వ్యభిచారి

ఏమండీ లేవండి ఆఫీస్ కి టైం అవుతుంది. సెవెన్ థర్టీ అయ్యింది అంటూ మౌర్య మీదకి వాలిపోయి చెవిలో నెమ్మదిగా చెప్తూ నిద్ర లేపుతుంది ప్రోక్తా తన శ్రీవారిని. మ్మ్మ్…గుడ్ మార్నింగ్ డియర్ అంటూ ఆమెను పట్టుకోవాలని చేతులు ముందుకు చాచాడు. ఇంతలోనే అతనికి దొరకకుండా సరే సరే తొందరగా లేవండి. నేను బాబుని రెడీ చేస్తాను అని గబ గబా వెళ్ళిపోయింది.  “చ్చ, సంవత్సరం నుంచి ఇది ఇలానే చేస్తుంది రాక్షసి”, మనసులో తిట్టుకుంటూ రెడీ అవ్వడం స్టార్ట్ చేసాడు. మౌర్య రెడీ అయ్యి వచ్చేసరికి ప్రోక్త బాబుకి (శౌర్యా) టిఫిన్ పెడుతూ, మౌర్య ని చూసి ఈరోజు మీకు ఇష్టమైన కట్టుపొంగలి చేశాను. తొందరగా రండి అంది. మౌర్య కి చాలా అసహనంగా ఉంది. కోపంగానే పెట్టినదంతా తినేసాడు.అది చూసి ప్రోక్త ముసిముసిగా నవ్వుకుంది. మౌర్య, బాబు లంచ్ బాక్స్ లు తీసుకొని, బాబు స్కూల్ కి, మౌర్య ఆఫీస్ కి వెళ్లిపోయారు. ప్రోక్త కూడా రెడీ అయ్యి తన ఫ్రెండ్ బోటిక్ కి వెళ్ళిపోయింది.

మౌర్య ప్రోక్త లకి పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి 3 ఇయర్స్ బాబు పేరు శౌర్యా. మౌర్య సాఫ్ట్ వేర్ జాబ్,  బాబు ప్లే స్కూల్, ప్రోక్త తన ఫ్రెండ్ బోటిక్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంది. అందమైన కుటుంబం. కాని చిన్నచిన్న కలతలు సహజం భార్యాభర్తల మధ్యలో. ఆఫీస్ లో చాలా అసహనంగా ఉన్నాడు మౌర్య. అబ్బా అప్పుడే సంవత్సరం అవుతుంది . ఈ సంవత్సరం అసలు నేనెలా ఉన్నాను ప్రోక్తని వదిలి. ఛ ఇంత తప్పు ఎలా చేశాను? అసలు ప్రోక్త కి నా మీద ఎందుకు కోపం వచ్చింది? మరి కోపం వస్తే నామీద తను కోపం చూపించడంలేదు. నాతో ప్రేమగానే ఉంటుంది. కాని మరి తను నా దగ్గరికి రావడం లేదు ఎందుకు? నేను తన దగ్గరికి వెళ్తుంటే నా నుంచి తప్పించుకుంటుంది. నా పక్కన కూర్చోవడంలేదు, పడుకోవడంలేదు, ఎందుకు ఏమయ్యింది? పోని ఏదన్నా అనారోగ్య సమస్య అనుకోవటానికి లేదు, ఎందుకిలా ఉంటుంది దూరంగా అని ఎంత ఆలోచించినా సమాధానం దొరకటం లేదు. కారణం ఏమై ఉంటుంది  అనుకుంటూ తలని రెండు చేతులతో పట్టుకొని ఆలోచిస్తున్నాడు.

