శిధిలావస్థ
రచయిత:కమల’శ్రీ’
శిధిలావస్థలో కి చేరుకున్నాయి
మానవ సంబంధ బాంధవ్యాలు…!!!
రాబందుల్లా మారిన మనుషులు
పేదల రక్తమాంసాలను పీక్కుతింటున్నారు…!!!
మానవత్వం మరిచి కన్నపాశం వదిలి
ఆస్తికోసం ప్రాణాలు హరించే బిడ్డలు…!!!
చిన్నాపెద్దా ముసలీ ముతకా బేధం లేక
ఆడవారి మానాలను తోడేసే
తోడేళ్లు లాంటి మృగాలు…!!!
వయసు మల్లిన కన్నవారిని
ఆశ్రమాల పాలు చేసే కన్నబిడ్డలు…!!!
తుచ్ఛమైన కోరిక తో
బంధాలను కాలరాసే కాముకులు…!!!
డబ్బు వ్యామోహంలో
కుటుంబ ఆలనాపాలనా చూడలేని
కళ్లున్న గుడ్డివారు…!!!
ఆపదలో ఉన్నవారిని కాపాడకుండా
సెల్ఫీ తీస్తూ షేర్ చేసే
సోషల్ మీడియా పిచ్చోళ్లూ…!!!
ఎలా ఉన్న బంధాలు
ఎలా మారాయి
కారణం డబ్బా
మారిన మనిషి మనసా…!!!