ఈ వసంతం చాలా కొత్తగా ఉంది

ఈ వసంతం చాలా కొత్తగా ఉంది
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నామని సుజనా దేవి

క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం నుండి  కరోనా పూర్వం కరోనా తర్వాత
అని రూపాంతరం చెందాక  ఈ వసంతం చాలా కొత్తగా ఉంది
సప్త వర్ణాల  ప్రకృతి నుండి   పండు పర్ణాలు రాలినట్లు
అందమైన వర్ణాల జీవితం నుండి కరోనా కాటుకు రాలిన   ఆత్మీయులు
పండగకి ఆత్మీయంగా అక్కున చేరి పులకించే  ఆప్తులు
ఆమడ  దూరంలో అనురాగాన్ని ఆర్తిగా ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లో నింపుకుని
సానితైజర్లతో తడిచిన చేతుల్ని చూసుకుంటూ
అరవిరిసిన ఆమనికి అద్దంలా ఉండే మొహాన్ని అడ్డుగుడ్డతో ఆత్మరక్షణ కోసం చాటేస్తూ
ఆక్క్సిజన్ అందక ఆపసోపాలు పడుతూ తప్పని తద్దినాన్ని వేదనతో భరిస్తూ
ఇంతకాలం అనుభవించిన స్వర్ణ యుగాన్ని గుర్తించలేకపోయిన అజ్ఞానానికి ఆక్రోశిస్తూ
ప్లవనామ వత్సరం వదిలిన చేదు జ్ఞాపకాలు త్యజిస్త
కుహు కుహు అంటూ కూయాల్సిన కోయిల
పారా హుషార్ అంటూ ‘కో వాగ్జిన్’   ‘కోవీ షీల్డ్’ అని కూస్తుంది. అత్యాధునికంగా అపారవిజ్ఞానాన్ని సంపాదించినా
ఆటవిక కాలాన్ని గుర్తు తెస్తూ యుద్ధం పేరుతొ
నర మేధం తో  మారణ హోమం చేస్తూన్న
వ్యధ వేదిస్తూ ఉంటె సమరం  సమసిపోయి సమరసభావనతో సకల విశ్వం
సస్యశ్యామలమై సుభిక్షమై, శాంతి పూలు వికసించాలని శుభాలు తెచ్చే శుభకృత్ ను స్వాగతిస్తున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!