“ఏంటి రా ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్?..”మౌర్య ఆలోచనలని చెదరగొడుతూ అడిగాడు పృథ్వి. “అహ, అలా ఏమి లేదురా, ఏదో చిన్న డిస్టర్బన్స్..అంతే”. “ఏమో గత కొన్ని రోజుల నుండి చూస్తూనే ఉన్నాను, నాకైతే చిన్నది అనిపించటం లేదు..సరేలే, నీకు ఇష్టముంటే చెప్పు ఏదన్న సలహా ఇస్తాను. కాని ప్రశాంతంగా ఆలోచించు మౌర్య. నీ ప్రాబ్లెమ్ కి నీకే సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ప్రాబ్లెమ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది తెలుసుకో. అప్పుడు సొల్యూషన్ కనిపిస్తుంది. చిల్ యార్ నువ్వు ఇలా డల్గా ఉంటే బాగోదురా.” “థాంక్స్ రా పృథ్వి. కాఫీ కి వెళ్దాం పద.. ” ,ఇంకా మాటలు పెరిగితే తన మనసులో బాధ ఎక్కడ బయటకి చెప్పేస్తానో అన్న ఆలోచనతో కదిలాడు..పృథ్వి కూడా అతన్ని అనుసరించాడు.

కాంటీన్ లో వీళ్ళకి జయంత్ కనిపించాడు. పృథ్వి  “ఏంటి రా జయంత్ ఎంత వరకు వచ్చింది నీ పని? మనస్వినికి ప్రొపోజ్ చేసావా లేదా?”  ” లేదన్న ఇంకా చెయ్యలేదు. మా అమ్మ నాకు మ్యాచెస్ చూస్తుంది. కొడుకుని అని కూడా చూడకుండా అమ్మకానికి పెట్టింది అన్నా…. ” అంటూ ఏడుసున్న జయంత్ ని ఓదారుస్తున్నాడు పృథ్వి. “అదేంటిరా అలా అంటావు? మేమంతా కూడా కట్నం తీసుకునే పెళ్లి చేసుకున్నాం కదా. అందులో వింతేముంది?” అడిగాడు మౌర్య. హా దీనికే ఇలా బాధ పడాల అని పృథ్వి కూడా అన్నాడు.

“కట్నం గా పది లక్షల క్యాష్, పావుకేజీ బంగారం కావాలంట మా అమ్మకి. మార్నింగ్ మ్యారేజ్ బ్రోకర్ కి చెప్తుంటే విన్నాను. అంత కట్నం తీసుకొచ్చే అమ్మాయిని మాత్రమే ఇంటికి కోడలిగా నాకు పెళ్ళాం గా ఆక్సిప్ట్ చేస్తుందంట.”,తన సమస్య చెప్పాడు జయంత్. “మరి నువ్వు మనస్వినిని లవ్ చేస్తున్నావు, వాళ్లేమో మిడిల్ క్లాస్. మీ అమ్మగారు అడిగిన కట్నం ఇవ్వలేరుకదా… మరి ఏం చేస్తావురా? “అడిగాడు పృథ్వి.”అన్న అసలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోడం నాకు ఇష్టం లేదన్న” బాధగా అన్నాడు జయంత్.మౌర్య టాపిక్ మార్చాలని “అవునురా నీ ఫ్రెండ్ సందీప్ ఏంటి జాబ్ కి రిసైన్ చేస్తున్నాడంట. ఎందుకు?”

ఇంతలో పృథ్వి “ఒరేయ్ మౌర్య ఇది చూడరా, నా ఫేస్ బుక్ నోటిఫికేషన్, చి ఛీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా రా అసలు? కాల్ బాయ్ అంట.” అని తనకి వచ్చిన నోటిఫికేషన్ ని మౌర్యకి, జయంత్ కి చూపించాడు. “Unsatisfied Married Women Please Message me in my Inbox…. I will satisfy you” అని తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు ఆ నోటిఫికేషన్ లో. అది చూసి మౌర్య , జయంత్ కూడా షాక్ అయ్యారు. దానికి సంబందించిన ప్రొఫైల్ ని అతని ఫ్రెండ్స్ లిస్ట్ ని చెక్ చేద్దామంటే అన్నీ లాక్ అని ఉంది. ఫ్రెండ్ అయ్యిన వాళ్ళు మాత్రమే అతని ప్రొఫైల్ చూసేలా సెట్ చేసుకున్నాడు.

