చిన్న సహాయం (సంక్రాంతి కథల పోటీ)

చిన్న సహాయం
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: పద్మజ

పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ రైలు ఎక్కాను వెంటనే రైలు కదిలింది. హమ్మయ్య ఒక్క నిమిషం ఆలస్యమైనా రైలు మిస్ అయ్యేదాన్ని అనుకుంటూ విండో సీట్లో కూర్చున్నా. ఆయాసం తగ్గింది నీళ్లు తాగుదాం అనుకున్నా అప్పుడే ఒక ఆవిడ మతిస్థిమితం లేని చిన్న బాబు ని తీసుకొని నా ముందు నిలబడి చెయ్యి చాపి “డబ్బులు దానం చేయమ్మా పిల్లాడికి అన్నం పెట్టాలి “అని హిందీ లో అడుక్కుంది. వెంటనే నేను వంద రూపాయలు ఇంకా అరటిపండు ఇచ్చి పిల్లాడిని డాక్టర్ కి చూపించు అన్నాను. ఆవిడ చల్లగా ఉండు అని వెళ్ళిపోయింది కంపార్ట్మెంట్ లో ఉన్న మిగిలిన వాళ్ళు వంద రూపాయలు ఇచ్చినందు నన్ను ఒక పిచ్చిదానిలా చూస్తున్నారని అర్ధమయ్యి వాళ్ళను పట్టించుకోకుండా కిటికీలోంచి బయటకు చూస్తున్నా. చెట్లు మొక్కలు అన్ని కాలిపోతున్నట్టు నా ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి.
బిటెక్ పూర్తి అయ్యాక ఆరునెలలు కష్టపడితే అప్పుడు వచ్చింది పుణెలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.మా అన్న-వదిన పుణెలొనే జాబ్ చేస్తూ ఉండడంతో నేను నాన్న రైలు లో వచ్చాం. అన్న వాళ్ళ ఇల్లు పెద్దగా ఉండడంతో హాస్టల్లో ఒక్కదాన్నే ఫ్రెండ్స్ తో ఉండాలి అన్న కల కలగానే ఉండిపోతుంది అర్థమయ్యింది కానీ వదిన నాకు మంచి స్నేహితురాలు పైగా హాస్టల్ వృధా ఖర్చు ఇక్కడ ఉండడమే మంచిది అనుకున్నా.అన్న తో “ఒక వారం ఫ్రీ గా కంపెనీ గెస్ట్ హౌస్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్ కనుక ఆ తర్వాత ఇక్కడే ఉంటా “అన్నాను. అన్న “సరే” అన్నాడు.
మరుసటిరోజు అన్న నన్ను బైక్ లో ఆఫీస్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. మొదటి సారి పెద్ద పెద్ద భవనాలు పూలతోటలు స్వర్గానికి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడే పని చేయబోతున్నందుకు ఆనందం కలిగింది. మొదటి రోజు ట్రైనింగ్ కనుక కొత్త ఫ్రెండ్స్ ఇంకా క్యాంటీన్ లో ఉచిత విందు భోజనం చాలా ఉల్లాసంగా గడిచిపోయింది. మొత్తానికి ట్రైనింగ్ పూర్తి చేసాక ఒక ప్రాజెక్ట్ టీం లో పెట్టారు. అక్కడ అందరూ హిందివారే మొదట్లో నా వచ్చిరాని హిందీతో ఇబ్బంది పడ్డాను కానీ టీం లో అందరూ చాలా మంచివారు. అమెరికా. అమెరికా లో మా టీం మేనేజర్ తెలుగువారు కావడంతో పని సులువుగా ఉండేది.
