రాజీపడక సాధించాలి (గేయం)

రాజీపడక సాధించాలి (గేయం)

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: చంద్రకళ దీకొండ

రాజీవ నయనాలు

రామ చిలుక పలుకులు

రాయంచ కులుకులు

రాగాల భోగాలు

రాకా పున్నమి సోయగాలు

రారమ్మని పిలిచే దరహాసాలు

రాగద్వేషాలు లేనివారు

రాణించాలి చదువులలో

రాజిల్లాలి భావి బ్రతుకులో!

రాముని సుగుణాలు తలచాలి

రాక్షస గుణములు త్రుంచాలి

రాదారిలోనే పయనించాలి

రాజీపడక ఆశయం సాధించాలి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!