“ఏంటి బ్రోస్ ఏం చేస్తున్నారు అంత సీరియస్ మ్యాటరా?” అంటూ, వాళ్ళు చూసిన ఫేస్ బుక్ లో ప్రొఫైల్ చూసి” ఓహ్ ఇదా మీరు చూస్తుంది” అని చాలా మామూలుగా అన్నాడు అప్పుడే అటు వచ్చిన సందీప్. “అదేంటిరా సందీప్ ఇంత మామూలుగా చెప్తున్నావు? అయినా నువ్వెంటి జాబ్ రిసైన్ చేసావు? మరి ఎక్కడ జాబ్ చేస్తున్నావు?” అని అడిగాడు పృథ్వి. సందీప్ గట్టిగా  నవ్వి” సరే భయ్యా నేను చాలా ఓపెన్ అని మీకు తెలుసుకదా చెప్తాను. మీరు ఫేస్ బుక్ లో చుసిన ప్రొఫైల్ నాదే.”

“వాట్!” షాక్ తో ముగ్గురు సందీప్ వైపు చూసారు.

“కూల్ కూల్ భయ్యా దీనికే ఇంతలా షాక్ ఐతే ఎలా.

ఆ ప్రొఫైల్ నాదే. ఆ ప్రొఫైల్ వల్ల నాకొక ఆంటీ పరిచయం అయ్యింది. ఆమె తన హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకొని విడిగా ఉంటుందంట. ఆమె కొడుకు అమెరికా లో చదువుకుంటున్నాడంట. బాగా డబ్బు ఆస్తి ఉన్నాయి. నాతో ఫ్రెండ్షిప్ చేసింది. నేను నచ్చాను తనకి. ఇంక రిలేషన్ స్టార్ట్ చేశాము.”చాలా కూల్ గా నవ్వుతూ అన్నాడు సందీప్. “ఛి ఛీ అలా చెయ్యడానికి సిగ్గు లేదారా నీకు? నీకంటే ఏజ్ లో పెద్దావిడతో రిలేషన్ లో ఉండటం అసలు ఎంత ఛండాలంగా ఉందొ ఆ మాట వింటేనే. తప్పు అనిపించడం లేదారా నీకు” ,పృథ్వి సీరియస్ అయ్యాడు సందీప్ మీద.

“ఇందులో తప్పేముంది భయ్యా. నేను నచ్చాను అంది. తనని సుఖపెట్టమంది. నేను సుఖపడుతున్న. ఇంక అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇస్తుంది. ఇంక లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న భయ్యా ” “ఏంటి డబ్బు కోసం ఇలా చేస్తున్నావా? అలా చెప్పడానికి సిగ్గు లేదారా నీకు? మగాడివి అయ్యుండి అలా డబ్బు కోసం అలాంటి పని చేస్తున్నావా” పృథ్వి అడిగాడు.

“భయ్యా ఇందులో తప్పేముంది మీరు పబ్లిక్గా చేస్తున్నారు. నేను సీక్రెట్ గా చేస్తున్న అంతే. ఇందులో తప్పేముంది? “అనగానే అందరూ బ్లాంక్ ఫేస్ లతో ఒకరినొకరు చూసుకున్నారు.సందీప్ అందరిని చూసి నవ్వుకుంటూ “అర్థం కాలేదా? సరే మీరు కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారు కదా. డబ్బు తీసుకొనే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిని సుఖపెడుతున్నారు, నేను అంతే. నిజం చెప్పాలంటే అమ్మాయి దగ్గర కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు వ్యభిచారే, కాదంటారా?”, ఇంతలో సందీప్ కి కాల్ రావడంతో అందరికి బై చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

సందీప్ చెప్పింది విని ముగ్గురూ  సైలెంట్ అయిపోయారు.” వీడు కొత్తగా లాజిక్ చెప్పాడురా” అన్నాడు పృథ్వి. మౌర్యకి మనసులో బాధగా అనిపించింది.అప్పుడే తనకి గుర్తు వచ్చింది ప్రోక్త ఎందుకు బాధ పడుతుందో. నేను డిసైడ్ అయ్యాను భయ్యా “మా అమ్మని ఒప్పించి కట్నం తీసుకోకుండానే మనస్విని ని పెళ్లి చేసుకుంటాను” అని అన్నాడు జయంత్. “సరేరా ఇంక స్టార్ట్ అవుదాం, ఇంటికి లేట్ అవుతుంది.” అని అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు.

