సీతాకోకచిలుక

స్వేచ్ఛగా ఎగిరే గువ్వలని చూసి

ఎన్నో సార్లు అనుకున్న వాటి స్వేచ్ఛ

నాకు లేదే అని

కూటి కోసం గూడు కోసం

ఏ పక్కనించి ఏ వేటగాడు వస్తాడో అని

భయంతో బ్రతికే వాటిని చూస్తుంటే అనిపించింది

పోరాటం ప్రతిచోటా తప్పదని ఎగిరే రెక్కల వెనుక

ఒంటరి యుద్ధమే చేస్తుందని

గల గల సవ్వడి చేసే జలపాతాలు చూసి

ఎన్నో సార్లు అనుకున్న వాటి తుళ్లింత

నాకు లేదే అని

ఆగకుండా సాగే ఆ పయనంలో

ఎన్నో అవరోధాలు అలుపెరుగక సాగే పరవళ్ల ప్రవాహానికి

కలిసేవి ఎన్నో విడిపోయేవి ఎన్నో

ఎవరున్నా లేకున్నా గమ్యం చేరేవరకు

తన పయనం ఆపదని

రోజు విరిసే పువ్వుల్ని చూస్తుంటే

మనసుకి ఎంతో ఆశ వాటి సుకుమారం లావణ్యం

నాకు ఉంటే బావుండు అని

వాటిని చూసినపుడు తెలుస్తుంది

ఉండేది ఎంత కాలం అయినా

వున్నంతకాలం మనకంటూ విలువ ఉండేలా బ్రతకాలని

రాలిపోయే చివరివరకు

చిరునవ్వు చెదరకుండా ఉంచుకోవాలని

చుట్టూ ప్రకృతిని చూస్తుంటే

ఎన్నో అందాలు మరెన్నో ఆనందాలు

ఆ అందాన్ని పొందటానికి

ఆ ఆనందాన్ని అందుకోటానికి

ఎంత పోరాటం చేయాలో

ఎన్నెన్ని గాయాలు భరించాలో

ఒక్కోటి పొందటానికి

ఎన్ని వదులుకోవాలి

    సంధ్య

You May Also Like

2 thoughts on “సీతాకోకచిలుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!