మా ఊరు

మా ఊరు

రచయిత: బండి చందు

 

పొక్కిలి చుక్కల వాకిళ్ళు
రాలిన తోరణాల ద్వారాలు
చెమ్మగిల్లిన కన్నీళ్ళ గుమ్మాలు
గొళ్ళెపు కళ్లెం ఊడిన తలుపులు
గాలితో వియ్యమొందు కిటికీలు
పొగ మసితో నల్లబారిన చూరులు

పాలకై తల్లడిల్లు పసి పిల్లలు
ప్రాయంలో సాయంకై యువకులు
పెళ్లి కొరకై కన్నీలతో కన్నియలు
రేపో మాపో అన్నట్టు బ్రతికే ముసలి ముతకలు
ఆశయాల అలసటతో మంచాన మనుషులు

చాలా పాత్రలు వాటి పాత్రకై ఏదురుచూపులు
తాగ నీళ్ళు తప్ప గంజి లేని కంచాలు
నడుమే వాల్చే అవసరమే లేని మంచాలు
కూర్చుండ కాలుండని కుర్చీలు
నిల్చుండ చోటు లేని వసారాలు

మనిషి మనిషి మధ్య మౌన గీతాలు
మరెన్నో నిశ్శబ్దపు యుద్దాలు
కళ్ళు సారాయితో నిండిన దేహాలు
కుళ్లు కుతంత్రం తెలియని మనసులు

చుట్టంత మోడు వారిన బీడు భూములు
వానకై కంటనీటితో రైతుల ఎదురుచూపులు
ఆసుపత్రికి అందనంత దూరంలో మా ఆవాసాలు
శ్మశానానికి సమీపాన మా నివాసాలు

అంతరంగాన అంతులేని ఆలోచనలు
చివరి అంకాన మరువలేని జ్ఞాపకాలు
ఎవరికీ పట్టని పట్టించుకోని ఈ నిజాలు
ఇవే మా ఊరి వారసత్వ సంపదలు……

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!