులమిన్న సొగసైన సీతమ్మని
ముత్తైదువలంతా మనసారా దీవించరేె
కాబోయే అమ్మ నీ వెచ్చని తనువే బిడ్డ ఒడి
ఆనందించవే సఖి నీదేలే వేడుక మరి
రాబోయే కాలంలో కాబోయే అమ్మవి నీవమ్మ
మీ ప్రతిరూపానికి ప్రాణం పోస్తూ మురిసిపోవమ్మ
నేటి అందాల బొమ్మ రేపటి కాబోయే అమ్మ
సంతోషాలతో గడపవే శ్రీమంతపు బుట్టబొమ్మ
గాజులతో సారాలతో దీవెనలు అందుకోవమ్మ
పండంటి పాపాయికి దీవెనలతో
స్వాగతం పలుకుతూ