ఇలా ఆనందంగా ఉద్యోగం చేసుకుంటూ నెల రోజులు అయ్యిందో లేదో అంతలోనే ఒక రోజు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పుడూ నేనె ఫోన్ చేస్తా ఇవాళ అమ్మ ఎందుకు ఫోన్ చేసిందో అనుకుంటూ “హలో అమ్మా నువ్వు ఫోన్ చేశావ్ ఎందుకు? ఏదయినా ముఖ్యమైన విషయం ఆ” అన్నాను. అమ్మ “ఏం లేదు నీకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది వచ్చే శనివారం హైదరాబాద్ కి వచ్చెయ్”అన్నది. “అబ్బా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో నివ్వరా ” అన్నాను కోపంగా.”అబ్బాయిది పుణె లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే అంట నువ్వు వచ్చేయి” అని ఫోన్ పెట్టేసింది. ఇప్పటికే అరడజనుకు పైగా పెళ్లి చూపులు జరిగాయి వాటిలో చాలామంది నేను లావుగా ఉన్నా అని రిజెక్ట్ చేసినవారే అందుకే పెళ్లిచూపులు అంటేనే కోపం ఇంకా చిరాకు.
ఇంటికి వెళ్ళగానే అన్నయ్య ” అమ్మ నాతో పొద్దున్నే చెప్పింది ఇదిగో రేపు ముంబై ఎక్స్ప్రెస్ టికెట్ తత్కాల్ లో బుక్ చేసా ” అన్నాడు అంతలో వదిన లాప్టాప్ పట్టుకొని వచ్చిఇదిగో అబ్బాయి ఫోటో ఇంకా ప్రొఫైల్ చూపిస్తూ “ అబ్బాయి పొడుగ్గా అందంగా ఉన్నారు పైగా టీం లీడర్ ప్యాకేజీ కూడా బానే ఉంది” అంది.”అన్ని బాగున్నాయి కానీ అబ్బాయి కి నేను నచ్చాలి కదా” అన్నాను నేను. అన్నయ్య “నచ్చుతావులే సరే రేపు మధ్యాహ్నం మీ ఆఫీసుకు వచ్చి స్టేషన్ లో దింపుతా అన్నాడు”.నేను “వద్దులే అన్న నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఆటో లో వెళ్తా మళ్లీ నీకెందుకు శ్రమ” అన్నాను. ” ఐతే 2.30 కె ఆఫీస్ నుంచి బయలుదేరు నాలుగు గంటలకే రైలు నాకు కూడా రేపు క్లయింట్ మీటింగ్ ఉంది ” అన్నాడు. మొదటి సారి ఒంటరిగా రైలు ప్రయాణం చేయబోతున్నందుకు ఆనందం వేసింది.
మరుసటిరోజు పొద్దున్నే 6 గంటలకే లేచి ఆఫీస్ వెళ్లిపోయా. సుమారు ఉదయం 9 గంటలకి మా టీం లీడర్ వచ్చి ఈరోజు ఇద్దరు సెలవులో ఉన్నారు అందుకే నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చేసి మెయిల్ పెట్టి వెళ్ళు అని ఎక్కడికో వెళ్ళిపోయాడు. నా కర్మ ఎప్పుడూ ఇంతే అనుకోని పని చేయడం మొదలుపెట్టాను. తొందరగా పూర్తి చేయాలని పనిలో పూర్తిగా మునిగిపోయాను. మొత్తానికి పని పూర్తి చేసి మెయిల్ పెట్టి టైమ్ చూసేసరికి మధ్యాహ్నం మూడు గంటలయింది. ఒక్క సారి కాళ్ళ కింద భూమి కంపించినట్లు ఐయ్యింది. వెంటనే ఆఫీస్ నుంచి బయలుదేరా ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇంక లాభం లేదని ఆఫీస్ లో తెలిసిన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నన్ను మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేయమని ఏడుపు గొంతుతో అడిగాను. వెంటనే అతను మెయిన్ రోడ్ వరకు తీసుకువెళ్లి ఆటో ఎక్కించాడు. సరిగ్గా స్టేషన్ కి ఒక కిలోమీటర్ దూరం లో ట్రాఫిక్ జామ్ అప్పటికే 3.45 ఐయ్యింది. టెన్షన్ పడుతూనే ఆటో దిగి పరుగులాంటి నడకతో రైలు కదలడానికి ఒక్కనిమిషం ముందు ఎక్కాను. హమ్మయ్య అని ఆయాసపడుతూ నాసీట్ లో కూర్చున్నా ఆయాసం తగ్గాక నీళ్లు తాగి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రైలు ఎక్కిన విషయం చెప్పాను. మనసులో థాంక్స్ దేవుడా మిస్సైయ్యి ఉంటే పెళ్లి చూపులు కాదు పెళ్లి చేసేది మా అమ్మ అనుకున్నా.
