అమ్మాయి అంటే…

అమ్మాయి అంటే…

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: నాగ నివేదిత. P

అమ్మాయి అంటే… అమ్మగా మారటం, కుటుంబ బరువు బాధ్యతలు తనవిగా మోయటం, అహర్నిశలు తన కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడటం మాత్రమే కాదు.

అమ్మాయిలకి అందలమెక్కే సాహసం ఉంది, అనుకున్నది సాధించే తెగువ ఉంది. దానికి సరైన ప్రోత్సాహం లభిస్తే ఆ అమ్మాయి ఎన్నో అద్భుతాలను చేయగలుగుతుంది.

పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇస్తున్న మన దేశంలో, 18 సంవత్సరాలు అమ్మాయికి పెళ్ళి చేసేందుకు కనీస వయసుగా చెప్పటం తప్పు కాదు.

కానీ , అది ఒకప్పటి మాట. ఆడపిల్లను కేవలం నాలుగు గోడలకే పరిమితం చేసి, తమ తలకు మించిన భారంగా భావించే రోజుల్లో ఎంత త్వరగా ఆమెకు పెళ్లి చేద్దామని ఎదురు చూసేవాళ్ళు తల్లిదండ్రులు!

కానీ, ప్రస్తుత పరిస్థితులు ప్రకారం ఆడపిల్లంటే అబల కాదు సబల అనేలా మారిపోయింది. రిక్షా తొక్కటం నుండి విమానం నడిపే వరకు, కూలీ పని నుండి కలెక్టర్ వరకు…

చందమామను చూపించి అన్నం పెట్టే దగ్గర నుంచి ఆ చంద్ర మండలాన్ని ఏలే వరకు… అన్ని ధైర్యంగా చేయగలుగుతోంది.

మగవారితో ఎందులోనూ తీసిపోము అని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తోంది.

తరాలు మారిన, యుగాలు మారినా సమాజం పోకడ మారటం లేదు. అందుకే ఆకాశాన్ని అందుకోవాలని ఎగురుతున్న అమ్మాయిల రెక్కలను కత్తిరించేందుకు, పెళ్ళి అనే బాధ్యతని, తాళి అనే పేరుతో మెడకి చుడుతున్నారు.

అందుకే అమ్మాయిల పెళ్ళి వయసు కనీసం 21 సంవత్సరాలు చేయటం వల్ల, వాళ్ళకు స్వేచ్ఛగా బ్రతికే కాలం పెరుగుతుంది. సాధించాలి అనుకున్న కలలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసేందుకు సమయం దొరుకుతుంది.

తమ లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేసేటప్పుడు ఎదుర్కొనే ఒడిదుడుకుల వలన జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం అలవాటు పడుతుంది.

అటుపైన పెళ్ళి చేసుకున్నా, వాళ్ళు తమ లక్ష్యాలతో పాటు కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ చక్కగా తమ జీవితాలను తీర్చిదిద్దుకోగలుగుతారు అనేది నా అభిప్రాయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!