గృహ శోభ

గృహ శోభ

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: శ్రీ విజయ దుర్గ. ఎల్

ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా, పూరి గుడిసె అయినా, పెద్ద విల్లా లాంటి భవంతి అయినా.. గృహ శోభకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఎవరి స్తోమతకి తగినంతగా.. వాళ్ళు ఇంటిని అలంకరించుకోవాలని అనుకుంటారు. అయితే, స్తోమత కలిగిన వారు ఎంత ఖర్చు పెట్టి అయినా.. బయట వాళ్లకు నచ్చినది కొనుక్కోగలుగుతారు. కానీ.. పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్ళు ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకున్నా కానీ, అది వారికి అదనపు ఖర్చుగా అనిపించి, స్తబ్దులుగా ఉండిపోతారు. అలాంటి వారి కోసమే, ఈ చిట్కాలు. తక్కువ ఖర్చుతో ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకోవచ్చు.
1. ఫొటో ప్రేమ్స్:
మనం ఎన్నో ఫొటోస్ మదుర జ్ఞాపకంగా దాచుకుంటాము. ఆ ఫొటోస్ కోసం ఫొటో ఫ్రేమ్స్ మనమే సులభంగా చేసుకోవచ్చు. మనకు ఏదైనా వస్తువులను కొంటున్నప్పుడు వచ్చే, కాస్త గట్టిగా ఉండే అట్ట పెట్టలతో, ఫొటోస్ కోసం ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చు. ఫోటో కి సరిపడా సైజులో అట్టని కట్ చేసుకుని, యూట్యూబ్ హెల్ప్ తీసుకుని, ఫోటో ఫ్రేమ్ తయారు చేసుకుని, మన చిన్ననాటి ఫొటోస్ ని, మన పిల్లల ఫొటోస్ ని మనకు నచ్చిన రీతిలో ఇంటి గోడలకి అందంగా అలంకరించుకోవచ్చు.

2. క్లాత్ తో దేవుడి దండలు:
మన ఇంట్లో దేవుడి పటాలు ఉంచుకుంటాం. కొన్ని పెద్ద పెద్దవి కూడా పెట్టుకుంటాము. మనకి ఎంతో చౌకగా దొరికే పాలిస్టర్ క్లాత్ తో, కావలసిన షేప్ లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, సూది దారంతో మన ఇష్టానుసారంగా దండలు గుచ్చుకుని దేవుడు ఫోటోలకి వేసుకుంటే, ఎంతో కళగా కనిపిస్తాయి. ఇంటి గుమ్మాలకు కూడా ఈ విధంగా క్లాత్ తోటి రంగు రంగుల దండలు తయారు చేసుకుని వేసుకోవచ్చు.
3. పూజకి అలంకరణ:
ఫోమ్ షీట్స్ తో వివిధ రకాల పువ్వులను తయారు చేసి ఉంచుకుంటే, పూజా సమయంలో దేవుడి పూజకు సహజమైనవి వాడుకున్నా మిగిలిన అలంకరణకు ఇవి వాడుకోవచ్చు.
4. మొక్కల కుండీలు:
అందరికీ మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంటి లోపల కూడా పెంచుకోవాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం వారే స్వయంగా వారికి వృధాగా పడుకున్న వాటితో, తయారు చేసుకోవచ్చు. పిల్లల పాత టీ షర్ట్స్, ధలసరిగా ఉండే పాత బెడ్ షీట్స్ తో సిమెంట్ ఉపయోగించి నచ్చిన ఆకారంలో రకరకాల పూల కుండీలు చేసుకోవచ్చును. పాతవైపోయిన పాత ప్లాస్టిక్ గ్లాస్ లు, డబ్బాలను కాస్త రంగులు వేసి బాల్కనీలో వేలాడేలా పెట్టుకుని, అందులో చిన్న చిన్న మొక్కలు పెంచుకో వచ్చు.
5. ఫౌంటెయిన్:
ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. చాలా సింపుల్ గా కూడా మనకున్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ధర్మకోల్ ని కావాల్సిన రీతిలో తొట్టె లాగా తయారు చేసుకుని, పొడి సిమెంట్ తడిపి నాలుగైదు పొరలుగా ఆ థర్మకోల్ కి అప్లై చేస్తే, అది గట్టిగా తయారవుతుంది. చిన్న వాటర్ పంప్ మోటర్ మనకి బయట షాప్స్ లో దొరుకుతుంది. దానికి చిన్న గొట్టాన్ని అమర్చి, మనం తయారు చేసుకున్న తొట్టెలో నీళ్లు పోసి, మోటర్ పని చేసేలా చేస్తే, నిరంతరం నీటి ప్రవాహ సవ్వడి, ఆ ఇంటికి శోభతో పాటుగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది.
6. యూస్ అండ్ త్రో ప్లాస్టిక్ స్పూన్స్, గ్లిట్టర్ ఫోమ్ షీట్స్ ఉపయోగించి వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చును.
7. పేపర్ క్లాత్ బ్యాగ్స్ తో అందంగా అయినా ఫ్లవర్స్ ని తయారు చేసుకుని పెట్టుకోవచ్చు.
8. న్యూస్ పేపర్ ని ఉపయోగించి, చిన్న చిన్న గొట్టాలుగా తయారు చేసుకుని, వాటితో ఫ్లవర్ వాజ్ లను పెన్ స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు.
9. అల్మరాలలో డస్ట్ పట్టుకుండా ఉండడానికి పేపర్స్ వేస్తూ ఉంటాం. ఆస్తమాను వాటిని మార్చాల్సివస్తూ ఉంటుంది. అలా కాకుండా గిఫ్ట్స్ కి వచ్చే కలర్ షీట్స్ ని గాని, వాల్ పేపర్స్ గానీ అల్మరాలో వేసుకుంటే, లైట్ వేసినప్పుడు గ్లిటరీగా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. పొరపాటున ఏమైనా వలికినా, గుడ్డతో తుడుచుకుంటే ఈజీగా పోతుంది. డస్ట్ కూడా ఈజీగా తుడుచుకోవచ్చు.
10. ఇల్లు వచ్చిన తర్వాత చీపుర్లు, మాప్ స్టిక్స్ ఇలాంటి పెట్టుకోవడం కోసం, కాస్త సన్నగా పొడవుగా ఉండే అట్ట పెట్టి గాని, ప్లాస్టిక్ డబ్బాని గాని, సమానంగా కత్తిరించుకుని, అందులో సగం వరకూ ఇసుక రాళ్లతోటి నింపి, దాని పై వాడేసిన వాటర్ బాటిల్స్ సగానికి కట్ చేసి, ఆ ఇసు క లోపలికి వరుసగా అమర్చి పెట్టుకుని, చీపుర్లు అవి అందులో పెట్టుకుంటే, కిందన బరువు ఉంటుంది కాబట్టి! పడిపోకుండా ఉంటాయి. మాప్ స్టిక్స్ లాంటి వాటిని హ్యాంగ్ చేసుకునే లాగా పెట్టుకుంటే, ఎటువంటి ఇబ్బంది ఉండదు.

     

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!