రచన – తపస్వి
బాధకి మందు ప్రేమ… మరి ప్రేమకి చివరి అంచు మోహమా…?
ప్రేమ… ఎవరెన్ని అర్ధాలు అయినా వెతకని…
ఆశ, కోరిక, వ్యామోహం, మోహం… లేని ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణత పొందదు.
“నాకు ప్రేమ కావాలి” అన్న ఆశ మనసులో లేకపోతే ప్రేమ ఉన్నా గుర్తించలేము.
నీ చెలి నీకు కావాలన్న కోరిక లేకపోతే ప్రేమని నిలబెట్టుకోవాలన్న పోరాటమే చేయవు.
నువ్వు నీ చెలి సొగసుపై వ్యామోహం పెంచుకోనిదే ఆ చెలి నీకు ప్రేమ దేవతలా కనపడదు.
నీ చెలిపై నీకు మోహం లేకపోతే ప్రతి రోజు కొత్తగా ప్రేమించాలి అన్న ఆలోచన కూడా రాదు.
నిముషాలు గడిచేది కూడా తెలియని మైకంలో ఇద్దరు అధరాల యుద్ధంలో మునిగిపోయి ఉన్నారు. వారి మైకం భరించలేను అన్నట్టు కార్తిక్ జేబులో ఉన్న ఫోన్ రింగ్ అయింది. విడిపడటం ఇష్టం లేకుండానే ఇద్దరి పెదవులు వీడాయి.
వల్విత కార్తిక్ పైన ఉండగానే, జేబులో ఉన్న ఫోన్ తీసి చూసి… లిఫ్ట్ చేసి, “చెప్పు అమ్మ” అన్నాడు.
కార్తిక్ నోటి నుండి అమ్మ అన్న మాట వినగానే వల్విత కార్తిక్ పై నుండి లేచి పక్కన కూర్చుంది. కార్తిక్ పైకి లేచి కూర్చున్నాడు.
కార్తిక్:: హా… వచ్చిందమ్మా…
కార్తిక్ అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు.
వల్విత:: నేను వస్తున్నట్టు చెప్పావా? ఆశ్చర్యంగా కార్తిక్ వైపు చూస్తూ అంది గుసగుసగా… అవును అన్నట్టు తల ఊపి.
కార్తిక్:: లేదమ్మా ఇంకా కలవలేదు… తన ఫ్రెండ్ ఇంట్లో ఉందట… సాయంత్రం కలుస్తా.
కార్తిక్ మాట అర్థం అయ్యి, “రాక్షసుడు…” అంటూ కార్తిక్ ని గట్టిగా గిల్లింది నవ్వుతూ.
“హా…” గట్టిగా అన్నాడు అప్రయత్నంగా. ఏమైందని అటు పక్కన అమ్మ అడగటంతో…
కార్తిక్:: ఏం లేదమ్మా… చీమ కుట్టింది అన్నాడు, వల్లి వైపు చూసి నవ్వుతూ.
అమ్మ:: ఒక్క మాట అడగనా…
కార్తిక్:: పెళ్లి అన్న మాట తప్ప ఇంకేమైనా మాట్లాడు.
గత పది సంవత్సరాల నుండి వద్దు, చేసుకోను అంటున్న, ఫోన్ చేసిన ప్రతిసారి పెళ్లి చేసుకో అంటూ అమ్మ వేసే ప్రశ్న గురించి తెలుసు కాబట్టి.
అమ్మ:: పెళ్లి కాదులే… ఎలాగూ వల్లికి నువ్వు అంటే ఇష్టం కదా…
కార్తిక్:: సరే, ఉంటా అమ్మ… పనుంది, అంటూ అమ్మ మాట్లాడుతున్నా, వినకుండా ఫోన్ పెట్టేశాడు…
ఆ తరువాత ఇంకేం మాట్లాడుతుంది అని అర్థం అయ్యి.
వల్లి:: అలా పెట్టేస్తావే? అమ్మ మాట్లాడుతుంటే…
కార్తిక్:: హా హా….. నవ్వి జేబులో పెట్టుకున్నాడు ఫోన్.
వల్లి:: ఎందుకు నవ్వుతావు… చెప్పవచ్చుగా.
కార్తిక్:: ఇంకా మాట్లాడితే పెళ్లి గోల మొదలు పెడుతుంది… అందుకే…
వల్లి:: గోలా? పెళ్లి నీకు గోలలా ఉందా?
కార్తిక్:: అలా అని కాదు.
వల్లి:: మరి… అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
కార్తిక్:: హ్మ్ , అన్ని తెలిసి అడుగుతావే?
వల్లి:: తెలుసు కాబట్టి అడుగుతున్నాను.
కార్తిక్:: నా గురించి తెలిసి ఎలా చేసుకుంటారు ఎవరు అయినా…?
వల్లి:: అలా ఎందుకు అనుకుంటావూ…?
కార్తిక్:: పోని నువ్వు చేసుకుంటావా? వల్లి కళ్ళలోకి చూస్తూ అడిగాడు కార్తిక్.
వెంటనే సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండిపోయింది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి.
వల్లి:: సమాధానం నీకు తెలీదా? తెలీకుండానే అడిగావా ప్రశ్న?
పెదవులు తడబడుతుండగా అడిగింది. ఆమె కనులలో కన్నీటి పొర గమనించాడు.
కార్తిక్:: సారీ… తన చేతిని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
వల్లి:: అసలెప్పుడూ పెళ్లి చేసుకోవాలన్న ఆశ కలగలేదా?
