ప్రేమ కథ
రచన: సంజన కృతజ్ఞ
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒక్క రోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేక పోయేవాడు. ఒక రోజు ఆ అమ్మాయి దగ్గరికు వెళ్లి ‘ఐ లవ్ యు’ అని ప్రపోజ్ చేసాడు… దీనికి సమాధానం చెప్పకుండానే ‘నన్ను చూడకుండానే ఒకరోజు గడుపు అని అమ్మాయి పందెం కాసింది …సరే అన్నాడు అబ్బాయి .అమ్మాయిని చూడకుండా ఒక రోజు మొత్తం గడిపేశాడు… కానీ అతడికి తెలియదు… ఆ అమ్మాయి 24 గంటలు మాత్రమే బ్రతుకుతుందని..!! మరుసటి రోజు ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు… అబ్బాయి.. అక్కడ అ ఏడుపులు.. రోదనలు.. ఆ అమ్మాయి చనిపోయింది..!! ఆమె చనిపోయే ముందు అబ్బాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది ..!
“నన్ను చూడకుండా ఒక్కరోజు ఉండగలిగావు .. ప్రతి రోజు నువ్వు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ” ఐ మిస్ యు”!!