మన పరిచయమే ఒక విచిత్రం
ఊహల్లో..
మన ఆలోచనలే అద్భుతం !
ఊహల్లో..
మన సంభాషణే ఒక కావ్యం
ఊహల్లో..
మన స్నేహమే ప్రబంధం !
ఊహల్లో..
మన భావాలే ఒక అద్భుతం
ఊహల్లో..
మన సాన్నిహిత్యమే అపూర్వం !
ఊహల్లో..
మన అంతరంగమే ఒక అనంతం
ఊహల్లో..
మనకంతా అలౌకికం !
ఊహల్లో..
మన అనుబంధమే ఒక అపురూపం
ఊహల్లో..
అది పొందాలి ఇక అమరత్వం !
ఊహల్లో..
మన అనుభూతుల కలబోతలో
ఊహల్లో..
మన కలయికకై కలవరింతలో..
ఈ ఊహలే నిజమైతే… మన ప్రణయమే ఓ కావ్యం కాదా!!
వై. మంజులత