కార్తిక్:: హా హా… పెళ్లి అన్న ఆశ లేకపోతే ఎందుకు అంతలా ప్రేమిస్తా?
వల్లి:: హ్మ్… తను కాదు అన్న తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి అన్న ఆశ కలగలేదా?
కార్తిక్:: ఏమో తనతో ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుకున్న కానీ, తను నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక ఆ ఆలోచనలు మళ్లీ రాలేదు.
వల్లి:: ఇపుడు కూడానా?
అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఆ ప్రశ్న అలా ఎందుకు అడిగింది అర్థం అయింది.
కార్తిక్:: సమాధానం కావాలా?
వల్లి:: అవును…
కార్తిక్:: ఇస్తా… కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఒక సమాధానం ఇవ్వాలి.
వల్లి:: నేనా? దేనికి?
కార్తిక్:: ఇంతకు ముందు అడిగితే కలిసినపుడు చెబుతా అన్నావు.
వల్లి:: నేనా…? కలిసినప్పుడు చెబుతా అన్నానా? ఏంటబ్బా అది ?
కార్తిక్ దేని గురించి అడుగుతున్నాడు అని తెలిసి కూడా, గుర్తు లేదు అన్నట్టు మొహం పెట్టి అంది.
కార్తిక్:: సరే అయితే గుర్తు లేకపోతే చెప్పవద్దు, నాకు కూడా గుర్తు లేదు, నేను కూడా చెప్పను, ఇంతవరకు నా మదిలో దాచుకున్న విషయం నీకన్నా చెప్పాలి అనుకున్న…
వల్లి:: రాక్షసుడు… మొండివాడు… రౌడీ…
కార్తిక్:: హా హా హా… అన్ని నా పేర్లే…
వల్లి:: చెబుతావా , చెప్పవా? తెలుసుకోవాలి అన్న కుతూహలంతో అడిగింది.
కార్తిక్:: చెప్పాలి అని నాకు ఉంది… కానీ నువ్వు నాకు చెబుతా అన్నది చెబితే అపుడు నేను చెబుతా.
వల్లి:: ప్లీజ్ వదిలేయ్… ఇపుడు అది ఎందుకు?
సిగ్గు గమనించాడు ఆమె కళ్ళలో. కార్తిక్ వల్లి ముందుకు వెళ్లి, ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని
కార్తిక్:: “ప్లీజ్… చెప్పచ్చు కదా… వినాలని ఉంది”.
వల్లి:: వద్దురా… అర్థం చేసుకో… అంది కళ్ళు మూసుకుంటూ.
కార్తిక్:: ప్లీజ్… అన్నాడు తన ముఖాన్ని కాస్త దగ్గరకి తీసుకుంటూ.
వల్లి:: ఇలా అడగకు…
కార్తిక్:: మరి ఇంకెలా… అంటూ ముందుకు వంగి ఆమె పెదవులను అందుకోబోతే… చేతులు అడ్డు పెట్టి,
వల్లి:: ఇదిగో ఇలా అల్లరి చేస్తే అసలు చెప్పను అంది చిరుకోపంగా.
కార్తిక్:: నువ్వు చెప్పనూ అంటే ఇంకా అల్లరి చేస్తా…
వల్లి:: అసలు మాట వినవా?
కార్తిక్:: ఊహు… వినను… చెప్తావా? లేదా?
వల్లి:: సరే చెప్తాను… కానీ ఎప్పుడో వచ్చిన కల కదా అంతగా గుర్తులేదు, గుర్తు ఉన్నంత వరకు నాకు కుదిరిన విధంగా చెబుతా, నీకులా అందంగా చెప్పటం రాదు.
కార్తిక్:: హా సరే…, అయినా ఎప్పుడో ఏంటి…? మొన్నే కదా వచ్చింది అన్నావు…?
వల్లి:: మొన్నే కాదు… మొన్నే నీకు చెప్పాను అంది చిన్నగా నవ్వుతూ.
కార్తిక్:: అబ్బో అంటే ఎప్పటి నుండి వస్తుంది?
వల్లి:: ఎప్పుడు అయితే ఏంటిలే…
కార్తిక్:: ఆహా… సరే చెప్పు.
వల్లి:: చెప్తా… కానీ ఇలా కాదు…
కార్తిక్:: మరి?
వల్లి:: నువ్వు నా ఒడిలో పడుకో… కళ్ళు మూసుకో… నన్ను చూడకూడదు, నేను చెప్పేది వినాలి అంతే.
కార్తిక్:: సరే…
అంటూ కార్తిక్ వల్లి ఒడిలో సర్దుకుని పడుకున్నాడు. వల్లి కార్తిక్ ఒక చెయ్యి పట్టుకుంది, ఇంకో చెయ్యి అతని తల మీద జుట్టులో ఉంది. కార్తిక్ కళ్ళు మూసుకున్నాడు. వల్లి అలాగే ముందుకు వంగి అతని గుండెలపై తల పెట్టి చెప్పటం ఆరంభించింది.
