అరుగులు-అనుబంధాలు
రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి
“ఏమిటీ సత్తెమ్మా, ఇవాళ మహా హుషారుగా ఉన్నావే..సంగతేంటి”అంటూ కొంగుతో అరుగు మీద దులుపుతూ ఎదురింటి అరుగుపై కూర్చున్న సత్తెమ్మ ని అడిగింది సూరమ్మ.
“అవును మరి సంబరమే..మరి సూరమ్మా..చెప్తా..ఏదీ పొద్దున్నుండీ నువ్వు కనబడితేగా.అదే..పట్నంలో ఉంటారే మా పెద్ద కూతురు, అల్లుడు..అది నీళ్ళోసుకుందిట.వంట చేసుకుంటూ ఉంటే ఉదయం ఉత్తరం వొచ్చింది.”
“అబ్బా..మంచి వార్త చెప్పేవ్.. ఇంతేనా , నోరు తీపి చేసేదేమైనా ఉందా”
“సూరమ్మా..గత పదేళ్లుగా ఎదురుబొదురుగా ఉంటున్నాం..నీక్కాపోతే..ఎవరికి పెడతాను.రవ్వ లడ్డూలవీ చేస్తున్నాను.. పెనిమిటి పట్నం తీసుకెళ్తాడు..నీకివ్వకుండానా.. మిగతా కబుర్లు తర్వాతాడుకుందాం”అంటూ లోపలికి వెళ్ళింది సత్తెమ్మ.
****** సమాప్తం**********