పెళ్లి వయసులో మార్పు

పెళ్లి వయసులో మార్పు

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: ఆకినపల్లి రుత్విక సురేష్

ఇంటికి దీపం వలే వెలుగు ఇచ్చేది ఆడపిల్ల. ఆడపిల్లలేని ఇల్లు వెలుతురు లేనటువంటిది. కానీ కొంతమంది ఆడపిల్ల పుట్టిందని నెత్తిమీద కుంపటి లాగా భావిస్తారు. కానీ ఒకప్పటి రోజులు పోయాయి నేటి సమాజంలో ఆడపిల్ల ఏ విషయంలోనూ తక్కువ కాదు.

అన్ని రంగాలలో కూడా మగవారితో సమానంగా ఆడవారు రాణిస్తున్నారు. అలాంటి ఆడపిల్లకు “ఎప్పుడు పెళ్ళి చేసి అత్తవారింటికి పంపిద్దామా, మన బాధ్యతను తొలగించుకుందామా” అని చూసే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి.

ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళి వయసు 18 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు అది 21 సంవత్సరాలుగా మారింది.

ఆడపిల్ల పెళ్ళి వయసు 18 సంవత్సరాలు ఉన్నట్లయితే తక్కువ వయసులో తను పరిపక్వత చెందలేదు. తను మానసికంగా కూడా దృఢంగా ఉండలేదు.

అలాంటి వయసులో పెళ్ళి జరిగినట్లయితే తను తెలిసీ తెలియని వయసులో, ఇంటి పని భారం కావచ్చు. సంసార బాధ్యతలు నిర్వహించే విషయంలోను కావచ్చు, తను ఏ రకంగా కూడా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రం తనకు ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కనుక తన గర్భం దాల్చినట్లయితే గర్భస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు.

అంతేకాకుండా చదువుకునే అమ్మాయికే ఒకవేళ పెళ్ళి జరిగినట్లయితే తను అటు చదువుకునే కోరికను చంపుకోలేక ఇంటి పనులు చేయలేక సంసార బాధ్యత నిర్వహించలేక చాలా మధనపడే అవకాశం ఉంటుంది.

అందుకని అమ్మాయిల పెళ్ళి వయసు 21 సంవత్సరాలు ఉన్నట్లయితే తను చదువు విషయంలోనూ కుటుంబ బాధ్యతలు నేర్చుకునే విషయంలోనూ, అమ్మతోపాటు ఇంటి పనుల్లో చేసుకోవడం వల్ల తనకు కొంత బాధ్యత పెరుగుతుంది. అలాగే తన పెళ్ళి తర్వాత జీవితం కూడా బాగుంటుంది.

తను చదువుకొని తన బాధ్యత తెలుసుకొని ఒక మంచి స్థాయిలో తన కాళ్ళ మీద తను నిలబడే నమ్మకాన్ని  పొందగలుగుతుంది. అందుకని ఆడపిల్లల పెళ్ళి వయసు 18 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాలు పెంచడం అనేది సరైనది అని నా అభిప్రాయం.

అలాగే తల్లిదండ్రుల తల్లిదండ్రుల పెంపకంలోనూ మరియు చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనూ మార్పు రావాలని ఆశిద్దాం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!