మొబైల్ దేవత

మొబైల్ దేవత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

ఓరి దేముడా,
ఈ కలియుగంలో
మొబైల్ లేకుండా ఏ పని సాగదయ్యా
ప్రొద్దునలేవగానే నీ ఫోటో చూడాలన్న,
వార్తలు చదవాలన్న,
ఆన్లైన్లో టిఫిన్ ఆర్డరు చెయ్యాలన్న,
వంటకి తాజా కూరగాయలు కొనాలన్నా,
కిరాణా సామాను కావాలన్నా
మొబైల్ భార్య కన్న మిన్న
ఆఫీస్ కి ఓల కారు బుక్ చెయ్యాలన్న
పిల్లల స్కూలు ఫీజు బ్యాంకులో ఆన్లైన్ కట్టాలన్న
భార్య బొట్టు బిళ్ళల దగ్గర నుంచి
నైల్ పాలిష్ వరకు,
కావాల్సి వచ్చిన సౌందర్య వస్తువులు కూడా ఆన్లైన్లో తెప్పించుకునే వసులుబాటు,
పుట్టినరోజులు, పెళ్లిరోజులు
పిక్నిక్ లు, విహారయాత్రలు
హోటల్ బుకింగ్స్, అన్ని మొబైల్ దేవత వల్లే
క్షణాల్లో  సాధ్యం,
మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోయి,
మనిషికి మనిషి మాట్లాడుకునే
రోజులు పోయి,
అరచేతిలో ఇమిడిపోయే ప్రపంచాన్ని తన చేతిలోనే ఉంచుకొని, మగతలో ఉన్నాడు మానవుడు.
హలో హలో అన్న శబ్దాలే
శ్రీ రామ నామాలుగా జపిస్తూ
తన పర బేధాలను మరచి
సత్సంబంధాలు కోల్పోయి,
మనిషి ఒంటరివాడు అయినాడు.
పదిరూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల
వరకు కొనాలన్నా అమ్మాలన్న
ఫోన్ పేలు, పేటీఎంలు
వాడుతూ, శారీరిక శ్రమ మరచి
మొబైల్ దేవత మీద ఆధారపడి
బ్రతుకు సాగదీస్తున్నారు ఆధునిక ప్రపంచం.
టెక్నాలజీ కి ఒక్కసారి కుప్పకూలితే,
200 ఏళ్లు వెనక్కి వెళ్ళగలిగే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రమా జాగ్రత్త.
మనిషిని అత్యాశకు గురి చేసే
అమెజాన్, ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లతో అనుకున్నవి తక్షణమే ఇంటిముందు వచ్చి పడే సదుపాయం,
ఆ వస్తువు కోసం, మనిషి శ్రమ పడకుండా, తన  సౌలభ్యం కోసం, శారీరిక శ్రమ లేకుండా బలిసిపోయి అనారోగ్యం పాలవుతూ,
ఆఖరికి ఆసుపత్రిలో కూడా
బిల్లులు చెల్లించలేక సతమతమవుతూ
ఆన్లైన్ రుణాలకు తన మొబైల్ ద్వారానే
అధిక వడ్డీలకు తీసుకుని దిన దిన గండన్గా
మనిషి పతనం అవుతున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!