“ఇది తప్పా… ఒప్పా… అని నాకు తెలీదు, కానీ మన పరిచయం అయ్యి ఇష్టం పెరిగి… ఆ ఇష్టం ప్రేమగా మారిన తరువాత ప్రతిరోజు నేను నీతో మాట్లాడి పడుకున్న తరువాత, ప్రతిరోజు నాకు వస్తున్న కల ఇది… ఒకే ఒక్క కల… మళ్లీ మళ్లీ వస్తున్న కల… ఒక్కోసారి ఆ కల రాలేదు అంటే, అది వచ్చే వరకు మెలకువగా వుండి, తిరిగి పడుకునే దానిని. ఇది కల అని చెప్పనా… లేక నా మనసులో కోరిక అని చెప్పనా…
పచ్చటి పొలాల మధ్య చల్లని వెన్నెలలో మంచె మీద తెల్లటి చీరలో, తలనిండా విరిసిన సన్నజాజులు, తురిమి చేతినిండా గాజులు, కళ్ళకు అందంగా కాటుక పెట్టి, తాంబూలం చుట్టిన చిలకలు చేతి వేళ్ళకి చుట్టి, నీ పక్కనే పడుకొని నీ ఎద పై నేను తల పెట్టుకొని ప్రపంచం గుర్తుకు రానంతగా మాటలు చెబుతూ నువు నన్ను చూస్తూ నా నుదిటి పై పెట్టిన ముద్దు నీకు పాపిటబిళ్ళ అవసరం లేదు అని చెబుతూ ఉంటే కళ్ళ పైన పెట్టిన ముద్దు వీటిని కాపాడటానికి నేనున్నాను కాటుక అవసరమా అంటుంటే చెక్కిలి పై పెట్టిన ముద్దుకి గులాబీలు చిన్నబోతే పెదవిపై పెట్టిన ముద్దుకి మధువు రుచి కూడా సరిపోను అంటుంటే మెడ పైన పెట్టిన ముద్దుకి మైకం కమ్మింది.
నీ పెదవులు చేసే మాయ ముందు లక్షలు ఖరీదు చేసే నగలు చిన్నబోయాయి. శరీరంపై పడే ప్రతి పంటిగాటు మెదడుని ఉత్తేజపరుస్తూ మనసుకి కొత్త ఆనందాలను పరిచయం చేస్తూ శరీరానికి కొత్త సుఖాలు రుచి చూపిస్తూ నువ్వు జరిపే ప్రతి దాడిలో శరీరంపై తీయటి గాయం అవుతుంటే పగిలిన గాజులు, చెదిరిన కాటుక, నలిగిన పెదవి నాలోని అణువణువునీ పులకరింపజేస్తుంటే చేతికి చుట్టిన తాంబూలం నీ పెదవులకు అందిస్తే నువ్వు వద్దు అని కళ్ళతో మారాం చేస్తే, ఎందుకు అని నేను కళ్ళతోనే ప్రశ్నిస్తే, నీ పెదవులతో అందివ్వమని నువ్వు గారం చేస్తే, సిగ్గుతో ఎర్రబడిన చెంపలతో బిడియంతో నా పెదవుల మధ్య పెట్టిన తాంబూలం నీ పెదవులకు బెరుకుగా అందిస్తుంటే, తాంబూలంతో పాటు నా పెదవులు కూడా అందుకొని నీ మాయలో పడేసావే. అక్కడ నలిగేది తాంబూలమా లేక నా పెదవులా! జుర్రుకునేది తాంబూల రసాన్నా లేక నా నాలుకలోని మధువులనా !
అరె ఎంతసేపైనా నీ దాహం తీరదు నాకేమో ఊపిరి ఆడటంలేదు. బలవంతంగా నేను విడిపించుకుంటే కొన్ని క్షణాలు ఆగి మళ్లీ చుట్టేస్తావు. ఇద్దరి ఊపిరి ఒకే శ్వాసగా మారి నీ ప్రాణం నాకు నా ప్రాణం నీకు మార్చి మార్చి అందిస్తుంటే ఆ ప్రేమని అనుభవించడమే కానీ చెప్పతరమా !
నా పెదవులు దాటి కంఠం పై పెట్టిన ముద్దుకి ఎటువంటి రత్నహారాలు సాటిరావని చెబుతుంటే, ఇద్దరిలో రేగిన తమకాన్ని పొలాల పై నుండి వచ్చే చల్లటి గాలి కూడా చల్లార్చలేకపోతుంటే నా ఎద పై ఉన్న పైటని నువ్వు తొలగిస్తుంటే సిగ్గుతో, బిడియంతో, నేను చేతులు అడ్డం పెడితే నా చేతులపై నువ్వు పెట్టిన ముద్దుకి చేతులు వాటంతట అవే విడిపోతుంటే ఎదపై నువ్వు చేసే మాయ వర్ణించతరమా !
ఎదపై నువ్వు పెట్టే పంటిగాట్లు ఎన్నని లెక్క పెట్టను? ఎక్కడెక్కడ అని లెక్కపెట్టను? నువ్వు పెట్టే ప్రతి ముద్దు ఒక్కొక్క పుణ్యనదిలో స్నానమాచరించినట్టుగా నా మనసుని శరీరాన్ని పవిత్రం చేస్తుంటే, ఆ మైకంలో నేను సర్వం మరిచి నీ ప్రేమకు లొంగిపోతుంటే, శిఖరాలు దాటి నువ్వు కిందికి చేరే కొద్ది చిగురుటాకులా కంపించిన నా శరీరాన్ని నీ బలమైన చేతులతో గట్టిగా బిగించి పట్టుకొని అదిమిపెట్టి నడుముని గట్టిగా పట్టుకుని నువ్వు పెట్టిన ముద్దు ముందు వడ్డాణం నీకెందుకు అని ప్రశ్నిస్తుంటే నీ చేతిలో ఇమిడిపోయిన నడుముకి ఊపిరాడక శ్వాస భారంగా తీసుకుంటుంటే ముద్ద మందారంలా ఉన్న నాభిని నీ పెదవులతో చుట్టేసి ఊపిరాడకుండా చేస్తే ఎలా ?
