హనుమాన్ గోసాయి
రచన::పిల్లి.హజరత్తయ్య
విజయానికి ప్రతీకయై
భక్తుల పాలిట కొంగు బంగారమై
నిస్వార్ధ భక్తికి చిహ్నమై
జ్ఞానగుణ సాగరడివై
చరిత్రలో చిరంజీవుడై నిలిచిన
రామాయణ మహా మాలరత్నమా..!
దేహమంత సింధూరం ధరించి
దేహంలో శ్రీరాముడిని ప్రతిష్టించి
లక్ష్మణుని ప్రాణమును రక్షించి
సీతాదేవి దుఃఖమును హరించిన
జానకీ శోక నాశికుడా!
నీ జన్మ చరితార్థము..
రామబాణమును ఎదిరించి
రామభక్తిని ప్రదర్శించి
శక్తి కంటే భక్తి గొప్పదని
చాటిన అంజనీ పుత్రుడా!
రావణాసురుని గర్వమణిచిన
నీ ధీరత్వం అజరామరము..
మృత్యువుకే మరణము
నీ నామస్మరణము
భయానికి ప్రతిరూపము
ఆంజనేయుని రూపము
ధైర్యానికి సింహస్వప్నము
హనుమాన్ గోసాయి
నామధేయము.