అంశము: నిశిరాతిరి
నీరవ నిశీధి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: చంద్రకళ. దీకొండ
నీరవ నిశీధి నీడన
నిశిరాతిరి నిచ్చెనపై
నీవు నిలబడితే…
వినిపిస్తుంది గుండెకు…
వినిపించని నిదురరాని
కనురెప్పల సవ్వడి…!
గుప్పున తాకుతుంది ఊపిరికి…
రేకులు విప్పుకున్న మనసు
సంపెంగ వాసన …!
కనిపిస్తుంది మౌనపు
హద్దులు దాటిన ఆక్రోశాల,
ప్రేమావేశాల దృశ్యం…
మత్తులో తూగుతున్న చైతన్యచిత్రం…!
ప్రత్యక్షమౌతుంది…
అన్యాయాల,అక్రమాల, అన్నార్తుల
ఉగ్రనరసింహ రూపం…!!!