నీ దాహం తీరక నువ్వు ఇంకా కిందికి దిగితే నేను ఊపిరాడక అల్లాడిపోయినా తెలుసా ! ఈ సమరంలో మన మధ్య వస్త్ర సన్యాసం ఎప్పుడు జరిగిందో గుర్తే లేదు. నా చీర ఇద్దరికీ దుప్పటిగా మారగా నీ చేతి వేళ్ళ మధ్య బంధించబడిన నా చేతి వేళ్ళు, నువ్వు కలిగించే వత్తిడికి అంతే బలంగా నిన్ను చుట్టుకుంటుంటే ఇద్దరి ఒంటిపై కొత్తగా వచ్చి చేరుతున్న మధురమైన గుర్తులు ఇద్దరిని ఇంకా ప్రేరేపిస్తుంటే అలుపన్నది రాదే నీకు.
చెదిరిన కాటుక, కమిలిన పెదవులు, నలిగిన మల్లెలు, పగిలిన గాజులు నువ్వు నా వాడివి అయ్యావు నేను నీలో ఐక్యం అయ్యాను అని నేను నేనుగా కాక నువ్వుగా మిగిలానని సాక్ష్యం చెబుతూ ఉంటే నువ్వు నా వాడివి అని అలసిన శరీరంతో నిండిన మనసుతో.. నీ ఎదపై సేద తీరుతూ నా చుట్టూ నువ్వు వేసిన చేతులు బలంగా నన్ను చుట్టుకుని ప్రపంచంలోని ఏ బాధ కలత నా దరిచేరనివ్వనంటూ భరోసాను ఇస్తుంటే ఆ నమ్మకంతో కంటినిండా ఎప్పుడు నిద్ర పోయింది గుర్తే లేదు.
ఇదే నా కల… ప్రతిరోజు, ప్రతిసారి ఇదే కల… అక్కడ కలలో నిద్రపోతాను., ఇక్కడ ఆ కల నుండి నిద్ర లేస్తాను.
కార్తిక్, వల్లిల గుండె చప్పుడు… ఒకరికి ఒకరివి వినపడుతున్నాయి. చెప్పలేని మధుర భావంతో ఇద్దరు గట్టిగా పట్టుకుని అలాగే పడుకుని ఉన్నారు.
“మనల్ని ప్రేమించే మనసు గుండె చప్పుడు చేసే శబ్దాన్ని మించిన సంగీతం ఏమీ ఉండదు అనుకుంటా కదా…” కార్తిక్ షర్ట్ పక్కకి జరిపి అతని గుండెలపై తన పెదవులతో ముద్దు పెడుతూ అడిగింది.
“హ్మ్…”, తగిలిన తడి పెదవుల మైకంలో వచ్చిన మాటనా లేక తను చెప్పిన దానికి అవును అనా అని అర్థం కాలేదు వల్లికి, నవ్వుకుంటూ ఈసారి తన పంటిగాటు అతని హృదయం పై సుతిమెత్తగా వేసింది.
“హ్మ్…” మళ్లీ అలాగే అనేసరికి, ఇంతకు ముందు అన్నది కూడా మైకంలో అన్నదే అని అర్థం చేసుకుని, ముసిముసిగా నవ్వుకుని పైకి లేచింది.
“ఇలా మధ్యలో వదిలేయకూడదే…” అన్నాడు కళ్ళు తెరిచి వల్లి పెదవులని చేత్తో గట్టిగా పట్టుకుని.
“నాకు ఆకలి వేస్తుంది…” అంది అతని చేతిని విడిపించుకుని.
“మరి మధ్యలో వదిలేసావే…” కొంటెగా నవ్వుతూ అన్నాడు.
కార్తిక్ ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం అయ్యి…
“ఇడియట్…” అంటూ, సరదాగా కొట్టి
“నిజంగానే ఆకలి వేస్తుంది…” అంది.
“సరే పద” అంటూ కార్తిక్ పైకి లేచాడు, చెయ్యి అందిస్తూ.
కార్తిక్ చెయ్యి పట్టుకుని పైకి లేచి అతని వెనుక నడుస్తూ, బండరాయి దిగుతూ కాలు స్లిప్ అయ్యి, జారి పక్కన కాస్త నీటితో నిండి ఉన్న ఒక బురద గుంటలో పడబోయింది. కార్తిక్ వల్లి చేతిని గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నాడు. వల్లి వెనకకు వాలి కార్తిక్ చేతిని రెండు చేతులతో పట్టుకుని ఉంది.
“ప్లీజ్ వదలకు అంది…” వదిలితే అలాగే వెనక్కి ఆ బురదలో పడుతుంది అని అర్థం అయ్యి.
“ఆహా…” అన్నాడు నవ్వుతూ.
కళ్ళు పెద్దవి చేసి కార్తిక్ ముఖంలోకి చూసిన వల్లికి, ఎపుడో కార్తిక్ ఒక అమ్మాయి, అబ్బాయి బురదలో కూడా రొమాన్స్ చేయవచ్చు అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి…
“రేయ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావంటే చంపేస్తా…” అంది చిరుకోపంగా.
“నిజంగానా?? ఏది మళ్లీ చెప్పు…” అన్నాడు చెయ్యి వదులుతున్నట్టు బెదిరిస్తూ.
“ప్లీజ్ ప్లీజ్… నా మాట విను… నాకు బురద అంటే ఎలర్జీ… తరువాత నీకే ఇబ్బంది ఆలోచించుకో…” అంది భయం… బెదిరింపు కలగలిపి.
