నీ రాకకై

నీ రాకకై

రచన: కవిత దాస్యం

పున్నమి వెన్నెల వెలుగులా… నీ చిరు దరహాసానికై …
నా మనసే నీ వైపు లాగే … నీ అడుగుల సవ్వడి వినాలని…
గుండె మూగబోయే… నీ రాకకై గుండె తలుపులు తెరిచి …
కల్లాపి చల్లి కనుపాపల్ని దీపాలు గా చేసుకుని…వచ్చే చీకటి బాటకు ….

వెలుగై కూర్చున్న … మనం చెప్పుకున్న ఊసులు…
నిండు పున్నమి తో పంచుకున్న తీరదాయే మదిలోని కలవరం…
అలిగిన బుజ్జగించి అక్కున చేర్చుకుంటావని ఆశ నై కూర్చున్న …
నీ జాడైనా కానరాని కన్నులకు సమాధానపరుస్తూ..
నీ ప్రతి ఆలోచనలో నేనే ఉన్నానన్న నమ్మకంతో …

ప్రతి ఉదయం నీ తలంపుతో ఉదయిస్తున్న …
నీ జ్ఞాపకాల గజిబిజి లో అస్తమిస్తున్న ….పగలు అందరితో ఉన్నా …
రాతిరి మౌనం మధురాక్షరమై….
నా మదిని కలవరపెడుతుందను క్షణం…
నీ రాకకై నే వేచే ప్రతిక్షణం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!