తిమిరంతో సమరం

అంశం: చీకటి వెలుగులు

తిమిరంతో సమరం

దోసపాటి వెంకటరామచంద్రరావు

అమ్మగర్భమంతా చీకటే
జననమే చీకటి
పుడమిపై పడితేనే వె‌లుతురును చూసేది
ఇక చూసేదంతా చీకటివెలుగులకేళి
జీవితమంటే ఇదేనేమో?!
చేయాల్సిందే తిమిరంతొసమరం
వీధివీధినా ఒక నరకాసురుడే
అతివలందరూ సత్యభామలవ్వాల్సిందే
అత్యాచారపర్వాలు అంతంచెయ్యాల్సిందే!
చీకటి అలుముకున్న అణగారినజీవితాలెన్నో
ఆశాజ్యోతులను వెలిగించాల్సిందేహ
అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నవారికి
వెలుగుదారులు చూపాల్సిందే
చిరుప్రాయంలోనే చిదిమేస్తున్న చిరుప్రాణులను
చిరుదివ్వెలకాంతులతో చేరదీయాల్సిందే!
చీకటిసామ్రాజ్యంలో చిక్కిన చిన్నారులను
వెలుగులురువ్వె నివాసములకు చేర్చాల్సిందే!
అనాడేకాదు
ఈనాడేకాదు
ఏనాడైనా చీకటివెలుగులరంగేళి రగలాల్సిందే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!