ఇదేమి చోద్యమే

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
ఇదేమి చోద్యమే
రచన:: సిరి .యం
 

ఏమండి లేవండి బస్ వచ్చే టైం అయింది అంటూ  అరగంట నుంచి లేపుతున్నా లేవడం లేదు రాము …

“ఇదుగో ఇప్పుడు మీరు కనుక  బస్ స్టాండింగ్ కి వెళ్ళలేదో  మా బామ్మ వచ్చి “ఓసీ నీ ఇళ్ళు బంగారం కానూ” ఇదేమి చోద్యమే ఊరు నుండి వస్తున్నాను అని కబురు పెడితే ఒకళ్ళు రాలేదు అంటుంది తరువాత మీ ఇష్టం అని”  అలిగి లేచి వెళ్ళబోతున్నా సీత ను పట్టుకొని  అపి ….

“అలికితివా సతి అలక మానవా ” అంటూ  రాము పాట పాడుతుంటే …

” మీ పాట లు తరువాత ముందు మీరు వెళ్ళి బామ్మ ని తీసుకు రండి”….

” హ వెళ్తున్నాను లే ” అని వాష్ రూమ్ కి వెళ్ళి ఫ్రేష్ అయి వచ్చి ” కాఫీ ఇస్తావా ” సీతూ డార్లింగ్  అని అడగ్గానే …

చురుగ్గా చూసింది సీత…

” ఇప్పుడు  నేను ఏమి అన్నాను భయపడేలా అలా చూస్తున్నావు”…..

” బస్ వచ్చిందేమో  అని నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు కాఫీ కావాలా”….

” నాకు టైం తెలుసు లే సీతూ డార్లింగ్ కాఫీ ఇస్తే తాగేసి వెళ్తాను ” …

” కాఫీ, గీఫీ జాన్తా నై మీరు వెళ్ళి బామ్మ ని తీసుకు వస్తేనే. కాఫీ అయిన ఇంకా  ఏదైనా “….

” నేను కాఫీ ఒక్కటే అడిగింది ఇంకేమి అడగలేదు కదా నువ్వు ఇస్తాను అంటే నాకు ఏమి  అభ్యంతరం లేదు “అని కన్ను కొట్టేడు…

” ఏమిటండి మీ సరసాలు వెళ్ళమంటుంటే “….

”  అబ్బా వెళ్ళు వెళ్ళు అంటావు ఏమిటి సీతూ “….

” ఇదుగో మీరు ఇలా బామ్మ ముందు సీతూ అని పిలిచారే అనుకో “ఓసీ నీ ఇళ్ళు బంగారం కాను ” చక్కగా సీత అని పేరు పెడితే అదేం పిలుపే మీ ఆయన అలా పిలుస్తాడు” అని అడుగుతుంది….

”  అప్పుడు నువ్వు సీత అనేది పాత పేరు బామ్మ ఇది కొత్త పేరు అని చెప్పు ” ….

” అపుడు గాని బామ్మ కర్ర పట్టుకుని కొట్టదు “….

” ఛ ఛ  మీ బామ్మ అలా ఉండరు  అచ్చం గా బామ్మ మాట బంగారు బాట సినిమా లో బామ్మ లా ఉంటారు “…

“అందుకే గా మా బామ్మ కి భానుమతి అని పేరు పెట్టేరు “…

“అవును సీతూ మీ  బామ్మ ఒంటి నిండా ఎప్పుడు అలా నగలు వేసుకొనే ఉంటారా “….

” అవును అండి నన్ను వేసుకోమని ప్రాణం తీసేది నేను మోయలేనే బామ్మ  అని ఏడ్చి గొడవ చేస్తే ఒక చైన్ వేసి
ఓసీ నీ ఇళ్ళు బంగారం కాను ” …

ఎవరైనా నగలు వేయమని గొడవ చేస్తారు నువ్వు ఏమో వద్దు అని ఏడుస్తావు ఏమిటో ఈ చోద్యం అని ముక్కున వేలు వేసుకొనేది ” అని నవ్వుతూ చెప్పింది….

రాము కూడా నవ్వుతూ ” కొంపదీసి ఇప్పుడు ఇక్కడకు కూడా అలానే నగలు వేసుకొని వస్తున్నారా ?”…

” కొంపతీయకుండా నే  అలానే వస్తున్నారు” అని నవ్వుతూ చెప్పింది….

