ఆదర్శ మహిళ అమ్మ

ఆదర్శ మహిళ అమ్మ !

రచయిత :: Dr.అన్నపూర్ణ

మనో ధైర్యంతో మనసును దృడపరుచుకున్నావు,
కష్టాలకు వచ్చిన కన్నీరును ఆవిరి చేసుకున్నావు,
నిప్పులాంటి బాధలకు నిలదొక్కుకున్నావు,
ఎప్పుడూ నీ జీవితంలో వెనుకంజ వేయలేదు…
జీవితం ఒక ఎదురీతగా భావించి,
సమాజ వాస్తవ పరిస్థితులకు
విద్య ఆవశ్యకత స్మరణకు వచ్చి,
ఆడపిల్లలను ఉన్నత విద్యాసంపన్నులను చేసి, సమాజంలో ఒక ఉన్నతమైన ,
బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దినావు.
ఎందరికో నీవు ఆదర్శ మహిళగా,
ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తిదాతగా నిలిచావు.
తండ్రి లేని పిల్లలు ఎందరు
జీవితంలో ఎదిగారో తెలియదు కానీ
తల్లి ఉన్న పిల్లలు మాత్రం జీవితంలో బాధ్యతాయుతమైన విద్యావంతులుగా
ఎదిగినవారు ఎందరో… అందులో
మేము ముగ్గురం ఆడపిల్లలం..
పిల్లలను తీర్చిదిద్దిన మాతృమూర్తులకు
మాతృదినోత్సవ శుభకాంక్షలు.

Dr. P. Annapurna M.B.B.S, FEU, CAS.
P. Shailaja M. Tech, Ph.d (Research)
P.Swetha. B.Tech
Pawaan (HR. Mahindratech)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!