“హ్మ్… లాజిక్ కరెక్ట్ గానే ఉంది, కానీ ఒక్క కండిషన్…”
“ఏంటి…” అంది కోపంగా.
“నా గుండెపై నీ పంటి గాటు కావాలి… ఎలా అంటే జీవితాంతం అది మన ప్రేమకి గుర్తుగా ఉండిపోవాలి…” కార్తిక్ అడిగిన కోరికకి కోపం వచ్చినా, కార్తిక్ మొండితనం తెలిసి ఉండటంతో సరే అంది. కార్తిక్, వల్లి చెయ్యి పట్టుకుని లాగాడు గట్టిగా, ఆ ఫోర్స్ కి వల్లి నేరుగా వచ్చి కార్తిక్ కి గుద్దుకుంది.
“ఛాన్స్ దొరికితే చాలు దేన్నైనా నీకు అనువుగా మార్చేసుకుంటావే…” అంది కార్తిక్ నీ గుండెలపై కొడుతూ చేతులతో.
“హ్మ్… వచ్చిన ఛాన్స్ ఉపయోగించుకొకపోతే, తరువాత మనకి మనమే ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలి. అందుకే ఈ తిప్పలు…” అన్నాడు వల్లిని చేతులతో చుట్టి దగ్గరకి లాక్కుంటూ.
“నీతో మాటల్లో గెలవడం కష్టం…” అంది కార్తిక్ కనులలో కి సూటిగా చూస్తూ.
“ప్రేమతో ఎందులో అయినా నన్ను గెలవచ్చు…” అన్నాడు మరింత గట్టిగా హత్తుకుంటూ.
“మాటలతోనే కడుపు నింపేస్తావా!!” అంది రెండు చేతులతో కార్తిక్ ని అల్లుకుపోతూ.
కార్తిక్ సమాధానం ఇవ్వలేదు, అలా అని వల్లి కూడా వదలలేదు.
‘శరీరాల అల్లిక అనుకుంటే సుఖం మాత్రం కనపడే కౌగిలిలో… నా అన్న భావంతో, కౌగిలిలో అదే శరీరాలు అల్లుకుపోతే, మాటలకి కూడా అందని కొన్ని వేల భావాలకి ఓ తియ్యటి భాష అది…’
***
“ఫుడ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావా…” అంది, కార్తిక్ వంట చేయటానికి అక్కడే ఏర్పాట్లు చేస్తూ ఉంటే.
“ఇక్కడ అడవిలో దుంపలు, ఆకులు తిందామని అనుకున్నావా లేక, ఆర్డర్ పెడితే వస్తాయి అనుకున్నావా?” అన్నాడు వంటకి కావాల్సినవి అన్ని ఒక్కో ప్యాకెట్ తీసి పక్కన సర్దుతూ.
“అంటే వెళ్లి తిని రావాలేమో అనుకున్న” అంది ఒక రాయి మీద కూర్చుని కార్తిక్ నే చూస్తూ.
“హ్మ్… మరి ఇంత పెద్ద బ్యాగ్స్ ఎందుకు తీసుకువచ్చాను అనుకున్నావు…” అంటూ స్టౌ వెలిగించాడు.
“హ్మ్… నీ అంత తెలివి తేటలు నాకు లేవులే…”
“ఆహా… రెండు నిమిషాల్లో దోశ రెడీ అవుతుంది” అంటూ అక్కడ నుండి లేచి, ఒక ఐస్ ప్యాక్ లో ఉన్న చాక్లెట్స్ తీసుకుని వల్లి దగ్గరకి వెళ్లి, “ఈ లోపు ఇవి తిను…” అన్నాడు చేతికి ఇస్తూ.
“అన్ని బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చావు” అంది చాక్లెట్స్ అందుకుంటూ.
“హ్మ్… మరి దేవిగారికి ఏమి తక్కువ కాకుండా చూసుకోవాలి కదా…” అంటూ వెనక్కి తిరిగి వెళ్లబోతుంటే, వల్లి కార్తిక్ నీ చెయ్యి పట్టుకుని ఆపింది. ‘ఏంటి!’ అన్నట్టు కళ్ళతోనే అడిగాడు నవ్వుతూ.
“పెళ్లి గురించి ఏదో చెబుతా అన్నావు…”
“మర్చిపోయావేమో అనుకున్న…” అన్నాడు నవ్వుతూ.
“చెప్తావా… చెప్పవా…” అంది చిరు కోపంగా.
“హ్మ్… చెప్పినా ఏం లాభం… జరగని దాని గురించి ఆలోచించి బాధపడటం కంటే, ఆలోచన వదిలేసి ఉండటం మంచిది…” అన్నాడు.
“నా జీవితంలో ఇలాంటి రోజు ఉంటుంది అని నేను అనుకోలేదు కానీ, నువ్వు నా కోసం నా కలను నిజం చేశావు కదా…” అన్నది కార్తిక్ నే చూస్తూ.
“ఇది చేయటానికి అవకాశం ఉన్నది, కానీ అది…”
“నిజం పెళ్లి కాకపోయినా బొమ్మల పెళ్ళిలాగా చేసుకోవచ్చు అనుకుంటా కదా…” అంది… ఒక చాక్లెట్ ఓపెన్ చేస్తూ…
“బొమ్మల పెళ్లా…?? ఇపుడు మనం ఇద్దరం బొమ్మల పెళ్లి చేసి…” అన్నాడు వల్లి చాక్లెట్ నోట్లో పెట్టుకోవటం చూసి నవ్వుకుంటూ.
