గృహశోభ

గృహశోభ

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన : కె.కె. తాయారు

ముందు మాట: మనం ఇంటిని శుభ్రంగా దుమ్ము, దూసరం లేకుండా, బూజులు లేకుండా, ఆఖరికి కూర్చోడానికి ఉపకరించే ప్రతీ యొక్కటీ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి అనునిత్యం శుభ్రం చేస్తూనే ఉండాలి.
1). సోఫాలు అరివిగా సర్దుకోవాలి. చక్కగా సర్దిన తరువాత ఒక మూల కృష్ణుని విగ్రహము లేదా ఏ దైవ విగ్రహమైన లోపలికి వచ్చే వారికి కనిపించేట్టుగా అందంగా పెట్టాలి.
2). గోడల మీద ఫోటోలుతో నింపకుండా మంచి హస్తకళ నైపుణ్యంతో వేసిన మంచి చిత్రాన్ని పెట్టాలి. అది మనసుకి ఆహ్లాదకరంగా, చూడగానే సంతోషంతో కూడిన సుఖానుభవం కలగాలి
3). ఒక మూలగా మనీ ప్లాంట్ లేదా ఏదైనా ఇంటిలో పెట్టే చిన్న చెట్టుని పెట్టాలి అందంగా.

4). బొమ్మలు కబోర్డ్ ఉంటే దానిలో ప్రభోధాత్మకమైన సంగీతం, నాట్యం, మొదలైన కళళలకు సంబంధించిన, చిన్న చిన్న కొండపల్లి బొమ్మల సెట్లతో అలంకరించాలి.
5). మన నిపుణత తెలియాలంటే, తయారు చేసిన పూలు చిన్న చిన్న చెట్లు కబోర్డ్లో ఒకపక్క ప్రకృతి రమ్యంగా కనిపించేట్టు ఏర్పాటు చేయాలి.
6). ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ పెట్టి శుభ్రంగా ఉంచాలి.
7). వంట, భోజనంకి ఉపయోగించే గదులు చాలా శుభ్రంగా ఉండడమే కాకుండా, గజిబిజిగా ఉండకుండా చూసుకోవాలి. భోజనం చేసే రూములో, ఒక్క డైనింగ్ టేబుల్ ఉండాలి. పక్కన హ్యాండ్ వాషింగ్ సింక్ ఉండాలి. అక్కడే హ్యాండ్ వాషింగ్ సోప్ లిక్విడ్ లేదా, సోపు ఉండాలి. అక్కడే టవెల్ పెట్టడానికి ఉండాలి.
8). వంటింట్లో మహాలక్ష్మి కనిపించాలంటే శుభ్రతతో పాటు సామాన్లు పద్ధతిగా చక్కగా కావలసిన రీతిలో పెట్టుకోవాలి. మహా శోభాయమానంగా ఉండాలి.
9). మనం విశ్రాంతి తీసుకునే గదుల్లో మంచాలు, వాటి పైన పరుపులు, దుప్పట్లు ఎల్లప్పుడు శుచిగా, శుభ్రంగా ఉండాలి. ప్రతి మంచం దగ్గర కాళ్లు శుభ్రం చేసుకునే మ్యాట్ ఉండాలి.
10). భగవంతుని ప్రార్ధనా మందిరం, ప్రత్యేకంగా భగవంతుని కొరకే పూజ గది ఉండాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!