ఉగాది శుభాకాంక్షలు
యుగానికి ఆది అంటూ మొదలైన వేళ!
విక్రమార్కుని వధతో శాలివాహనయుగం సంతరించుకున్న వేళ!
అమరావతి వేదికగా శాతవాహన రాజ్యం ప్రారంభమైన వేళ!
గడప గడపలో మామిడాకుల తోరణాలు పలకరిస్తున్న వేళ!
తెలుగు కొత్త సంవత్సరం జిలుగులు పంచుతున్న వేళ!
మన ప్రతి సందర్భానికి ఉగాది పచ్చడి అద్దం పడుతున్న వేళ!
ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలతో ఈ ప్లవ నామ సంవత్సరం అడుగుపెడుతున్న వేళ!
ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!
ఈ తెలుగు సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
రచన : శివాంజనేయ రెడ్డి