“బొమ్మలు ఎందుకు… మనమే బొమ్మల పెళ్ళిలాగా చేసుకుందాం…” కళ్ళు మూసుకుని నోట్లో పెట్టుకున్న చాక్లెట్ అందుకో అన్నట్టు పెదవుల మధ్య పెట్టుకుని. వల్లి చెప్పింది అర్థం అయ్యి… ముందుకు వంగి తన పెదవులతో చాక్లెట్ తీసుకుని తన ఐడియాకి “సరే” అని సమాధానం ఇచ్చాడు.
***
“నీ వంట కోసం అయిన నిన్ను పెళ్లి చేసుకోవచ్చు…” అంది, తృప్తిగా తిని ప్లేట్ పక్కన పెట్టి చెయ్యి కడుక్కుంటూ.
“అంటే పెళ్లి చేసుకుని కూడా నేనే వంట చేయాలి అంటావా?” అన్నాడు నవ్వుతూ, మంచి నీళ్ళు ఇస్తూ తాగటానికి.
“వంట ఏంటి, అన్ని పనులు చేయాలి నాలాంటిదాన్ని చేసుకుంటే… “
“హా హా… పోని నువ్వే చేసుకో, అన్ని చేస్తా…”
అన్ని అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ.
చురకత్తిలాంటి చూపుతో కార్తిక్ వైపు చూసిన వల్లి చూపుకి, కార్తిక్ కళ్ళలో అల్లరి చూపు ఎదురు పడేసరికి తనకి తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వచ్చింది. “హ్మ్… ఇపుడు స్వీట్ తింటే బాగుంటుంది కదా…” అన్నాడు చాక్లెట్ చూపిస్తూ.
“ఇక్కడితో ఆపితే మంచిది సారు…” అంది చాక్లెట్స్ అందుకుని వెళ్లి బెడ్ మీద కూర్చుంటూ.
“ఆహా… సరే…” అంటూ, కార్తిక్ వెళ్లి వల్లి పక్కన కూర్చుని “కాసేపు పడుకుంటావా…?” అన్నాడు.
“నాకు నీ గుండెలపై పడుకోవాలని ఉంది…”
వల్లికి సమాధానం ఇవ్వకుండానే వెనకకి వాలి, రా అన్నట్టు చేతులు చాచాడు.
వల్లి కాస్త పైకి లేచి… కార్తిక్ పైకి వెళ్లి, అటో కాలు, ఇటో కాలు వేసి కార్తిక్ పైకి ఒరిగి అతని గుండెలపై తల పెట్టి, కళ్ళు మూసుకుంది.
పైన పడుకుంటా అంటే ఇలా అని ఊహించని కార్తిక్, వల్లి అలా పడుకునేసరికి మొదట షాక్ అయ్యి, తరువాత కోలుకుని రెండు చేతులతో గట్టిగా హత్తుకుని అలాగే పడుకున్నాడు.
“కార్తిక్…”
“హ్మ్…”
“బరువుగా ఉన్నానా…”
“ఏమే ఇలా పడుకుని బరువు ఉన్నానా… అని అడగకూడదు…”
“మరి ఏమని అడగాలి…”
“నేను నీపై ఉంటే ఏం సమాధానం ఇస్తావు…”, సమాధానం చెప్పలేక మాట మార్చాడు.
“ఇందాక ఏదో అడిగావు…”, కార్తిక్ అడిగిన దానికి సమాధానం ఇవ్వలేక తను మాట మార్చింది.
“హా హా హా… మర్చిపోయావు అనుకున్నా…” అన్నాడు.
“నిజంగా కావాలా!!” అంది… తల పైకి ఎత్తి .
“ఇలాంటి పొజిషన్ లో ఉండి వద్దు అనే మగాడు ఉంటాడా!!”
“నేను చెప్పేది నీ గుండెలపై…” కార్తిక్ మాటలో తేడా అర్థం అయ్యి.
“నేను అన్నది అదే…” అన్నాడు నవ్వుతూ.
“ఆహా…” అంటూ పైకి లేచి అలాగే అతని పై కూర్చుని… “నువ్వేం అల్లరి చేయను అంటేనే…” అంది.
“అంటే…” అని వల్లి నడుము మీద చెయ్యి వెయ్యబోతే… రెండు చేతులు పట్టుకుని ఆపి…
“అల్లరి చేస్తే ఊరుకోను ముందే చెబుతున్న, నీ చెయ్యి నన్ను ముట్టుకోకూడదు…” అంది రెండు చేతులు పట్టుకుని గట్టిగా.
“సరే నీ ఇష్టం…” అన్నాడు… రెండు చేతులు తల వెనుకకు పెట్టుకుని వల్లి కళ్ళలోకి చూస్తూ. కార్తిక్ కళ్ళలో మైకం తెలుస్తుంది వల్లికి.
“నాకు నేనుగా నీ చేతులు తీసేదాక చేతులు నీ తల క్రింద నుండి తీయకూడదు” అంది కార్తిక్ మీదకి వంగి.
“హ్మ్ సరే…” అన్నాడు కళ్ళు మూసుకుంటూ…
“కళ్ళు మూసుకుని ఉండకూడదు…”, ఆ కళ్ళలో మైకం చూడాలన్న చిలిపి కోరికతో.
“ఆహా…” అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.
“నీకే కాదు నాకు వచ్చు ఏడిపించడం…” అంటూ… ముందుకి వంగి, కార్తిక్ పెదవులని చేత్తో పట్టుకుని గట్టిగా లాగి వదిలింది.