మౌర్య ఇంటికి వెళ్లేసరికి  బాబు జీన్స్ ఫాంట్ వైట్ టీషీర్ట్ వేసుకొని ముద్దుగా హీరో లా రెడీ  అయ్యి ఉన్నాడు. బాబు ని చూసి ఎంతైనా నాకొడుకు కదా అందంగానే ఉంటాడు అని మురిసిపోయాడు మౌర్య. “ఎక్కడికి వెళ్తున్నారు అబ్బాయిగారు రెడీ అయ్యారు”  కొడుకుని అడిగాడు మౌర్య బాబుని ముద్దు పెట్టుకుంటూ. “నాన్న, నేను మమ్మీ నా ఫ్రెండ్ హార్దిక్ బర్తడే పార్టీ కి వెళ్తున్నాము “అని ముద్దుగా చెప్పాడు.”ఓహో ఓకే మరి నీ  ఫ్రెండ్ కి ఏం గిఫ్ట్ కొన్నావు? ”

“మమ్మీ తన కోసం టిఫిన్ బాక్స్ కొన్నది నాన్న. తనకి యూస్ అవుతుంది కదా అది.”  “ఓహ్ వెరీ గుడ్ సరే నువ్వు షూస్ వేసుకో నేను ఫ్రెష్ అవుతాను “, లోపలికి వెళ్ళాడు. పీచ్ కలర్ శారి లో అందంగా ఉంది ప్రోక్త…అద్దం ముందు నిలబడి తలలో పువ్వులు పెట్టుకుంటుంది. మౌర్య తనని అలా చూసి ఆమె వెనకగా వచ్చి ఆమెను  హత్తుకోబోయాడు. వెంటనే ప్రోక్త అతని నుంచి తప్పించుకొని “సారీ నా దగ్గర డబ్బులు లేవు” అని ఇంకొక మాటకి  తావివ్వకుండా బాబుని తీసుకొని గబా గబా వెళ్ళిపోయింది.

ఆమె వెళ్లిన వైపు బాధగా చూస్తూ సారీ ప్రోక్త నిన్ను బాధ పెట్టాను, సరదాగా అన్న మాటకి నువ్వు ఇంత ఫీల్ అవుతావని అనుకోలేదు. నన్ను క్షమించు ప్రోక్త. నువ్వు ఎంత బాధ పడుతున్నావో రోజూ నీ  కంటి లోని చెమ్మదనమే చెప్తుంది. నిన్ను బాధ పెట్టాను ఆ బాధని నేనే తీరుస్తాను. అని అనుకుంటూ ఒక నెంబర్ కి డయల్ చేసి మాట్లాడాడు. థాంక్స్ రా సందీప్ నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ నీవల్లనే దొరికింది అని సందీప్ కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మౌర్య.

మరుసటి రోజు ఉదయాన్నే ప్రోక్త అమ్మనాన్న వచ్చారు. హాల్లోనే ఉన్న మౌర్య వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు. ప్రోక్త వాళ్ళ అమ్మానాన్నకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ప్రోక్త అమ్మానాన్న వాళ్ళ ఇంటికి బయలుదేరారు. బాబు వాళ్ళతో వెళ్తానని పేచీ పెట్టేసరికి ప్రోక్త బాబుని వాళ్ళతో పంపించింది. ఇంక ఇంట్లో మౌర్య ప్రోక్త ఉన్నారు.” ప్రోక్త, నీతో మాట్లాడాలి,కొంచం ఇక్కడ కూర్చో.”

“పర్వాలేదు చెప్పండి ఇక్కడికి కూడా వినిపిస్తుంది” బెడ్రూమ్ గుమ్మం దగ్గరే నిలబడింది. “ఏంటే ఎక్కువ చేస్తున్నావు” అంటూ ఒక్కసారిగా ఆమెను చుట్టేసి బెడ్ మీదకి పడేసాడు. అలా చేస్తాడు అని ఊహించని తను, షాక్ నుండి కోలుకుని అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే మౌర్య ఆమె రెండు  చేతులని పైకి పెట్టి తన చేతులతో బంధించాడు. “దొంగసచ్చినోడా, గుమ్మడికాయ గాడా, బండోడా నామీద నుంచి లేరా నా పొట్టని, నీ పొట్ట లోపలికి నొక్కేస్తుంది నా మీద నుంచి లే”అంటూ గింజకుంటుంది.

