అంశం: చీకటి వెలుగులు
వెలుగు – చీకటి
రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
దివిటీ వెలుగులో కనిపించే ఆశల పల్లకి,
ఆశల సమరంలో ఆనందాల వెల్లువ,
కలల ప్రపంచంలో ప్రియురాలి హాసం,
మెలుకువలో చీకటి విషాద వలయాలు
నిశి రాతిరి స్నేహ గీతాల అల్లరి వల్లరి,
విరబోసె విజయాల వెలుగు వన్నెలు,
మండుటెండల్లో వెన్నెల సోయగాలు,
చల్లని గాలిలో నునువెచ్చని హారతులు
కష్టసుఖాలు మన సయ్యాటలు,
కలిమి లేములు పరిభ్రమణాలు,
వెలుగు చిరునవ్వులు చిందిస్తూ,
హాసముతో చిమ్మ చీకటి పారద్రోలు