బడి పిల్లలు (గేయకవిత)

బడి పిల్లలు (గేయకవిత)

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: పి. వి. వి. ఎన్. రాజకుమారి

పిల్లలం బడిపిల్లలం

భవితకు మేము వారసులం. /పిల్లలం/

ఆటల పాటల పేటికలం

రేపటి భారత  పౌరలం.

చదువులు ఎన్నో చదివేస్తాం

చక్కని నడవడి నడిచేస్తాం. /పిల్లలం/

తల్లి దండ్రుల కలలకు రూపం

కలల  సౌధాన్ని నిర్మిస్తాం.

గురువుల మాటలలో సారం

తరగని గనియె విజ్ఞానం. /పిల్లలం/

తీర్చి దిద్దెడి పసి పాపలం

దేశపు ఆశా కిరణాలం.

పెద్దల యందున గౌరవం

భయము భక్తితో మెలిగేస్తాం. /పిల్లలం/

లోకపు తీరుని ఎరుగని వారం

హరిశ్చంద్రునికి వారసులం.

తరతరాల సంస్కృతినీ

మోసుకు పోయే వీరులం. /పిల్లలం/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!