ధన్యులు

ధన్యులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖర్రావు

“జాతస్య  మరణం ధృవం “అన్నారు, పెద్దలు. పుట్టిన ప్రతీ జీవి, ఏదో ఒకరోజు మరణించక తప్పదు .మనిషికి మరణమనేది, సహజం.శరీరం శుష్కించి , పటుత్వం కోల్పోయిన తర్వాత, మంచంలో కాలం, వెళ్ళదీయటంకన్నా, మరణం పాలవ్వడం, దేవుడిచ్చిన వరం. అలాగే, రోడ్డు  ప్రమాదాలలో ,బ్రెయిన్ డెడ్ అయి, మరణించిన వ్యక్తులూ ఉంటారు. మరణించిన తర్వాత కూడా, తమ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ, తమ హృదయంతో, స్పందింపచేస్తూ, తమ కిడ్నీలతో శరీరమాలిన్యాలను తొలగిస్తూ, ఇలా, తమ
శరీర అవయవాలతో, ఇతరులకు నిండు జీవితమిచ్చేవారు, ధన్యులు. మరణించిన తర్వాత ఏ శరీరమైనా ఖననమైనా చెయ్యాలి లేక అగ్నికీలలకు దగ్ధమైనా చెయ్యాలి. అటువంటప్పుడు, మనశరీర అవయవాలను ఇంకొకళ్ళకిచ్చి,వాళ్ళకి చూడడానికి కంటిచూపును, మంచి హృదయాన్ని, మంచి ఆరోగ్యాన్నీ, నిండు జీవితాన్ని, ఇవ్వడంలో తప్పేంటి. మనం శిబి చక్రవర్తిలా , ఇతరుల కోసం మన శరీరాన్ని , కోసి ఇవ్వలేకపోయినా, శరీరం, కళ్ళు , హృదయం, కిడ్నీల వంటి పనికొచ్చే అవయవాలను మరణించిన తర్వాత, ఇతరులకు దానమిచ్చి , వాళ్ళకి ఆనందమయ జీవితాన్ని ప్రసాదించటం, మనిషిగా మనం చేయగల గొప్పపని. మరణించిన తర్వాత, మన శరీరంలో అవయవాలన్నీ, మనకు నిరుపయోగమే. కాలి బూడిద చేసేబదులు, భూమిలో ఖననంచేసే బదులు , ఇతరులకు, వెలుగులను పంచితే, తప్పేంటి. ఈరోజే మీ దగ్గరలోనున్న, హాస్పిటల్ నో, సాంఘీకసేవా సంస్ధనో, సంప్రదించండీ లేదా, గుగుల్ లో  సెర్చుచేసి, సాంఘీక సేవాసంస్థలకు, మీ అవయవాలను దానమివ్వండి. మరణించినాక కూడా, మీ అంగాలను దానమిచ్చి,మరల బ్రతకండి.
కళ్ళులేనివారికి , కళ్ళనిచ్చిమీ కంటిచూపుతో జగతిని చూపండి. అలాగే, కిడ్నీలు. ఇతర అవయవాలు, దానమిచ్చి, ప్రాణాలు నిల్పండి. మీరు దానమిచ్చిన విషయం , మీ పిల్లలకు చెప్పండీ. ఇక్కడ ఈ భూమిపై, శాస్వితంగా ఉండేవాళ్ళెవరు , లేరు. ప్రజాకవి కాళోజీ నారాయణరావుగారు జీవితమంతా, ప్రజా పోరాటాలకు అంకితమిచ్చి, మరణించిన తర్వాత కూడా , తన శరీరాన్ని, మెడికల్ కాలేజీకి దానమిచ్చిన మహనీయుడు. మీరుా కూడా అటువంటి మహనీయుడు ఎందుకు కాకూడదు. మానవసేవే మాధవసేవ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!