“ఓయ్…” అతని మాట పూర్తయ్యేలోపు నోరు చేత్తో మూసి…
“నోటి నుండి మాట కూడా రాకూడదు…” అంది.
“ఏంటి…” అన్నాడు కనులతోనే ఆశ్చర్యంగా.
“ఇష్టం అయితేనే ఆడదాము, లేదంటే లేదు” అంది చెయ్యి తీస్తూ.
“హ్మ్… సరే… ఇక మాట్లాడను…” అన్నాడు.
“ఇది కోరిక కాదు…” అంది, మనసు లోతుల్లో ఎక్కడో చిన్న ఇబ్బంది అనిపించింది వల్లికి.
“మోహం… కోరిక కూడా ప్రేమలో భాగమే అని చెప్పింది నువ్వే కదా…” అంది మళ్ళి తనే.
“హ్మ్…” అన్నాడు నవ్వుతూ.
“ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే, అంతలా మనం ప్రేమించిన వాళ్ళకి దగ్గరగా ఉండాలన్న కోరిక, మనం వాళ్ళలో కలిసిపోవాలన్న మోహం అంతలా ఉంటుందా…?” అంది, కార్తిక్ పైకి ఒరిగి అతని నుదిటి మీద ముద్దు పెట్టి.
“హ్మ్…” అన్నాడు కళ్ళు మూసుకుని.
“మాటల్లో చెప్పలేని ప్రేమని, స్పర్శతో ఇంత అందంగా చెప్పొచ్చు అని ఇపుడే అర్థం అవుతుంది” అంటూ కార్తిక్ కనులపై ముద్దు పెట్టింది.
“చూసే జనాలకి ఇది కామం అనిపించవచ్చు కానీ, వాళ్లకేం తెలుసు ఈ క్షణం నీ పెదవులతో నా పెదవులు ముడి వేయపోతే నాలో రగిలే జ్వాలకి నేనే ఆహుతి అయిపోతాను అని, ఆ జ్వాలను ఆర్పటానికే… నీ పెదవుల తడి సాయం తీసుకుంటున్నాను అని…” అంటూ కార్తిక్ పెదవులని తన పెదవులతో కలిపింది. చేతులు వదులుకుని, వల్లి జుట్టులోకి వేళ్ళు పెట్టి తనకి సహకరించాలి అని ఉన్న, వదులుకోలేక వల్లి ప్రేమగా ఇచ్చే ఆ ముద్దును అలాగే ఆస్వాదించసాగాడు.
“ప్రతి మగాడికి ఓ ఆలోచన కదా… తామే రొమాంటిక్, తమకి తెలియనిది ఏది ఉండదు అని, కానీ ఒక్కసారి మౌనంగా మా ఊపిరి వెచ్చదనం, ఆ ఊపిరి చేసే శబ్ధం విని చూడు…” అంటూ కార్తిక్ చెవుల అంచులకి చేరి ముద్దాడుతూ ఆమె ఊపిరి అతని చెవులకి చేరవేసింది. చెవుల అంచులకి తగిలిన ఆ సెగ అతని శరీరం మొత్తాన్ని దహించేసేలా పాకింది అణువణువులో.
“ఈ క్షణం ఏం అనిపిస్తుంది తెలుసా… నీ ఒంటిలో అణువణువు నా పెదవుల తడితో నింపేయాలి, నీ శరీరం నాది అనుకుంటూ నీ శరీరం నుండి వచ్చే ఈ సుగంధం నాలో నింపేసుకోవాలి… ప్రతి మనిషి శరీరంలో ప్రతి భాగంలో ఓ ప్రేమని తెలిపే రుచి ఉంటుందట కదా… ఆ రుచుల సమ్మేళనం ఏంటో తెలుసుకోవాలని ఉంది…” అంటూ తన పెదవులని కార్తిక్ కంఠం మీద రాపిడి చేసింది.
“హా…” ఎంత వద్దు అనుకున్న కార్తిక్ పెదవుల నుండి శబ్ధం వచ్చింది.
“కాముడిగా మా శరీరంలో కోరిక నింపి మా ఒళ్లు జలదరింపు ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, మా మనసుకి కొత్త ఊహలు నేర్పి, ఆ ఊహల సామ్రాజ్యంలో మమ్మల్ని కొత్తగా విహరింపచేయాలి…” అంటూ కార్తిక్ ఎదపై పెదవులతో ముద్రలు వేసింది.
“హ్మ్…” కనులు తెరవడం కూడా భారమై తన్మయత్వంతో మైమరిచిపోయాడు కార్తిక్.
“మమ్మల్ని దోచుకోవడమే కాదు, మిమ్మల్ని మీరు అర్పించుకోవడం కూడా తెలిసి ఉండాలి…” అంటూ… కార్తిక్ ఎదపై ఉండి లేనట్టు ఉన్న జుట్టుని పంటితో పట్టి లాగింది.
“ఆ…” తియ్యటి బాధతో తుళ్ళిపడ్డాడు కార్తిక్.
“ప్రతి మగాడిలో ఆడతనం ఉంటుంది, అలాగే ప్రతి ఆడదానిలో కూడా మగతనం ఉంటుంది. ప్రేమగా తరిచి చూస్తే అపుడపుడు ఆ మగతనం మాలో కూడా మేల్కొంటుంది. మదన యుద్ధంలో రెచ్చిపోయి మిమ్మల్ని మా అల్లరితో సుఖతీరాలకి చేర్చాలని తాపత్రయపడతాము. కానీ అందుకు మా సిగ్గు సంకెళ్లు తెంచి మా ప్రేమకి బానిస అయ్యే ఆలోచన వస్తుందా…” అంటూ, కార్తిక్ మెడ పక్కగా భుజం మీద మునిపంటితో కొరికింది. ఎగసిన అలలా కార్తిక్ శరీరం జలదరించింది.