” ఏయ్ సీతూ  అసలే దొంగలు భయం ఎక్కువ గా ఉంది అలా ఎలా వేసుకొని వస్తున్నారు నువ్వు చెప్పాల్సింది”…..

” మా బామ్మ ఆ నగలు లేకుండా అసలు ఉండరు అండి అయినా చెప్పేను కూడా  నాకు ఏమి భయమే ఎవరు వస్తారో రమ్మను  నా దగ్గర కు అన్నది అండి”….

” అవునా సరే నేను వెళ్ళి తీసుకు వస్తాను ” అని చెప్పి బయటకు వచ్చేసరికి ….

ఇంటి ముందు కి అటో వచ్చి ఆగింది …

ఎవరా అని ఇద్దరు లోపలికి తొంగి చూసేసరికి  చేతి కర్ర తో ఇద్దరు నెత్తిన ఒక్కటి వేసి ఆటో లో నుంచి బామ్మ గారు కిందకు దిగేరు…

” నేను వస్తాను అని తెలిసి నా కోసం ఎవరు బస్ స్టాండింగ్ కి రాలేదిమి ఆర్రా”…..

సీత తల రుద్దుకుంటూ ” వస్తున్నారు బామ్మ ఈ లోపు నువ్వు వచ్చేశావు “….

” ఓసీ నీ ఇళ్ళు బంగారం కానూ ”  నీకు బస్ వచ్చే టైం తెలియదంటే “…

” తెలుసు బామ్మ” అని రాము వైపు సీరియస్ గా చూసింది….

” ఏమిటే  నా మనవడి  వైపు అలా చూస్తున్నావు “….

” నేను వెళ్ళమంటే లేట్ చేసింది ఆయనే కదా “….

ఆటో డ్రైవర్ దిగి “బామ్మ నేను వెళ్ళేదా అన్నాడు”…..

రాము, సీత డ్రైవర్ నీ చూసి ఆశ్చర్యపోయారు….

” ఏమైంది ఒళ్ళుంతా  దెబ్బలు ఏమిటి “అని అడిగాడు రాము….

ఆటో డ్రైవర్ మిడిగుడ్లు వేసుకొని అలానే చూస్తుంటే….

” నేను చెపుతాను మనవడా  నేను బస్ దిగి మీరు ఎవరైనా వచ్చారా అని నేను చూస్తూ ఉంటే  వీడు వచ్చాడు  ఆటో కావాలా బామ్మ అని అడిగేడు….

నా మనవడు  వస్తాడు రాకపోతే వస్తాను అన్నాను వీడు సరే అని వెళ్ళేడు .. మీరు చూస్తే  రాలేదు  మళ్ళీ వచ్చాడు సరే అని అడ్రస్ చెప్పి తెలుసా అన్నాను ….

తెలుసు బామ్మ గారు రండి అంటూ  ఆటో దగ్గర కు తీసుకువెళ్ళి ఆటో లో కూర్చోమని ఇప్పుడే వస్తాను అని వెళ్ళేడు …

నేను కూర్చోని చూస్తూ ఆటో అద్దం లో చూస్తే వీడు వేరే ఆటో డ్రైవర్ తో నన్ను చూపించి ఎదో చెప్పడం గమనించాను సీత ఇక్కడ దొంగలు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పింది గుర్తుకు వచ్చి వీడిని గమనించాను…

వీడు మంచి హుషారు గా వచ్చి వెళ్దాం బామ్మ అన్నాడు … నేను  నవ్వుకొని సరే పద అన్నాను… బామ్మ నీ ఒంటి మీద ఉన్నవి  అన్నీ బంగారపు నగలేనా అని అడిగేడు…

“ఓరీ నీ ఇళ్ళు బంగారం కానూ ” పిచ్చివి పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు ఇవి మేలిమి బంగారం తో చేసినవి అన్నాను …వీడు ఆటో స్పీడ్ గా పోనిస్తూ రోడ్డు మీద పోనివ్వకుండా ఆటో సైడ్ కి తిప్పేడు …

ఏంది అబ్బి ఇటూ వెళ్తున్నావు  అని అడిగేను …

బామ్మ ఇటూ సైడ్ వెళ్తే తొందరగా వెళ్ళోచ్చు అన్నాడు….

