ఇల్లాలి చదువు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ప్రసాదరావు రామాయణం
గోరంత దీపం
కొండంత వెలుగు
ఇల్లాలి విద్య
ఇల్లంతా వెలుగు
ఒంటి చేయితో
ఇంటి సమర్ధింపు
ఎట్టి కష్టమో ఈనాడు!
ముంత దాచి
చల్ల త్రాగానని బొంకనేల?
అతివ సంపాదన
కుడిభుజానికి ఎడమ తోడు
వేడినీటికి చన్నీరు తోడు
ఆనంద నిలయమే ఆ కుటుంబం
ఇల్లాలి విద్య ఇల్లంతా వెలుగు
గృహ సామ్రాజ్యానికి రాణి
ఆఇంటి అలివేణి
కార్మిక శాఖ ఆమెదే
వాణిజ్యం ఆమెదే
ఆర్థికం ఆమెదే
నెల బడ్జెట్టును
నెలత ప్రణాళిక చేసి
కూడికలేవో తీసివేతలేవో
గుణించి గుర్తించి
లేశమైనా శేషాన్ని మిగిలించే
సామర్ధ్యం సతీదేవికే కలదు
కనుకనే…
ఇల్లాలి చదువు
ఇల్లంతా వెలుగు
తొలి గురువు అమ్మే
మలి గురువు అమ్మే
బుడుత బడి చేరినా
ఇంటిలో అమ్మే గురువైతే ఇక లోటేమిటి?
బోధించే ఓర్పు
బోధించే నేర్పు
శిక్షానంతర ఓదార్పు
ఆమెకు చేతనైనంత
ఏ టీచరు చేయగలదు?
అందుకే….
ఇల్లాలు విద్య
ఇల్లంతా వెలుగు
బాగుందండి. ఇల్లాలి గురించి ఆమె విద్య గురించి ఏక కాలంలో బాగా చెప్పారు