“ఏంటే ఆ తిట్లు నేను నీకు మొగుడినే. పొద్దున్నే లేచినప్పుడు నా పాదాలకి  నమస్కారం చేస్తావు ఇప్పుడేమో ఇలా తిడుతున్నావు తప్పు కదా”అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. “ఏమీ కాదు ఇప్పుడు లేవకపోతే అరుస్తాను. శౌర్యా శౌర్యా అని అరుస్తూ  అబ్బా లేవండి మీ కింద నేను స్టాంప్ అయిపోతున్న. అయినా నన్ను టచ్ చెయ్యద్దు మీరు. నాకు ఇష్టం లేదు. నా దగ్గర డబ్బులు కూడా లేవు.”వదిలించుకోవడానికి ట్రై చేస్తూనే మళ్ళీ శౌర్యా శౌర్యా అని అరిచింది.

“ఏంటే ఇంకా రాలేదా నీ ఆయుధం? నువ్విలా అరుస్తావనే వాడ్ని మీ అమ్మ వాళ్ళతో పంపేసాను. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు…. అంటూ దౌర్జన్యంగా ఆమె బ్లౌస్ హుక్స్ తీసేసాడు.” “వద్దు ప్లీజ్ వదలండి. రాక్షసుడా వదలరా”అంటూ.. గింజకుంటుంది. “నేను ఇప్పుడు నిజాంగా రాక్షసుడినే. సొంత పెళ్ళాన్ని రేప్ చేసే మొగుడిగా తయారుచేసావు నువ్వే. అలా కాదు నీ వీక్నెస్ మీద దెబ్బకొడతా “అంటూ ఆమె మెత్తని  లోతైన నాభి చుట్టూ తన పెదవుల్తో ముద్దులు పెడుతూ ఆమె నడుము ఒంపులలో కొరుకుతుంటే..

ఆమె గలగలా నవ్వుతూ ప్లీజ్ ప్లీజ్ వద్దొద్దు కితకితలు వస్తున్నాయి ప్లీజ్ ఆపండి మీసాలు గుచ్చుకుంటున్నాయి ప్లీజ్ వద్దు అంటూనే నవ్వుతూ ఉంది….ఆమె నవ్వే అతనికి బలమయ్యింది. మౌర్య నవ్వుతున్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులని తన పెదవులతో బంధించి శృంగార సమరానికి సిద్ధమయ్యాడు. ఒక గంట తరువాత ప్రోక్త ఎదలో తల పెట్టుకొని సారీ ప్రోక్త నేను అలా అనకుండా ఉండాల్సింది. నేను సరదాగా అన్న దానిని నువ్వు సీరియస్గా తీసుకొని ఇంతలా బాధపడతావని అనుకోలేదురా.

“నాకు పాపని కనాలని ఉంది అని మీకు చెప్పాను అప్పుడు మీరేమన్నారు నువ్వు ఇచ్చిన కట్నం కి నీకు బాబుని ఇచ్చాను సరిపోలేదా? ఇంకా నీకు పాప కూడా కావాలా అని అన్నారు. అంటే నాతో సంసారం చెయ్యడానికి ఛార్జ్ తీసుకున్నారా. నేను పాప కావాలని పక్కింటోడిని అడగాల్సింది కదా తప్పు చేశాను హు.అసలు బాబు కూడా మీవల్ల పుట్టలేదు. నాకే పుట్టాడు. తను మీ కొడుకు కాదు” ఇన్నాళ్లు మనసులో దాచుకున్న బాధ దుఃఖం రూపం లో బయటకి వస్తుంది.

“తప్పే…. అలా మాటాడకూడదమ్మ. నా బంగారం కదా. సారీ చెప్పాను కదా ప్లీజ్ ప్రోక్త ఏడవకు….” “నాకు మీరు అన్న ఆ మాటకి చాలా బాధేసిందండి. పెళ్ళైనప్పటి నుంచి నేను ఏమి అడగకపోయినా నాకు కావలసినవి అన్నీ మీరే తెస్తున్నారు. ఇంటి బాధ్యత కూడా మీరే చూసుకుంటున్నారు. జాబ్ కి వెళ్తే అలసిపోతానని ఇంటిలోనే రెస్ట్ తీసుకోమన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ కంటే మీరే చాలా జాగర్తగా చూసుకున్నారు. నా మీద ఇంత ప్రేమ బాధ్యత చూపించే మీరు…. అలా ఆ మాట అనేసరికి చాలా బాధేసింది. మనసు తట్టుకోలేకపోయింది.”