మీ పని ముగించుకొని త్వరగా వెళ్ళడానికా …

భలే కనిపెట్టేశావు బామ్మా అని ఎవరి లేని నిర్మానుష్యంగా ఉన్నా ప్రదేశంలో ఆపేడు..

ఇంకా చీకట్లు తొలగిపోలేదు కదా ఎవరు లేరు నేను ఆటో లో నుంచి దిగి చూట్టూ చూస్తుంటే  ఇంకొక ఆటో వచ్చి ఆగింది … ఇద్దరు నా దగ్గర కు వచ్చి ఒక కత్తి చూపించి నగలు ఇవ్వమన్నారు ….

సార్ అక్కడ నుంచి నేను చెపుతాను ఈ బామ్మ విషయం తెలియక హనుమంతుడు ముందు కుప్పిగంతులు ఆన్నట్లు ఈవిడ ముందు కుప్పిగంతులు వేయబోయి  ఇలా అయ్యాను అని ఏడుపు మొహం తో బామ్మ కొట్టిన దెబ్బ లు చూపించి..

అమ్మో ఈ బామ్మా భానుమతి గారికి ఏమి తీసిపోలేదు మా ఇద్దరిని ఒక ఆట ఆడుకుంది ఈ బామ్మ దెబ్బలకి నా దొస్త్ పారిపొయిండు నేను కూడా పారిపోబోతుంటే ఎక్కడికి రా అని కర్ర తో పట్టుకొని లాగి నేను చెప్పినా అడ్రస్ దగ్గర నన్ను దింపు లేదా పోలీసు వాళ్ళకి పట్టిస్తాను అన్నారు…

భయంతో కాళ్ళా వెళ్ళా పడి పిల్లల కలవాడిని  నన్ను క్షమించు బామ్మా బుద్ది గడ్డి తిని ఇలా చేయాబోయాను అని కాళ్ళ మీద పడితే క్షమించి భార్య పిల్లలు పెట్టుకొని ఇదేమి పని అబ్బి నువ్వు జైలు కి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటో ఆలోచించావా ఇకనైనా మోసం చేయకుండా బతకడం నేర్చుకో అని నాకు బుద్ధి చెప్పేరు సార్ . అని ఆటో డ్రైవర్ చెప్పి ముగించాడు…

బామ్మ  ఆటో డ్రైవర్ కి రెండు వేల  రూపాయలు ఇచ్చి నీ భార్య పిల్లలకు ఏమైనా తీసుకు వెళ్ళు అని చెప్పి పంపించింది ఆటో డ్రైవర్ వెళ్తూ నేను ఇక మీదట ఏ మోసం చేయను బామ్మ నిజాయితీ గా ఉంటాను అని దండం పెట్టి వెళ్ళేడు….

“ఓసీ నీ ఇళ్ళు బంగారం కానూ”…ఏమిటే సినిమా చూసినట్లు గుడ్లు వెల్లబెట్టి అలా చూస్తున్నావు పెట్టే  తీసుకొని లోపలికి పద” అన్నారు …

” నువ్వు ఒక  సినిమానే చూపించావు కదా బామ్మ ” అని లోపలికి వెళ్ళేరు… లోపలికి వెళ్ళి బామ్మ సూట్కేస్ లోపల పెట్టి వచ్చి కూర్చోని సీత ఊళ్ళో కబుర్లు అడుగుతూ ఉంది…

” సీతూ కబుర్లు తరువాత  బామ్మ కి కాఫీ తీసుకొని రా”…..

“అదేమిటి మనవడా చక్కగా సీత అని పిలవక సీతూ ఏమిటి సీతూ “….

” బామ్మా నీ మనవరాలు కి సీతూ అని పిలవడం  అంటే నే ఇష్టం అని”  సీత  మీద చెప్పేడు …

”  ఓసీ నీ ఇళ్ళు బంగారం కానూ” ఇదేమి చోద్యమే సీత అని చక్కని పేరు ఉంటేను ” అని సీత నెత్తిన ఒక్కటి మొట్టింది .. అబ్బా అంటూ రుద్దుకుంటూ రాము వైపు సీరియస్ గా చూసింది సీత……

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!