నా ఎదురుగా ఒక రెండు సంవత్సరాలు ఉన్న చిన్న పాప ఫోన్లో తల పెట్టేసి సీరియస్ గా ఏదో వీడియోస్ చూస్తోంది. ఇంత చిన్న పాప కి ఫోన్ ఎందుకో అనుకుంటున్నా అంతలో వాళ్ళ అమ్మ పాప చేతుల్లోంచి ఫోన్ లాక్కుంది. కొంచెం సేపు ఏడ్చింది తర్వాత నా బొమ్మ లాంటి కీచైన్ ఇవ్వడం తో నాతో ఆడుకోవడం మొదలెట్టింది అంతలో వాళ్ళు దిగాల్సిన స్టేషన్ రావడం తో దిగిపోయారు. తర్వాత నా పక్కన కూర్చున్న తాత తో మాటలు కలిపాను అంతలో కంపార్ట్మెంట్ లోకి ఒక పదిహేనేళ్ల కుర్రాడు వచ్చాడు. అతని ప్రవర్తన చాలా వింతగా అనిపించింది భయంతో వణికి పోతున్నాడు. నా పక్కన ఉన్న తాత ఎంత మాట్లాడించిన అసలు పలకడం లేదు.
కొంత సేపటికి టీసీ వచ్చాడు నా టికెట్ ప్రింటవుట్ చూపించాను. టీసీ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్ళాడు ఆ కుర్రాడు తన చేతిలో ఉన్న 500 ఇచ్చాడు. నీకు పడుకోవడానికి లేదు ఆ విండో సీట్లో కూర్చో అన్నాడు టీసీ. అతనిని ఏమి అడక్కుండా సీట్ ఇవ్వడం చూసి ఆచ్యర్యం వేసింది. అంతలోనే తాత “ఈ రైలులో ఇంతే ఎవరైనా టికెట్ లేకుండా ఎక్కితే డబ్బులు తీసుకుంటారు అది వాళ్ళ జోబుల్లోకె” అని హిందీలో చెప్పారు. నాకు మాత్రం ఆ కుర్రాడు నేరస్తుడిలా కనిపించాడు అంతలోనే ఆ తాత దిగిపోయారు నాకు భయం వేసింది తన కంపార్ట్మెంట్ లో మిగిలిన వాళ్ళు మరాఠీ వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు ఉండడం తో నాబెర్త్ వాళ్లకు ఇచ్చి నేను పైబెర్త్ లో ఎక్కి ఆ కుర్రాన్ని గమనిస్తూ ఉన్నా ఆ కుర్రాడు మరాఠీ లో ఎదో గోనుకుంటున్నాడు అలా అబ్బాయిని గమనిస్తూ నిద్ర లోకి జారుకున్నా.
సమయం సుమారు ఉదయం 4.30 కి మెలుకువ వచ్చింది లేవగానే ఆ కుర్రాడి కోసం చూసా అతను కనిపించలేదు వెంటనే కిందకు దిగి వెతకడం మొదలు పెట్టా చివరకు కంపార్ట్మెంట్ చివర్లో తలుపు దగ్గర కనిపించాడు. హమ్మయ్య అనుకోని అతనితో మాట్లాడే ప్రయత్నం మొదలు పెట్టా. మొదట హిందీలో తన పేరు అడిగాను ఏం అడిగినా నన్ను చంపకండి అని మరాఠీ లో చెపుతున్నాడు అని అర్థం చేసుకున్న. కొంతసేపటికి తన సీట్లో వెళ్లి కూర్చున్నాడు నేను అతని ఎదురు సీట్ లో కూర్చుని నా బ్యాగ్ లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి అబ్బాయి కి ఇచ్చాను అతను తీసుకుని గబా గబా తిన్నాడు తర్వాత కూర్చొని నిద్రపోయాడు.
