ఆనందమే ఆర్నవం

ఆనందమే ఆర్నవం

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: మక్కువ అరుణకుమారి

నిన్ను కలవక ముందు కేవలం నేనో అందమైన కొమ్మని.

కొమ్మ చాటున విరబూసిన మరందాల పరువాల పంచదార బొమ్మని.

ఎదలోన దాగున్న వేవేల భావాలను వ్యక్తపరచలేని అవ్యక్తీకరణ మౌనమునిని.

ప్రణయం అలల హోరులో తడిసి ముద్దయినా బైట పడని  గంభీర సంద్రాన్ని.

జ్వలించే విరహపు వేదనాగ్నిని.

పెల్లుబుకని లావాలా అణుచుకొన్న అగ్నిపర్వతాన్ని.

వేధించే  మనోఃనరకం అధిగమించలేక  రెక్కలు తెగిపడి విలవిలలాడుతున్న విహంగాన్ని.

దారం లేని ఆధారమై తోక తెగిపడివున్న అందమైన గాలిపటాన్ని.

మరి ఏ శుభమూహుర్తంలో నీవు నన్ను కలిసావో గానీ.

 జీవన బృందావనాన నీ చెలిమితో నెత్తావి మాధురులు నింపావు.

నిద్రాణమైన  హృదయ కవాటాలు తెరచి  స్వర్గం దారులు చూపావు.

శృతి తప్పిన జీవితం వీణను మోహాన రాగాలతో రవళింపజేసావు.

అంతే లేని నీ మమకారపు మాధుర్యంలో నను ఓలలాడించావు.

నీవిచ్చిన ప్రేరణతో మనసు పొరల్లో నిక్షిప్తమైన బీజాక్షరాలను వెలికితీసాను.

 నిత్యం నీ స్ఫురణతో  కమనీయ కవితా కుసుమాలు విరబూయిస్తున్నాను.

కవితా సాగరంలో ఎగిసిపడే కెరటమై ఆనందం ఆర్ణవమై ఊర్రూతలూగుతున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!