అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
ఊసుల ఝరి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
అమ్మా నాన్నల
ముద్దూ మురిపాల
తలపుల వీణ
నిరంతరం గుండెను
అద్దిన తెరలు
నిశబ్ధంగా ఊగుతూనే ఉన్నాయి
చిన్నతనపు చిలిపి చేష్టలు
నేస్తాల సరదాల ముచ్చట్లు
మస్తిష్కంలో నిక్షిప్తమైన
జ్ఞాపకాలు
వెన్నెల తోరణంలో
వలపు వీణలు
మీటిన తీపిగురుతులు
మధురానుభూతులు
అలకలు, అల్లర్లు
మూతి ముడుపులు
బతిమాలుతూ వెంటపడే
ప్రియ బంధాలు
నిశ్శబ్ద నిశీధిలో
కనుమరుగైన జ్ఞాపకాలు
కాటేసిన కాలపు ఝరిలో
జ్ఞాపకాలు నిశబ్ధమై
మూలుగుతున్నాయి
కదిలే కాలంలో కరిగిపోక
రెక్కలు వచ్చి
ఎగిరే తరికై
జ్ఞాపకాలు నిశబ్ధమై
మూగబోయాయి
Very nice
మంచి వర్ణన జ్ఞాపకాల కు