నేను చివరకు ఇతను మనసికరోగి అనే అభిప్రాయానికి వచ్చా ఎందుకంటే ఇంతకు ముందు నా బందువుల్లో ఒక అబ్బాయి అలాంటి జబ్బుతో ఉండడం చూసా కాబట్టి. రైలు దిగాక ఈ అబ్బాయి గురుంచి రైల్వే పోలీసులకు చెప్పాలి అనుకున్నా. నాన్న వస్తే నీకెందుకు అంటారు నాన్న కు అరగంట రైలు ఆలస్యం అని అపద్దము చెబుదాం అని ఫోన్ తీసా అంతలోనే నాన్న ఫోన్ చేసి “ఒంట్లో కొంచెం నలత గా ఉంది డైరెక్ట్ ఆటోలో వచ్చేయి” అన్నారు సరే నాన్న అని చెప్పా. ఉదయం 6.30 కల్లా నాంపల్లి స్టేషన్ వచ్చేసింది అందరూ రైలు దిగిపోయారు ఆ కుర్రాడు నిద్రలేచాడు కానీ అలాగే కూర్చొని ఉన్నాడు. నేను నా బ్యాగులో ఇంపార్టెంట్ కానీ బ్యాగ్ ఆ అబ్బాయి కి ఇచ్చి ఇప్పుడే వస్తా అని రైల్వే పోలీస్ రూమ్ కి వెళ్లి ఆ అబ్బాయి గురుంచి చెప్పా.. అప్పుడు ఒక గార్డ్ వెళ్లి బలవంతంగా అతన్ని తీసుకువచ్చాడు అతను ఏడుస్తూ ఉన్నాడు. పోలీసులు మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అని ఆ అబ్బాయి దగ్గర నుంచి బ్యాగు తీసుకుని నాకు ఇచ్చి పంపించారు.
పోలీసులతో జాగ్రత్త ఈ అబ్బాయి మానసిక రోగి డాక్టర్ కు చూపించండి అని చెప్పి బయలుదేరా. కొంచెం దూరం వెళ్ళాక నాకు ఇటువంటి మతిస్థిమితం లేని వారిని ఆదరించే సేవా సంస్థ కార్డు నాదగ్గర ఎవరో ఇచ్చినట్టు గుర్తుకు వచ్చింది వెంటనే బ్యాగు మొత్తం వెతికాను చివరికి దొరికింది కానీ సగం ముక్కే దానిలో నెంబర్ మాత్రమే ఉంది వెంటనే ఫోన్ చేసా ఆ కుర్రాడి వివరాలు చెప్పా వాళ్ళు మేము తీసుకుంటాం అని చెప్పి మీరు పోలీస్ కి ముందు ఇన్ఫోర్మ్ చేసి ఉంచండి అని చెప్పారు. నేను అలాగే అని చెప్పి వెంటనే పరుగులాంటి నడకతో రైల్వే పోలీస్ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పా. అతను ఆ కార్డు తీసుకుని మంచి పని చేశావ్ తప్పకుండా వాళ్లకు అప్పచెపుతాం వాడు నిజంగానే పిచ్చివాడే ఎంత అడిగినా వివరాలు చెప్పలేదు అన్నాడు. నేను హమ్మయ్య అనుకోని ఇప్పటికే ఆలస్యం ఐయ్యింది అనుకోని డైరెక్ట్ ఇంటికి ఆటో మాట్లాడుకుని వెళ్తున్నా. ఆటో లో ఫోన్ చేతిలో పట్టుకొని నాన్నకు ఫోన్ చేద్దాం అనుకునేలోపే ఆటో అతను సడన్ బ్రేక్ వేయడం ఫోన్ ఆటో లోంచి బయటకు పడిపోవడం ఫోన్ పై కార్ వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి. నేను వెంటనే ఆటో దిగి పగిలిపోయిన ఫోన్ తెచ్చుకున్నా. ఆటో అతను “సారి అండి చిన్నపిల్లాడు సైకిల్ తో అడ్డం వచ్చాడు మేడం అందుకే బ్రేక్ వేసా” అని చెప్పాడు. నేను సరేలే నీతప్పు కాదులే. ఇంక పోనీ ఆటో అని చెప్పి అమ్మ ఏమంటదో నాకు జాబ్ వచ్చింది మా పెద్దన్న ప్రేమగా కొనిచ్చాడు అయ్యో ఇప్పుడు నంబర్స్ ఫోటోలు అన్నీ పోయాయి బాధపడుతున్నా అంతలో ఇల్లు వచ్చింది. అమ్మకు ఫోన్ గురించి చెప్పా. ఆ రోజు నా పెళ్లి చూపులు కాబట్టి ఎం అనలేదు. ఇంకా పెళ్లిచూపుల హడావిడిలో ఆ కుర్రాన్ని మర్చిపోయా. పెళ్లిఅబ్బాయి వాళ్ళు వచ్చారు ఈ సారి ఉద్యోగం ఉంది సంబంధం కుదురుతుంది అన్న ఆశలో ఉన్నారు అందరూ. అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మ ఉద్యోగం గురుంచి జీతం గురుంచి అన్ని వివరాలు అడిగారు వెళ్లిపోయారు.
ఈ సంబంధం కుదురుతుంది అన్న ధీమాలో ఉన్న నాన్నకు సాయింత్రం అమ్మాయి లావుగా ఉంది మా అబ్బాయికి నచ్చలేదు అని అబ్బాయి వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో నాన్న తిండి తగ్గించు అని పాత రామాయణం మొదలు పెట్టారు అసలే ఫోన్ పోయింది ఆ కుర్రాడిని తీసుకెళ్లారో లేదో అని చిరాకులో ఉన్న నాకు ఏడుపు వచ్చింది . ఈ అబ్బాయిలు పెళ్లయ్యాక భార్య లావైతే ఏం చేస్తారు ఐనా వాడు నన్ను వద్దు అనుకునేదేంటి రూపం తప్ప మనసుకి విలువ ఇయ్యని వాడు నాకు ఎందుకు అని మనసులో అనుకోని “సరే నాన్న ఈసారి వచ్చేసరికి సన్నగా అవుతా ఈ రోజు నుంచే తిండి మానేస్తున్నారు” అని రాత్రి భోజనం చేయకుండా మంచెము ఎక్కా. అమ్మ వచ్చి పాలు తాగు మీ నాన్న మాటలు పట్టించుకోకు అని ఓదార్చింది ఇదే సమయం అనుకోని రేపు ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళడానికి అమ్మని ఒప్పించ్చా. ఉదయం 6 గంటలకే లేచి తయారై ఇంటి నుంచి బయట పడ్డా. నేను వాలెంటీర్ గా పని చేస్తున్న సేవా సంస్థ లో మిత్రులని కలిసి ఉద్యోగం వస్తే నేను డోనేట్ చేయాలనుకున్న 5000 ఇచ్చి మరోసారి తన పేరు మీద బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయమని చెప్పి అనాధ పిల్లలతో ఆనందంగా అడుకొని ఇంటికి చేరా. మళ్లీ పుణె వెళ్ళిపోయి నాఉద్యోగంలో బిజీ ఐపోయా.