సారీ రా అంటూ ఆమె పెదవులపై తన పెదవులతో ఘాడంగా ముద్దు పెట్టాడు. ఆమె కూడా అతని పెదవుల స్పర్శని ఆస్వాదిస్తుంది. ఐదు నిముషాలు ఈ లోకాన్నే మరిచిపోయారు. అతను ఆమె పెదవులని వదిలి, ఆమె కళ్ళను తుడిచి, నేను తీసుకున్న కట్నం డబ్బులు ఐదు లక్షలు, దానికి వడ్డీ కలిపి మీ నాన్నగారికి ఇచ్చేసాను. అది వినగానే ప్రోక్త అతనిపైన కూర్చుని ఆశ్చర్యంగా అదేంటి ఎందుకు అలా చేసారు. మరి నాకు నువ్వు కావాలి, నీ డబ్బు వద్దు. నాకు నా  పెళ్ళాం ప్రేమ మాత్రమే కావాలి అందుకే.

“అవునా నిజమా” అంటూ అతని బుగ్గ మీద కొరికి “థాంక్యూ థాంక్యూ సో…. మచ్ అని అందుకేనా మా అమ్మానాన్నా వచ్చారు. మరి వాళ్లు నాకెందుకు చెప్పలేదు”. “నేనే చెప్పొద్దన్నాను. నా అల్లరి పెళ్ళాం మళ్ళీ నాకు కావాలి కదా. వాళ్ళు చెప్తే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ మిస్ అయ్యేవాడిని. అందుకే చెప్పొద్దన్నాను”.”ఏమండి నేను ఏమి అనలేదు కదా మీరు కట్నం తీసుకున్నారు అని. అది మన సాంప్రదాయం. అమ్మాయిని కన్యాదానం చేసేప్పుడు వరునికి కొంచం డబ్బు ఇస్తారు సంతోషంగా. అంటే కూతురికి అల్లుడికి ఏమన్నా అనుకోని ఖర్చు వస్తే డబ్బుకి ఇబ్బంది పడకూడదు అని ఇస్తారు. అయినా మా నాన్నగారు ఇచ్చిన కట్నం డబ్బులు మామగారు మన ఇద్దరి పేరున బ్యాంకు లో  ఫిక్స్డ్ చేసారు కదా మీకు తెలుసు కదా”.

“ఏం పర్వాలేదు. నేను మళ్ళీ సంపాదిస్తాను. నాకు నువ్వు బాబు హ్యాపీగా ఉండడం కావాలి. ఇంక నెక్స్ట్ ఇయర్ కి మన పాప కూడా హ్యాపీగా ఉండాలి కదా. పాప కావాలని అడిగావుగా ఆ ప్రోసెస్ స్టార్ట్ చేద్దామా” అంటూ కొంటెగా నవ్వుతూ  ఆమెను చుట్టేసుకున్నాడు. ప్రోక్త కూడా ఆనందంగా భర్త కౌగిలిలో కరిగిపోయింది. ప్రోక్త మనసులో చాలా ఆనందంగా ఉంది. ఆమె కోరిక ఇన్నాళ్లకు తీరింది. కట్నం తీసుకోనివాడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కాని అప్పుడు కుదరలేదు. పర్వాలేదు ఇప్పుడైనా తిరిగి ఇచ్చేసారు అని మనసులో చాలా సంతోషించింది.

“మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే” అన్న ఆర్థిక శాస్త్రవేత్త సిద్ధాంతాన్ని కాదని తనకు తన భర్తకు మధ్య బంధాన్ని డబ్బుతో కాకుండా కేవలం ప్రేమ బంధంగా మలచుకొంది ప్రోక్త.

ఆర్క

You May Also Like

3 thoughts on “వ్యభిచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!