స్పూర్తి ప్రదాత మా బాసన్నయ్య

స్పూర్తి ప్రదాత మా బాసన్నయ్య

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: కె.కె.తాయారు

A man with great talent and extraordinary Intelligence is none other than my brother Mr. వింజమూరి వెంకట గోపాల కృష్ణ భాస్కర్ రావు.
నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. విపరీతమైన గౌరవం అభిమానం. మా అన్నయ్య ప్రతి పని చక్కగా ఒక పద్ధతి లో చేసేవాడు, చేయించేవాడు. ఇంటిలో కూరగాయలు పెంచడం దగ్గర్నుంచి పువ్వులు పళ్ళు ఇంట్లోనే ఎలా పెంచాలి, అని మాకు నేర్పించేవాడు. ఇంట్లో అందరూ ఒకే ఇంట్లో ఉండి సంతోషాలు పంచుకోవాలనే కోరిక, చాలా మంచి భావనలు కలిగినవాడు. అందరి బాగు మనది, అందరి బాగు మనకు కావాలి అన్నట్టు, చాలా చక్కగా చూశేవాడు.
చిన్నప్పుడే నాకు అమ్మ లేదని అమ్మ కంటే ఎక్కువగా పెంచాడు. తన తోటే గడిపేదాన్ని. అందుకే నా ప్రతి కదలికలో, ప్రతీ పనిలో, ప్రతీ భావనలో మా అన్నయ్య ప్రతిబింబిస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎత్తుకొని పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంటే మధ్యలో పాము అడ్డంగా ఉంటే తాడని తలిచి, దాన్ని కాలితో తోసేసాడు. అది పాము అని తెలిసి ఒక్క గెంతేసి, చేతులు వదిలేసినా నేను పడిపోలేదట అంటే అంత గట్టిగా పట్టుకుని వున్నానంట. అలాంటి బంధం.
మా అక్కకి రేడియో ప్రోగ్రాం అని పిలిచి విజయవాడకి తర్వాత ఉద్యోగం ఇచ్చారు తను బి‌.ఈడి. చేయాలి అని వెళ్ళిపోతాను అంటే చీరలు కొని ఆపేసాడు. అలాగే ఎవరికి మంచి అంటే వాళ్లకు కావలసింది చేసేవాడు. నాకు ప్రతి మొక్క యొక్క అవసరం దాని బాధ నాకు నేర్పించాడు. మురళి వాయించేవాడు, దానితో పాటు నేను పాడాల్సిందే, అంత శృతిలో నేను పాడితే తాను మరిచి ఆలా వాయిస్తూనే ఉండేవాడు. ఇంక మంచి చిత్రకారుడు పెన్సిల్ మాత్రమే ఉపయోగించి బొమ్మలు ఎన్ని గీసాడో..! కాలేజీలో లెక్చరర్స్ తరపున ఎప్పుడూ మొదటి బహుమతి తనదే. మంచి N.C.C ఆఫీసర్ మేజర్. మంచి కసరత్తు చేసావాడు. కర్రసాము వచ్చు. అందరి ప్రేమాభిమానాలు పంచుకోవడమే కాదు, తిరిగి అదే ప్రేమాభిమానాలు పంచి ఇచ్చేవాడు. ఏదీ రాదు తెలియదు ఆంటే ఒప్పుకునే వాడు కాదు. నేర్చుకునేదాకా వదులకు. అని చెప్పి నన్ను ప్రోత్సహించి నన్ను పెంచిన అన్నయ్య నా బాసన్నయ్య నాకు స్పూర్తి, నా ధ్యేయం, నా సర్వం.
నమస్తే నమస్తే నమస్తే!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!