అంతలో టిసి వచ్చి టికెట్ అని గట్టిగా అనడంతో జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చి టికెట్ ఇంకా పాన్ కార్డ్ ఇచ్చా. టి. సి “నీ పేరు ఏంటి” అని అడగగానే “శ్రీలక్ష్మి” అని చెప్పా. తర్వాత డిన్నర్ తినేసి ఈసారన్నా పెళ్ళికొడుక్కి నచ్చుతానో లేదో అనుకుంటూ నిద్రపోయా. ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఆ అబ్బాయి లేదా ఆ పోలీస్ గురుంచి కనుక్కోడానికి ప్రయత్నించాను కానీ ఏం సమాచారం దొరకలేదు. ఇంటికి వెళ్ళా మళ్లీ పెళ్లిచూపులు ఐపోయాయి. ఒకసారి మెయిల్ చూద్దాం అని లాప్టాప్ తెరిచా మొదటి మెయిల్ నేను వాలెంటీర్ గా పనిచేసిన సేవా సంస్థ నుంచి. ఈ సంస్థ వాళ్లు ప్రతి ఆదివారం ఎదో ఒక అనాధ ఆశ్రమంలో కానీ వృద్ధ ఆశ్రమం కానీ ఉదయం అల్పాహారం ఇచ్చి కొంత సమయం గడిపి వాళ్లకు ఏమైనా అవసరాలు ఉంటే సేకరిస్తారు. ఈ సారి ఒక మానసిక వికలాంగులను ఆదరించే అనాధ ఆశ్రమంలో చేస్తున్నారు. మెయిల్ చూసిన నేను ఫోన్ చేసి ఆ అబ్బాయిని చేర్పించిన ఆశ్రమం అదే అని గుర్తు పట్టా.
మరుసటిరోజు ఆదివారం ఉదయమే లేచి 6 గంటలకే ఆ మానసిక వికలాంగుల ఆశ్రమానికి బయిలుదేరా నేను చేరుకునే సరికే మా సంస్థ వలేంటీర్స్ ఇడ్లి వడ వడ్డిస్తున్నారు నేను చట్నీ గిన్నె తీసుకొని వడ్డిస్తూ ఆ అబ్బాయి కోసం వెతికాను ఎక్కడా కనిపించలేదు. బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఐపోయాక ఆ ఆశ్రమం యజమానితో “మీతో కొంచెం మాట్లాడాలి అని” అడిగాను. అతను చెప్పండి అన్నారు. నేను ఆ కుర్రాడి గురుంచి తను ఫోన్ చేసిన విషయం చెప్పి ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగా. అతను ఆ అబ్బాయికి ఎర్రగడ్డ లో ట్రీట్మెంట్ తర్వాత నయమైంది సోలాపూర్ దగ్గర పల్లెటూరు చక్కగా చదువుకుంటున్నారు. మీరు ఆ రోజు చాలా మంచి పని చేశారు అని అభినందించారు. నాకు పట్టరాని సంతోషం కలిగింది.

అంతలోనే ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. “అక్క నేను ప్రశాంత్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీస్ కి అప్పచెప్పారు గుర్తుందా మీ నెంబర్ కోసం చాలా కష్టపడ్డాను చాలా థాంక్స్ అక్క” అని హిందీలో చెబుతున్నారు. అప్పుడు నేను ఆ అబ్బాయితో “నేను నిన్ను చేర్పించిన ఆశ్రమంలో ఉన్నాను చాలా హ్యాపీ గా ఉంది నీకు నయమైనందుకు” అన్నాను. అంతలో ఆ కుర్రాడు వాళ్ళ అమ్మకు ఫోన్ ఇచ్చాడు ఆవిడ థాంక్స్ చెపుతూ మాకు మానసిక జబ్బు అని తేలిక వాణ్ణి ఇబ్బందిపెట్టాం వాడు పారిపోయాడు. నువ్వు దేవతలా వాడిరోగం నయంయ్యేలాచేశావ్. వాడు రాకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేవాళ్ళం థాంక్స్ బేటీ అని చెప్పింది. నాకు నోట మాట రావట్లేదు అతికష్టం మీద అంత దేవుడి దయ అని చెప్పి కూర్చిలో అలా కూర్చుండిపోయాను. మనం చేసిన సహాయం వల్ల ఎవరికైనా మంచి జరిగితే వచ్చే ఆనందమే వేరు అనుకోని పెళ్లి ఐనా ఏదయినా నాకు వీలైనంత మందికి సహాయం చేయాలని ధృడంగా నిశ్చయించుకొని ఇంటికి బయలుదేరా.

సహాయం చేయడానికి డబ్బే అవసరం లేదు. మంచి మనసు ఉంటే చాలు.
ఇది కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రాయబడ్డ కథ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!