చేతుల సంకెళ్లు… ముడిపడి విడవడకూడదు అనే షరతు మధ్య నోటికి సంకెళ్లు… కార్తిక్ కి భరింపరాని భారంగా ఉన్నాయి. జలపాతం నుండి వచ్చే చిరుగాలి కూడా వీరి మధ్య దూరి చలి కాచుకోవాలి అనుకుంటూ ఆశపడి వారిని చేరేలోపే సెగకి ఆవిరై తేలిపోతుంది.
“మా అందాల బరువులపై మీ బల ప్రదర్శన కాదు, వాటిని ప్రేమగా మీ సొంతం అనుకుంటూ మీ పెదవుల తడి అద్దుతూ ఆర్తిగా మీలో కోరిక రగుల్చుకుంటూ, మా సిగ్గు పొరలను తొలగించే ఆట అవ్వాలి…” అంటూ, కార్తిక్ ఎదపై తన చేతి వేళ్ళ గోళ్ళతో చిన్నగా గీరుతూ ముగ్గువేయసాగింది.
“హ్మ్…”
“అందాల అంచులను పట్టి కొరుక్కు తినేయాలంత కసి చూపించటం కాదు, ప్రతి స్పర్శలో కొత్త అనుభూతి ఇస్తూ ఆ అనుభూతిలో కొత్త రుచులు తెలుసుకునే ఓపిక ఉండాలి…” అంటూ, కార్తిక్ ఎదపై తన పెదవులతో రాపిడి చేస్తూ ఎగిసిపడుతున్న ఆ ఎదపై ఓ పంటిగాటుని గుర్తుగా ఇచ్చింది.
“ఆహ్…” ఓ వేడి నిట్టూర్పు కార్తిక్ నోటి నుండి వచ్చింది.
వల్లి నుండి వచ్చే వేడి శ్వాస కార్తిక్ ఎదపై తగులుతుంటే, ఆలోచనలు కట్టు తప్పి ఆమెని అల్లుకుపోవాలన్న ఆశతో వల్లి పెట్టిన షరతులు మరిచి చేతులు విడుచుకుని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు.
వల్లిని కార్తిక్ చేతులు ముట్టుకున్న క్షణం వల్లి అతనిపై నుండి లేవటానికి ప్రయత్నం చేసింది. కార్తిక్ మరింత గట్టిగా హత్తుకునే ప్రయత్నం చేస్తుంటే…
“ఓడిపోయావు… వదులు ఇక…” అంది చేతులు వదిలించుకుంటూ.
“ఇది అన్యాయమే…” అన్నాడు.
“ఏదైన అనుకో…” నవ్వుకుంటూ చేతులు వదిలించుకుని కార్తిక్ పై నుండి లేచింది.
“హ్మ్ సరే… దేవి గారి ఆజ్ఞ…” అని నవ్వుకుంటూ వదిలేశాడు కార్తిక్.
కార్తిక్ పక్కకి జరిగి అతని గుండెలపై తల పెట్టుకుని
“కోపం వచ్చినట్టు ఉంది…” అంది నవ్వుతూ.
“కోపం కాదు తాపం…” అన్నాడు ఒక చెయ్యి వల్లి చుట్టూ వేస్తూ.
“సిగ్గు లేదు అసలు నీకు…” అంది గిచ్చుతూ.
“గుళ్ళో భగవద్గీత చదువుతూ అమ్మాయిలకు సైట్ కొట్టడం ఎంత తప్పో… ప్రేమించిన అమ్మాయితో ప్రేమని పంచుకునే క్షణంలో సిగ్గు పడటం కూడా అంతే తప్పు…” అన్నాడు గట్టిగా నవ్వుతూ.
“దేవుడా… అసలు నిన్ను…” అంటూ కార్తిక్ గుండెలపై నెమ్మదిగా కొట్టింది.
“ఆ దేవుడి గుళ్ల మీద కామశాస్త్ర బొమ్మలు ఎందుకు పెట్టారు? భక్తి ఎంత పవిత్రమో… రక్తి కూడా అంతే పవిత్రం అని చెప్పటానికి…” అన్నాడు వల్లి కళ్ళలోకి చూస్తూ.
“చాలు నాన్న… ఆపెయ్… నిన్ను వదిలితే…” అంతకుమించి మాట్లాడటానికి వల్లికి కూడా సిగ్గు వేసింది.
“హా… వదిలితే…” అన్నాడు రెట్టించి.
“ఇలాగే కాసేపు పడుకోవాలని ఉంది ప్రశాంతంగా…” అంది మాట మారుస్తూ, రెండు చేతులు కార్తిక్ పై వేసి.
“హ్మ్… సరే…” అంటూ… వల్లి తన గుండెలపై పడుకోవటానికి అనువుగా పడుకున్నాడు.
“అల్లరి చేయకు, మాట్లాడకు, నాకు నీ గుండె… నీ ఊపిరి శబ్ధం మాత్రమే తెలియాలి…” అంది కళ్ళు మూసుకుంటూ.
“హ్మ్… సరే…” అంటూ కార్తిక్ వల్లిని తన కౌగిలిలోకి తీసుకుని అలాగే పడుకున్నాడు.
***
సశేషం…